Wednesday, July 22, 2026 09:51 PM
Wednesday, July 22, 2026 09:51 PM

బుల్లితెరపై ఓజీ విధ్వంసం.. 28 ఏళ్ల తర్వాత ఈటీవీ చేతికి పవన్ మూవీ..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా, యంగ్ డైరెక్టర్ సుజీత్ తెరకెక్కించిన మోస్ట్ అవైటెడ్ గ్యాంగ్ స్టర్ యాక్షన్ డ్రామా ఓజీ థియేటర్లు, ఓటీటీలలో సంచలనం సృష్టించిన తర్వాత ఇప్పుడు బుల్లితెరపై రచ్చ చేసేందుకు సిద్ధమైంది. బాక్సాఫీస్ వద్ద ప్రపంచవ్యాప్తంగా రూ. 300 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను సాధించి పవర్ స్టార్ సంచలన కంబ్యాక్ చిత్రంగా నిలిచిన ఈ సినిమా.. టెలివిజన్ వీక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది. ఈ సినిమా శాటిలైట్ హక్కులను ప్రముఖ టెలివిజన్ నెట్‌వర్క్ ఈటీవీ భారీ ఫ్యాన్సీ రేటుకు దక్కించుకోవడం ట్రేడ్ వర్గాల్లో తీవ్ర ఆసక్తిని రేకెత్తిస్తోంది.

Also Read : భారతీయులకు యూఏఈ గుడ్ న్యూస్..!

తన సుదీర్ఘ టెలివిజన్ చరిత్రలో ఈటీవీ సంస్థ ఒక భారీ పాన్-ఇండియా యాక్షన్ ఫిల్మ్ రైట్స్‌ ను సొంతం చేసుకోవడం ఇదే తొలిసారి కావడం విశేషం. అంతేకాకుండా, 1998లో వచ్చిన బ్లాక్‌ బస్టర్.. సుస్వాగతం చిత్రం తర్వాత, దాదాపు 28 ఏళ్ల సుదీర్ఘ విరామానికి ఈటీవీ నెట్వర్క్ దక్కించుకున్న రెండవ పవన్ కళ్యాణ్ సినిమా ఓజీ కావడంతో మెగా అభిమానుల ఆనందానికి హద్దులు లేవు. ఇప్పటికే ఈటీవీ ఛానల్ ఓజీ కి సంబంధించిన హై-వోల్టేజ్ ప్రోమోలను అధికారికంగా ప్రసారం చేయడం ప్రారంభించడంతో బుల్లితెరపై ఇప్పుడే హంగామా మొదలైంది.

Also Read : టీడీపీ సోషల్ మీడియా దెబ్బకు దిగొచ్చిన టీటీడీ..!

తాజా సమాచారం ప్రకారం, ఈ భారీ గ్యాంగ్ స్టర్ డ్రామాను రాబోయే ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవం కానుకగా వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ చేయడానికి ఛానల్ యాజమాన్యం డేట్ ఫిక్స్ చేసింది. అంతేకాదు, ఆగస్టు 28న వచ్చే రాఖీ పౌర్ణమి కానుకగా కేవలం రెండు వారాల వ్యవధిలోనే ఈ చిత్రాన్ని మరోసారి రీ-టెలికాస్ట్ చేయడానికి కూడా ఏర్పాట్లు జరుగుతున్నాయి. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై డీవీవీ దానయ్య నిర్మించిన ఈ చిత్రంలో ప్రియాంకా అరుల్ మోహన్ హీరోయిన్‌గా నటించగా, బాలీవుడ్ స్టార్ ఇమ్రాన్ హష్మీ విలన్‌ గా మెప్పించారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

రాజీ కోసం జగన్...

ఏపీలో మద్యం కుంభకోణం కేసు విచారణ...

విజిలెన్స్ కమీషనర్‌గా అవినీతి...

జలయజ్ఞంలో ధనయజ్ఞం కమిషన్‌ల భాగస్వామి ఆరోపణలు...

ఆ కేసు విచారణ.....

తిరుమల తిరుపతి దేవస్థానం కల్తీ నెయ్యి...

పులివెందులకి జగన్‌ గుడ్‌...

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కీలకమైన క్రాస్‌...

ఉత్రరాంధ్ర.. ఇక ఉత్తమాంధ్ర.....

ఉత్తరాంధ్ర ప్రజలు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న భోగాపురం...

మంగళగిరిలో లోకేష్ మార్క్.....

మంగళగిరి నియోజకవర్గంలో దశాబ్దాలుగా నలుగుతున్న నిరుపేదల...

పోల్స్