Wednesday, July 22, 2026 09:28 PM
Wednesday, July 22, 2026 09:28 PM

ఆ కేసు విచారణ.. వెంకన్నకే ఎరుక..!

తిరుమల తిరుపతి దేవస్థానం కల్తీ నెయ్యి కుంభకోణం నిందితులపై చర్యలకు కాలయాపన వెనుక కారకులెవరు..? కారణాలేమిటి.. ? తిరుమల వెంకన్నకు ఎవరెవరు ఏ విధంగా అపకారం చేసినా.. ఆయనను మోసం చేసినా.. ఆయన పవిత్రత మంట గలిపినా.. శ్రీవారు వేసే శిక్షలు ముందు ముందు ఘోరంగా, భయంకరంగా ఉంటాయనేది భక్తుల నమ్మకం. శ్రీవారి పవిత్రతకు వైసీపీ ప్రభుత్వంలో భంగం కలిగింది. అందుకు కారకులు ఎవరైనా సరే.. మూల్యం చెల్లించుకున్నది మాత్రం మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మాత్రమే. ఎన్నికల్లో వైసీపీ ఘోరంగా ఓడిపోవటమే కాదు.. కేవలం 11 సీట్లు మాత్రమే రావటంతో ప్రతిపక్ష హోదా కూడా రాలేదు. ఇదంతా ఏడుకొండల వాడి మహిమ అని భక్తుల మాట కూడా.

Also Read : పులివెందులకి జగన్‌ గుడ్‌ బై..?

సిట్ ఇచ్చిన నివేదిక పైన విచారణలపై విచారణల కమిటీలు నియమిస్తూ.. కాలయాపన చేస్తూ.. సీఎం చంద్రబాబునాయుడు కూడా చేతులు దులుపుకుంటున్నారనే మాట ఇప్పుడు తెలుగుదేశం పార్టీలోనే వినిపిస్తోంది. శ్రీవారితో పెట్టుకున్నందుకే వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారం కోల్పోయారని.. ప్రతిపక్ష హోదా కోసం హైకోర్టు మెట్లు ఎక్కారని ఇప్పటికే విమర్శలు చేస్తున్నారు. నిందితులపై సకాలంలో చర్యలు తీసుకోకుండా, కమిటీల పై కమిటీలు నియమిస్తూ కాలయాపన చేస్తూ.. కల్తీ నెయ్యి కుంభకోణం నిందితులను పరోక్షంగా సీఎం చంద్రబాబు కాపాడుతున్నారన్న అభిప్రాయం ఇప్పుడు భక్తుల్లో ఉన్న అభిప్రాయం.

తిరుమలలో శ్రీవారి ప్రసాదాలకు ఉపయోగించే నెయ్యిని కల్తీ.. అసలు నిజమైన నెయ్యి అనేది లేకుండానే చేసిన.. నిందితులపై చర్యలు తీసుకునేందుకు సీఎం చంద్రబాబు పైన కేంద్ర పెద్దలు ఒత్తిడి తీసుకువస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆ ఒత్తిడికి చంద్రబాబు అంగీకరించారనే మాట వినిపిస్తోంది. కల్తీ నెయ్యి సరఫరాను కనిపెట్టిన ఐఏఎస్ అధికారి శ్యామలరావును బదిలీ చేశారు. కల్తీ నెయ్యి పై విచారణకు సుప్రీంకోర్టు నియమించిన అధికారుల పై ఎవరెవరి పై ఏయే ఒత్తిళ్లు వచ్చాయే మరి.. వారిచ్చిన రిపోర్టు తీరును పరిశీలిస్తే కొండను తవ్వి ఎలుకను పట్టినట్లుగా ఉందనే కామెంట్లు వచ్చాయి.

సెట్ ఇచ్చిన రిపోర్ట్ పరిశీలించి.. ఎవరి పైన ఏ చర్యలు తీసుకువాలనే విషయంపై నివేదిక ఇవ్వాలంటూ రిటైర్డ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేష్ కుమార్ ఆధ్వర్యంలో ఏకసభ్య కమీషన్ నియమించారు. ఆయన కూడా ఓ 15 రోజులు ఆ రిపోర్టు పరిశీలించి.. ఓ రిపోర్టు తయారు చేశారు. నిందితులపై ఎలాంటి చర్యలు తీసుకోవాలో ఓ నివేదిక తయారు చేసి చంద్రబాబుకే నేరుగా రిపోర్టు ఇచ్చారు. దినేష్ కుమార్ ఇచ్చిన నివేదిక పరిశీలించి.. ఎలాంటి చర్యలు తీసుకోవాలో వారం లూపే రిపోర్టు ఇవ్వాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్‌ ఆధ్వర్యంలో మరో కమిటీని ఏర్పాటు చేశారు. అయితే ఆ కమిటీ ఆరు వారాలు దాటినా కూడా.. ఇంత వరకు తమకు అప్పగించిన బాధ్యతలను నెరవేర్చలేదు. వారం ఇవ్వాలన్న ఆదేశాలు 6 వారాలు దాటినా అమలు కాలేదు.

Also Read : బాక్సీ లుక్, ఆఫ్-రోడ్ టైర్లు.. మహీంద్రా సరికొత్త SUV డిజైన్ లీక్..!

ఇక్కడ మరో విశేషం ఏమిటంటే.. ఇప్పటి వరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్.. ఆ నివేదికపై చర్చించేందుకు కనీసం ఒక్క సమావేశం కూడా నిర్వహించలేదని తెలుస్తోంది. దీనిని బట్టి దినేష్ కుమార్ ఇచ్చిన రిపోర్టులో ఉన్న నిందితులను కాపాడుతున్నదెవరనే విషయం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. సీఎస్ మీటింగ్ పెట్టేది ఎప్పుడు.. ఆ తర్వాత రిపోర్టు తయారు చేసేది ఎప్పుడు.. ఆ రిపోర్టు సీఎం చంద్రబాబుకు ఇచ్చేది ఎప్పుడూ.. ఆయన నిందితులపై చర్యలు తీసుకునేది ఎప్పుడు..? సుప్రీం కోర్టు ఆదేశాల ప్రకారం సిట్ అధికారులు విచారణ జరిపి అటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి.. ఇటు సుప్రీం కోర్టుకు కూడా నివేదిక ఇచ్చినట్లు సిట్ అధికారుల ద్వారా బయటకు లీక్ అయ్యింది. ఆ నివేదికను సుప్రీం కోర్టు సీరియస్‌గా తీసుకున్నట్లు కనిపించటం లేదు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రం.. సెట్ రిపోర్టుపై కమిటీల మీద కమిటీలు నియమించి చేతులు దులుపుకుంటున్నట్లు పరిస్థితి కనిపిస్తోంది. దీనిని బట్టి చూస్తే.. కల్తీ నెయ్యి కుంభకోణం కేసు నీరుగారినట్లే అనే అనుమానం కలుగుతోంది. నిందితులపై సకాలంలో చర్యలు తీసుకోకపోతే.. ఏడుకొండల వాడి ఆగ్రహానికి గురి కాక తప్పదని పార్టీ నేతలే భయపడుతున్నారు. మూల్యం భారీగా చెల్లించుకోవాల్సి వస్తుందేమో.. తస్మాత్ జాగ్రత్త.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

రాజీ కోసం జగన్...

ఏపీలో మద్యం కుంభకోణం కేసు విచారణ...

విజిలెన్స్ కమీషనర్‌గా అవినీతి...

జలయజ్ఞంలో ధనయజ్ఞం కమిషన్‌ల భాగస్వామి ఆరోపణలు...

పులివెందులకి జగన్‌ గుడ్‌...

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కీలకమైన క్రాస్‌...

ఉత్రరాంధ్ర.. ఇక ఉత్తమాంధ్ర.....

ఉత్తరాంధ్ర ప్రజలు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న భోగాపురం...

మంగళగిరిలో లోకేష్ మార్క్.....

మంగళగిరి నియోజకవర్గంలో దశాబ్దాలుగా నలుగుతున్న నిరుపేదల...

వైసీపీ నయా గేమ్...

ఏపీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలకు...

పోల్స్