Friday, May 22, 2026 05:06 PM
Friday, May 22, 2026 05:06 PM

కలవరపెడుతున్న రోహిత్ ఫిట్‌నెస్..!

భారత కెప్టెన్ రోహిత్ శర్మ 2027 వన్డే ప్రపంచ కప్‌లో పాల్గొనటంపై ఇప్పుడు బీసీసీఐలో ప్రధాన చర్చనీయాంశంగా మారుతోంది. 50 ఓవర్ ఫార్మట్‌కు అవసరమైన ఫిట్‌నెస్‌తో రోహిత్ ఉన్నాడా అనే అంశం ఇప్పుడు ఆందోళన కలిగిస్తోంది. తాజా నివేదికల ప్రకారం.. సెలెక్టర్లు, టీమ్ మేనేజ్‌మెంట్ రోహిత్ ఫిట్‌నెస్‌పై అనుమానం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. నిజానికి ప్రపంచ కప్ టోర్నీకి ఒక సంవత్సరం పైగా సమయం ఉంది. కానీ రోహిత్ బ్యాటింగ్ సామర్థ్యం ఇప్పటి నుంచే కలవరపెడుతోంది. టోర్నీ కోసం యువతతో పాటు సీనియర్ల అనుభవం కూడా ఉండాలనేది బీసీసీఐ పెద్దల మాట.

Also Read : మంత్రి గారి ప్రేమ మామూలుగా లేదుగా..!

ప్రస్తుతం టీమిండియాకు అందుబాటులో ఉన్న సీనియర్‌లలో రోహిత్, కోహ్లీ అత్యంత కీలకం. వీరిద్దరికీ ఇదే చివరి వరల్డ్ కప్ అనే మాట బాగా వినిపిస్తోంది. అయితే ఇద్దరి ఫిట్ నెస్‌ పైన అనుమానాలు వస్తున్నాయి. తనను తాను మళ్లీ ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదని ఇప్పటికే కోహ్లీ తేల్చేశాడు. కానీ రోహిత్ విషయంలో మాత్రం ఫిట్ నెస్ సమస్యగా మారింది. ప్రస్తుత ఐపీఎల్ సీజన్‌లో ముంబై ఇండియన్స్ తరఫున ఆడుతున్న రోహిత్.. గాయం కారణంగా కొన్ని మ్యాచ్‌లకు దూరంగా ఉన్నాడు. దీంతో రోహిత్ ఫిట్‌నెస్‌పై రకరకాల పుకార్లు షికారు చేస్తున్నాయి. రోహిత్‍‌ను ఇటీవల ఫిట్‌నెస్ కష్టాలు వెంటాడుతున్నాయి.

Also Read : షా దృష్టిలో చంద్రబాబు స్థానం ఏమిటీ..?

అనుభవజ్ఞుడైన ఓపెనర్.. ఇలా సమస్యలతో ఇబ్బందులు పడటం అభిమానులను కలవరపెడుతోంది. ముంబై ఇండియన్స్‌కు ఇంపాక్ట్ ప్లేయర్‌గా మాత్రమే రోహిత్ కనిపించాడు. కానీ ఐసీసీ టోర్నీల్లో ఇంపాక్ట్ ప్లేయర్ అనే నియమం లేదు. పైగా వన్డే మ్యాచ్ అనేది ఐపీఎల్‌తో ఏ మాత్రం పోలిక లేని టోర్నీ. కాబట్టి ఇక్కడికి, అక్కడికి పరిస్థితులు పూర్తిగా భిన్నం. దీర్ఘకాలిక ప్రపంచ కప్ ప్రణాళికలో భాగంగా హార్దిక్ పాండ్యాతో సహా ఇతర సీనియర్ ఆటగాళ్ల ఫిట్‌నెస్‌ను బీసీసీఐ నిశితంగా పరిశీలిస్తోందని నివేదికలు సూచిస్తున్నాయి. అయితే, 2027 ప్రపంచకప్‌ నాటికి రోహిత్‌ 40 ఏళ్ల వయసుకు చేరనున్నాడు. ఇదే ఇప్పుడు అతని ఆసక్తికరంగా మారింది. రోహిత్ శర్మ ఫిట్‌నెస్, వర్క్‌లోడ్ మేనేజ్‌మెంట్ భారత క్రికెట్ సర్కిల్‌లలో కీలకమైన అంశాలుగా మిగిలిపోతాయని భావిస్తున్నారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

మందుబాబులకు సర్కార్ షాక్..!

మందుబాబులకు భారీ షాక్ తగిలే సూచనలు...

కాక్రోచ్ జనతా పార్టీ...

ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా...

చిదంబరం వర్సెస్ లోకేష్.....

నియోజకవర్గాల పునర్విభజన అంశం ప్రస్తుతం దేశవ్యాప్తంగా,...

ఏపీలో రాజ్యసభ సందడి.....

ఏపీలో ఖాళీ అవుతున్న నాలుగు రాజ్యసభ...

షా దృష్టిలో చంద్రబాబు...

సీఎం చంద్రబాబు గురించి డిప్యూటీ సీఎం...

మీరు తేనెపూసిన కత్తులు.....

వైసీపీ అధినేత వైఎస్ జగన్ తాత.....

పోల్స్