Wednesday, July 8, 2026 04:20 AM
Wednesday, July 8, 2026 04:20 AM

మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్, కావ్యా మారన్ పెళ్లి..?

సౌత్ ఇండియన్ సినిమాలో.. ప్రస్తుతం మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ పేరు మార్మోగుతోంది. మన తెలుగులో కూడా వరుసగా సినిమాలు చేస్తూ బిజీ అయిపోయాడు. ఏ సినిమాకు సంగీతం అందించినా అది చార్ట్‌ బస్టర్‌ గా నిలవడమే కాదు, రికార్డులను తిరగరాస్తోంది. అయితే ఇప్పుడు అనిరుధ్ తన పాటల కంటే పర్సనల్ లైఫ్ కు సంబంధించిన వార్తలతో నేషనల్ వైడ్ గా హాట్ టాపిక్ అయ్యాడు. ఐపీఎల్ ఫ్రాంచైజీ సన్ రైజర్స్ హైదరాబాద్ ఓనర్ కావ్యా మారన్‌ తో అనిరుధ్ వివాహం జరగబోతోందనే వార్త ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది.

Also Read : ‘లూగర్’ వెనుక అంత అర్థం ఉందా?

తమిళ మీడియాలో వినిపిస్తున్న కథనాల ప్రకారం, అనిరుధ్, కావ్యా మారన్ కుటుంబాల మధ్య పెళ్లికి సంబంధించిన చర్చలు తుది దశకు చేరుకున్నాయని సమాచారం. అనిరుధ్ తండ్రి రవి రాఘవేంద్ర, సన్ గ్రూప్ అధినేత కళానిధి మారన్ కుటుంబంతో గత కొన్ని రోజులుగా టచ్‌ లో ఉన్నారని, ఇరు కుటుంబాలు ఈ బంధానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాయని టాక్ వినిపిస్తోంది. ముఖ్యంగా సూపర్ స్టార్ రజనీకాంత్ ఈ పెళ్లి విషయంలో మధ్యవర్తిత్వం వహిస్తున్నారనే వార్త ఈ ప్రచారానికి మరింత బలాన్ని చేకూర్చుతోంది.

Also Read : షా దృష్టిలో చంద్రబాబు స్థానం ఏమిటీ..?

అనిరుధ్.. రజనీకాంత్‌ కు స్వయానా మేనల్లుడు కావడంతో, ఈ సంబంధం మరింత క్రేజీగా మారింది. అనిరుధ్ గతంలో సన్ పిక్చర్స్ నిర్మించిన అనేక చిత్రాలకు సంగీతం అందించాడు. ఈ క్రమంలోనే కావ్యా మారన్‌ తో ఆయనకు పరిచయం ఏర్పడిందని, అది కాస్తా కాలక్రమేణా స్నేహంగా మారి ఇప్పుడు పెళ్లి పీటల వరకు దారి తీసిందని సోషల్ మీడియా కోడై కూస్తోంది. గతంలో కూడా వీరిద్దరూ కొన్ని ప్రైవేట్ ఈవెంట్లలో కలిసి కనిపించడం, ఐపీఎల్ మ్యాచ్‌ ల సమయంలో అనిరుధ్ సందడి చేయడం వంటివి ఈ రూమర్లకు ఆజ్యం పోశాయి. ఒకవేళ ఇదే నిజమైతే మాత్రం కోలీవుడ్‌ లో ఇది అతిపెద్ద సెలబ్రిటీ వెడ్డింగ్‌ గా మారుతుందని ఫ్యాన్స్ ఫిక్స్ అయిపోయారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

మాట నిలబెట్టుకున్న కూటమి...

ఏపీలోని రైతులకు ప్రభుత్వం తీపి కబురు...

ప్రభుత్వ లాయర్ల వైఫల్యమేనా..?...

ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్...

నాడు లేవని నోళ్ళు...

గత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో...

రేవంత్ క్యాంపు ఆఫీసుల...

తెలంగాణలో అధికార, ప్రతిపక్షాల మధ్య పెద్ద...

యూట్యూబర్ రావణ్.. ఇప్పట్లో...

ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్...

గవర్నర్ కోటా ఎమ్మెల్సీలు...

ఏపీలో ఖాళీ కానున్న గవర్నర్ కోటా...

పోల్స్