Sunday, September 13, 2026 10:56 PM
Sunday, September 13, 2026 10:56 PM

పార్లమెంట్‌ లో చర్చకు కేంద్రం సిద్ధం..? మోడీ కీలక ప్రకటన..!

దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టిస్తున్న నీట్ పరీక్ష పేపర్ లీకేజీ వివాదం, నిరసనలపై పార్లమెంట్‌ లో పూర్తిస్థాయి చర్చకు తాము సిద్ధంగా ఉన్నామని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. మంగళవారం ఢిల్లీ వేదికగా ప్రతిపక్షాలు మరియు విద్యార్థి సంఘాలు చేపట్టిన భారీ ధర్నా నేపథ్యంలో ప్రభుత్వ వర్గాలు కీలక ప్రకటనలు చేశాయి. పేపర్ లీకేజీ వ్యవహారాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్రంగా పరిగణిస్తూ.. దీనిని ఒక ఘోర పాపంగా అభివర్ణించారు. యువత భవిష్యత్తుతో ఆడుకునే వారిపై కఠిన చర్యలు ఉంటాయని, ఈ విషయంలో రాజకీయాలకు అతీతంగా అందరూ కలిసి రావాలని ప్రధాని పిలుపునిచ్చారు.

Also Read : పాపం దాయది.. పేదరికం కోరల్లో పాకిస్తాన్..!

ఇదే సమయంలో, మంగళవారం ప్రధానమంత్రి నివాసం ముట్టడికి యత్నించి, ధర్నాకు దిగిన లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీని ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ తీవ్ర ఉద్రిక్తతల అనంతరం కేంద్ర ప్రభుత్వం ముందు రాహుల్ గాంధీ ఐదు ప్రధాన డిమాండ్లను ఉంచారు. నీట్ వైఫల్యానికి బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, హోంశాఖ మంత్రి అమిత్ షా తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. వీటితో పాటు పార్లమెంట్‌ లో చర్చ, నిరసనకారులపై దాడి చేసిన పోలీసులపై చర్యలు, మరియు విద్యార్థులకు ప్రధానమంత్రి క్షమాపణలు చెప్పాలని ఆయన పట్టుబట్టారు.

Also Read : ఎన్టీఆర్–త్రివిక్రమ్ మూవీలో బాలీవుడ్ బ్యూటీకి లైన్ క్లియర్..?

మరోవైపు ప్రతిపక్షాల ఆరోపణలను కేంద్రం తీవ్రంగా ఖండించింది. పేపర్ లీక్ అంశం తెరపైకి వచ్చిన వెంటనే కేంద్రం వేగంగా స్పందించి, సిబిఐ విచారణకు ఆదేశించిందని, ఇప్పటివరకు 13 మందికి పైగా నిందితులను అరెస్ట్ కూడా చేశామని ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సోషల్ మీడియా వేదికగా రాహుల్ గాంధీపై తీవ్రంగా మండిపడ్డారు. విద్యార్థుల సమస్యలపై పరిష్కారం కనుగొనడం కాంగ్రెస్ ఉద్దేశం కాదని, కేవలం పొలిటికల్ హెడ్‌ లైన్స్ కోసమే వారు పార్లమెంట్‌ను స్తంభింపజేస్తూ, విద్యార్థులను వాడుకుంటున్నారని ఆయన ధ్వజమెత్తారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

కూటమిలో సీట్ల పంచాయతీ.....

ఆలు లేదు.. సూలు లేదు.. కొడుకు...

ఏపీ అభ్యర్థులకు అలర్ట్.....

ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా...

రమా నందనాను వెంటాడుతున్న...

లండన్‌లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మబలికి...

నల్లమల సాగర్‌లో కృష్ణమ్మ...

శ్రీశైలం నుంచి కృష్ణా జలాలు పరవళ్లు...

వల్లభనేని ఆస్తుల గుట్టు...

మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత వల్లభనేని...

DSC స్పోర్ట్స్‌ కోటా...

కష్టపడి పతకాలు సాధించి, అన్ని అర్హతలతో...

పోల్స్