Wednesday, October 28, 2026 11:12 PM
Wednesday, October 28, 2026 11:12 PM

పాక్ చిల్లర బుద్ధి.. 10 బిలియన్ల కోసం బ్రోకర్ డ్రామా..?

తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న పాకిస్తాన్, తన విదేశీ మార్పిడి నిల్వలను పెంచుకోవడానికి మరియు రూపాయి విలువను స్థిరీకరించడానికి అమెరికా నుండి ఏకంగా 10 బిలియన్ డాలర్ల అంటే మన కరెన్సీలో సుమారు ₹84,000 కోట్లు.. కరెన్సీ మద్దతు సదుపాయాన్ని కోరింది. ఇరాన్ యుద్ధానికి సంబంధించిన దౌత్యపరమైన చర్చల్లో మధ్యవర్తిత్వం వహించినందుకు ప్రతిఫలంగా ఈ రకమైన ప్యాకేజీని అందించాల్సిందిగా పాకిస్తాన్ అధికారులు ట్రంప్ ప్రభుత్వంలోని కొత్త అమెరికా ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెస్సెంట్‌ ను సంప్రదించారు.

ALso Read : పాపం దాయది.. పేదరికం కోరల్లో పాకిస్తాన్..!

ఐదేళ్ల కాలపరిమితితో కూడిన ప్రత్యేక బైలేటరల్ ఎక్స్ఛేంజ్ స్టెబిలైజేషన్ సపోర్ట్ ఫెసిలిటీని.. ఏర్పాటు చేయాలని ఇస్లామాబాద్ ప్రతిపాదించింది. ప్రస్తుతం అంతర్జాతీయ ద్రవ్య నిధి నుండి పొందుతున్న 7 బిలియన్ డాలర్ల బెయిల్ అవుట్ ప్యాకేజీ కారణంగా పాకిస్తాన్ తీవ్రమైన పన్నుల భారం, ఖర్చుల నియంత్రణ వంటి కఠినమైన షరతులను ఎదుర్కొంటోంది. దీనివల్ల దేశంలో రాజకీయంగా, సామాజికంగా తీవ్ర ప్రజా వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ క్రమంలో నేరుగా అమెరికా ట్రెజరీ నుండి డాలర్ల రూపంలోనో లేదా స్వ్యాప్ ఒప్పందాల ద్వారానో ఆర్థిక సాయం అందితే, ఐఎంఎఫ్ నిబంధనల నుండి కొంత ఉపశమనం లభిస్తుందని మరియు చైనా, సౌదీ అరేబియా వంటి దేశాల రోల్‌ ఓవర్ రుణాలపై ఆధారపడటం తగ్గుతుందని పాక్ భావిస్తోంది.

ALso Read : బాక్సీ లుక్, ఆఫ్-రోడ్ టైర్లు.. మహీంద్రా సరికొత్త SUV డిజైన్ లీక్..!

ఇరాన్ సంక్షోభం నేపథ్యంలో అంతర్జాతీయంగా లభించిన దౌత్యపరమైన గుర్తింపును పాకిస్తాన్ తన ఆర్థిక ప్రయోజనాల కోసం వాడుకోవాలని చూస్తోంది. వాషింగ్టన్‌ తో వ్యూహాత్మక సంబంధాలను బలోపేతం చేసుకోవడమే కాకుండా క్రిప్టో, రియల్ ఎస్టేట్ మరియు మైనింగ్ రంగాలలో కూడా ట్రంప్ అధికార యంత్రాంగంతో లోతైన ఆర్థిక సహకారాన్ని విస్తరించుకోవాలని ఇస్లామాబాద్ గట్టిగా ప్రయత్నిస్తోంది. అయితే అమెరికా ట్రెజరీ ఇలాంటి అరుదైన స్థిరీకరణ నిధులను పాకిస్తాన్‌ కు మంజూరు చేస్తుందా లేదా అనేది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఆసక్తికరంగా మారింది.

సంబంధిత కథనాలు

- Advertisement -spot_img

తాజా కథనాలు

ఇంకా ఎంత కాలం...

మళ్లీ మళ్లీ అదే ఏడుపు.. ఇది...

బాబోయ్.. అక్టోబర్ నెల...

అక్టోబర్ నెల అంటే చాలు.. ఆంధ్రప్రదేశ్...

రూ. 3 వేల...

ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం జరుగుతున్న స్థానిక సంస్థల...

తుఫాన్‌ వేగంతో సహాయక...

ఆర్నబ్ తుపాను ప్రభావంతో కోస్తా జిల్లాల్లో...

ఏపీలో ఆ ప్రాంతాల్లో...

అర్నబ్ తుఫాను భీభత్సం ఆంధ్రప్రదేశ్‌లో జరగబోయే...

అమిత్‌షాకు సీఎం చంద్రబాబు...

అర్నబ్ అతి తీవ్ర తుపాను ఆంధ్రప్రదేశ్...

పోల్స్