Sunday, September 13, 2026 10:14 PM
Sunday, September 13, 2026 10:14 PM

భారతీయులకు యూఏఈ గుడ్ న్యూస్..!

సొంతంగా విదేశీ ప్రయాణాలు చేసే భారత పౌరులకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ప్రభుత్వం ఒక పెద్ద ఊరటనిచ్చే వార్తను అందించింది. ఇకపై అర్హులైన భారత పాస్‌ పోర్ట్ హోల్డర్లు యూఏఈ చేరుకున్న తర్వాతే నేరుగా వీసా ఆన్ అరైవల్ పొందేందుకు నిబంధనలను మరింత సరళతరం చేసింది. అయితే, కేవలం భారతీయ సాధారణ పాస్‌ పోర్ట్ ఉన్నంత మాత్రాన ఈ సదుపాయం లభించదని, ప్రయాణీకులు తమ పాస్‌ పోర్ట్‌ తో పాటు నిర్దేశిత దేశాల చెల్లుబాటు అయ్యే వీసా లేదా నివాస అనుమతిని కలిగి ఉండటం తప్పనిసరి అని స్పష్టం చేసింది.

Also Read : ఢిల్లీని వణికించిన కాంగ్రెస్ ధర్నా.. చెమటలు పట్టించారా..?

గతంలో కేవలం అమెరికా, బ్రిటన్, లేదా ఏదైనా యూరోపియన్ యూనియన్ సభ్య దేశాలకు చెందిన వాలిడ్ వీసా, గ్రీన్ కార్డ్ లేదా రెసిడెన్స్ పర్మిట్ ఉన్న భారతీయులకు మాత్రమే యూఏఈ ఈ వీసా ఆన్ అరైవల్ సదుపాయాన్ని కల్పించేది. కానీ, ఇటీవలి సవరణల ప్రకారం ఈ జాబితాను మరింత విస్తరించింది. ఇప్పుడు ఆస్ట్రేలియా, కెనడా, జపాన్, న్యూజిలాండ్, సౌత్ కొరియా మరియు సింగపూర్ దేశాల చెల్లుబాటు అయ్యే నివాస అనుమతులు ఉన్న భారతీయ పౌరులు కూడా యూఏఈలో నేరుగా వీసా ఆన్ అరైవల్ పొందవచ్చని యూఏఈ విదేశాంగ మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

Also Read : పార్లమెంట్‌ లో చర్చకు కేంద్రం సిద్ధం..? మోడీ కీలక ప్రకటన..!

ఈ సదుపాయాన్ని ఉపయోగించుకోవాలనుకునే భారతీయుల సాధారణ పాస్‌ పోర్ట్ కనీసం ఆరు నెలల చెల్లుబాటు వ్యవధిని కలిగి ఉండాలి. దాంతో పాటు సదరు ఆమోదిత దేశాల వాలిడ్ వీసా లేదా గ్రీన్ కార్డ్‌ ను ఇమ్మిగ్రేషన్ అధికారుల తనిఖీ కోసం వెంట ఉంచుకోవాలి. ఈ నిబంధనల ప్రకారం అర్హత సాధించిన వారికి సాధారణంగా యూఏఈలో 14 రోజుల పాటు బస చేసేందుకు వీసా మంజూరు చేస్తారు. అవసరమైతే నిర్దేశిత ఇమ్మిగ్రేషన్ నిబంధనలు మరియు ఫీజులను చెల్లించి, ఈ గడువును మరో 14 రోజుల పాటు ఒకసారి మాత్రమే పొడిగించుకునే అవకాశం ఉంటుంది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

కూటమిలో సీట్ల పంచాయతీ.....

ఆలు లేదు.. సూలు లేదు.. కొడుకు...

ఏపీ అభ్యర్థులకు అలర్ట్.....

ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా...

రమా నందనాను వెంటాడుతున్న...

లండన్‌లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మబలికి...

నల్లమల సాగర్‌లో కృష్ణమ్మ...

శ్రీశైలం నుంచి కృష్ణా జలాలు పరవళ్లు...

వల్లభనేని ఆస్తుల గుట్టు...

మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత వల్లభనేని...

DSC స్పోర్ట్స్‌ కోటా...

కష్టపడి పతకాలు సాధించి, అన్ని అర్హతలతో...

పోల్స్