Wednesday, July 22, 2026 08:31 PM
Wednesday, July 22, 2026 08:31 PM

రాజీ కోసం జగన్ ప్రయత్నాలు..!

ఏపీలో మద్యం కుంభకోణం కేసు విచారణ ముమ్మరంగా సాగుతోంది. వైసీపీ ప్రభుత్వ హయాంలో ఏకంగా రూ.3,800 కోట్ల కుంభకోణం జరిగిందని ఇప్పటికే ప్రభుత్వం గుర్తించింది. ఈ కేసులో వైసీపీలో ముఖ్యనేతలు సహా.. నాటి ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన అధికారులు కూడా అరెస్టు అయ్యారు. మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వర్రావు కుమారుడు సునీల్ అరెస్టు తర్వాత ఈ కేసులో తదుపరి అరెస్టు ఎవరిదనే చర్చ జోరుగా జరుగుతోంది. దీంతో వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కింగ్ పిన్ అని.. మద్యం కుంభకోణంలో అంతిమ లబ్దిదారు ఆయనే అనే ఆరోపణలు బాగా వినిపిస్తున్నాయి.

Also Read : లొంగే ప్రసక్తే లేదు.. ఇరాన్ ప్రెసిడెంట్ సంచలన ప్రకటన..!

ప్రస్తుతం ఒక టీ తాగినా కూడా యూపీఐ చెల్లింపులు చేస్తున్నారు. ఇక ప్రభుత్వ పథకాలకు చెల్లింపులన్నీ కూడా ఆన్ లైన్ ద్వారానే జరుగుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఐదేళ్ల వైసీపీ పాలనలో మద్యం అమ్మకాలు పూర్తిగా నగదు రూపంలోనే జరిగాయి. ఆ నగదు అంతా కేరాఫ్ తాడేపల్లి ప్యాలెస్‌కు చేరిందని టీడీపీ నేతలు తొలి నుంచి ఆరోపిస్తున్నారు. కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత మద్యం కుంభకోణంపై ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని నియమించింది ప్రభుత్వం. ఇదే సమయంలో ఇది రూ.4 వేల కోట్ల కుంభకోణం కాదని.. ఇది దేశంలోనే అతి పెద్ద కుంభకోణాల్లో ఒకటని పార్లమెంట్‌‌లో టీడీపీ ఎంపీ లావు కృష్ణదేవరాయలు ప్రస్తావించడంతో కేంద్ర దర్యాప్తు సంస్థలు సీబీఐ, ఈడీ రంగంలోకి దిగాయి.

ఈడీ రాకతో వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిలో భయం మొదలైనట్లు తెలుస్తోంది. మద్యం కుంభకోణం కేసు విచారణలో భాగంగా త్వరలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి కూడా ఈడీ నోటీసులు జారీ చేయనున్నట్లు ఇప్పటికే ఆ వర్గాల నుంచి సమాచారం అందుతోంది. అదే జరిగితే… ఆ తర్వాత అరెస్టు తప్పదంటున్నారు కూడా. ఓ వైపు వైసీపీలో కీలక నేతల అరెస్టు.. మరోవైపు తనకు ఈడీ నోటీసులనే పుకార్లతో పాటు తన అరెస్టు తప్పదనే భయం ప్రస్తుతం జగన్‌లో కనిపిస్తోందంటున్నారు సన్నిహితులు. అందుకే ఈ విషయంలో కేంద్ర పెద్దలతో రాజీ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రధాని మోదీ సహా కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షాను కలిసేందుకు జగన్ తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం.

Also Read : బ్యాక్ పాకెట్‌ లో వాలెట్ పెడుతున్నారా?

ఏపీలో లా అండ్ ఆర్డర్ సరిగ్గా లేదని.. మహిళలపై దాడులు జరుగుతున్నాయనే అంశంపై ఫిర్యాదులు చేసేందుకు అని పైకి చెబుతున్నప్పటికీ.. లోపల మాత్రం.. మోదీ, షా ద్వయంతో రాజీ చేసుకునేందుకు జగన్ తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నట్లు సన్నిహితుల మాట. వైసీపీ తొలి నుంచి బీజేపీని వ్యతిరేకించలేదని.. భవిష్యత్తులో కూడా బీజేపీకి అనుకూలంగానే ఉంటుందని చెప్పేందుకు జగన్ హస్తిన పెద్దలను కలవనున్నారనే ప్రచారం ఇప్పుడు పొలిటికల్ సర్కిల్‌‍లో హాట్ టాపిక్‌గా మారింది. మరి.. ఢిల్లీ పెద్దలు అభయం ఇస్తారా.. లేక కూటమి నియమానికి కట్టుబడి ఉంటారా.. చూడాలి.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

విజిలెన్స్ కమీషనర్‌గా అవినీతి...

జలయజ్ఞంలో ధనయజ్ఞం కమిషన్‌ల భాగస్వామి ఆరోపణలు...

ఆ కేసు విచారణ.....

తిరుమల తిరుపతి దేవస్థానం కల్తీ నెయ్యి...

పులివెందులకి జగన్‌ గుడ్‌...

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కీలకమైన క్రాస్‌...

ఉత్రరాంధ్ర.. ఇక ఉత్తమాంధ్ర.....

ఉత్తరాంధ్ర ప్రజలు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న భోగాపురం...

మంగళగిరిలో లోకేష్ మార్క్.....

మంగళగిరి నియోజకవర్గంలో దశాబ్దాలుగా నలుగుతున్న నిరుపేదల...

వైసీపీ నయా గేమ్...

ఏపీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలకు...

పోల్స్