తెలుగు సినీ ప్రేక్షకులు దశాబ్ద కాలంగా ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న ఐమ్యాక్స్ స్క్రీన్ హైదరాబాద్ నగరంలో మళ్లీ అడుగుపెట్టబోతోంది. దక్షిణ భారతదేశంలోనే మోస్ట్ ప్రీమియం మల్టీప్లెక్స్ బ్రాండ్‌గా ఎదిగిన ఏఎంబీ సినిమాస్ భాగ్యనగరంలో ఈ సరికొత్త విజువల్ వండర్‌ను ఏర్పాటు చేయడానికి సర్వం సిద్ధం చేసింది. ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సుదర్శన్ థియేటర్ స్థానంలో రూపుదిద్దుకుంటున్న ‘ఏఎంబీ క్లాసిక్ విక్టరీ’లో ఐమాక్స్ స్క్రీన్ సిద్ధమవుతోంది. సినిమా హాల్స్ ఎగ్జిబిషన్ రంగంలో సరికొత్త ప్రపంచ స్థాయి సాంకేతికతను ప్రేక్షకులకు పరిచయం చేయడంలో ఏఎంబీ సినిమాస్ ఎప్పుడూ ముందే ఉంటుంది. గతంలోనే సౌత్ ఇండియాలోనే మొట్టమొదటి డాల్బీ సినిమాను లాంచ్ చేసి సరికొత్త బెంచ్ మార్క్ సెట్ చేసింది. ఆ తర్వాత హైదరాబాద్‌లోనే ఫస్ట్ హెచ్‌డీఆర్ బై బార్కో స్క్రీన్ పరిచయం చేసి థియేటర్‌లో ప్రేక్షకులకు సరికొత్త విజువల్ ట్రీట్ అందించింది. ఇప్పుడు అదే లెగసీని మరింత ముందుకు తీసుకెళ్తూ ఏషియన్ గ్రూప్ ఈ చారిత్రాత్మక ఐమ్యాక్స్ స్క్రీన్ డీల్‌ను అఫిషియల్‌గా ఖరారు చేసింది.
Also Read : పెద్దికి షాక్ ఇచ్చిన తెలంగాణా హైకోర్ట్..!
ఈ సరికొత్త భారీ ప్రాజెక్ట్ కోసం ఏషియన్ గ్రూప్, సూపర్ స్టార్ మహేశ్ బాబుతో పాటు విక్టరీ వెంకటేష్, రాణా దగ్గుబాటి కూడా భాగస్వాములుగా చేతులు కలపడం ట్రేడ్ వర్గాల్లో పెద్ద హాట్ టాపిక్‌గా మారింది. టాలీవుడ్ అగ్ర హీరోలంతా ఒకే తాటిపైకి వచ్చి థియేటర్ల సాంకేతికతను పెంచేందుకు ఈ స్థాయిలో ముందడుగు వేయడం విశేషం. రెండు తెలుగు రాష్ట్రాల్లోని సినీ ప్రియులకు అత్యున్నత ప్రమాణాలతో కూడిన లావిష్ సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్ ఇవ్వడమే ఏకైక లక్ష్యంగా ఈ మల్టీప్లెక్స్‌ను నిర్మిస్తున్నారు. రాజమౌళి లాంటి వాళ్లు ఐమ్యాక్స్ ఫార్మాట్లోనే సినిమాలు తీయడం కలిసొచ్చే అంశం. ఈ ప్రతిష్టాత్మక ఐమ్యాక్స్ స్క్రీన్ కొలువుదీరబోతున్న లొకేషన్‌కు టాలీవుడ్‌లో ఎంతో అపురూపమైన చారిత్రాత్మక ప్రాధాన్యత ఉంది.
దశాబ్దాలుగా ఎన్నో గుర్తుండిపోయే క్లాసిక్ సినిమాలకు, ఊర మాస్ జాతరలకు సాక్ష్యంగా నిలిచిన పాత సుదర్శన్ 70ఎమ్ఎమ్ థియేటర్ స్థానంలోనే ఈ సరికొత్త థియేటర్ భవనం రూపుదిద్దుకుంటోంది. ఈ సాంస్కృతిక ప్రాధాన్యత కలిగిన ప్రాంతంలోనే అత్యాధునిక ఐమ్యాక్స్ లేజర్ టెక్నాలజీ తీసుకురావడం ద్వారా సుదర్శన్ నాటి వింటేజ్ లెగసీ సరికొత్త మోడ్రన్ అధ్యాయంలోకి అడుగుపెట్టబోతోంది. హైదరాబాద్ సినీ ప్రేక్షకులకు ఐమ్యాక్స్ ఫార్మాట్‌తో ఎంతో బలమైన ఎమోషనల్ బాండింగ్ ఉంది. ఒకప్పుడు దేశంలోనే బిగ్గెస్ట్ ఐమ్యాక్స్ స్క్రీన్‌గా నిలిచిన ప్రసాద్స్ ఐమ్యాక్స్ మూతపడిన తర్వాత సుదీర్ఘ కాలంగా ఇక్కడ మరో స్క్రీన్ అందుబాటులోకి రాలేదు. భారీ హాలీవుడ్ స్థాయి విజువల్స్ ఉన్న సినిమాలను ఐమ్యాక్స్ అనుభవంతో చూడటానికి ఇక్కడి జనాలు ఇతర రాష్ట్రాలకు వెళ్లాల్సి వచ్చేది. ఈ గ్యాప్ భర్తీ చేస్తూ ఏఎంబీ క్లాసిక్ విక్టరీ మల్టీప్లెక్స్ ద్వారా ఈ కల ఎట్టకేలకు సాకారం కాబోతోంది.
Also Read : ఎండాకాలంలో కోడిగుడ్లు తినవచ్చా..?
హైదరాబాద్ ప్రజలకు సినిమాపై ఉన్న ఆకలి, అపారమైన ప్రేమ ప్రపంచంలోనే ఎవరికీ లేదని, అంతటి గొప్ప సినీ నగరంలోకి మళ్లీ ప్రతిష్టాత్మకమైన ఐమ్యాక్స్ ఫార్మాట్‌ను తీసుకురావడం తమ బ్రాండ్‌కు దక్కిన అరుదైన గౌరవంగా భావిస్తున్నట్లు ఏషియన్ గ్రూప్ ప్రకటించింది. ఈ మల్టీప్లెక్స్ నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. త్వరలోనే ఈ ప్రీమియం డెస్టినేషన్ ప్రేక్షకులకు అందుబాటులోకి తీసుకురావడానికి పక్కా టైమ్ లైన్ సెట్ చేసుకున్నారు. వారణాసి, ‘స్పిరిట్’, ‘డ్రాగన్’ వంటి చిత్రాలను ఈ సరికొత్త ఐమాక్స్ స్క్రీన్‌పై చూడటానికి ఆడియన్స్ అప్పుడే కౌంట్ డౌన్ స్టార్ట్ చేశారు.

