Wednesday, July 8, 2026 03:19 AM
Wednesday, July 8, 2026 03:19 AM

పాక్ బౌలర్ కు ఐపిఎల్ ఎంట్రీ క్లియర్..?

ఐపిఎల్ లో ఆడేందుకు పాకిస్తాన్ ఆటగాళ్లకు అనుమతి లేని సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఓ క్రికెటర్ కు మాత్రం అరుదైన అవకాశం వచ్చింది. పాకిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ మహ్మద్ అమీర్ బ్రిటీష్ పౌరసత్వం పొందడం ద్వారా ఈ లీగ్ ఆడే అవకాశాలు కనపడుతున్నాయి. తన భార్య నర్జిస్ ఖాన్ బ్రిటీష్ పౌరురాలు కావడంతో అమీర్‌కు యూకే పాస్‌పోర్ట్ లభించింది. ఈ పరిణామంతో అతను 2027 ఐపీఎల్ సీజన్ నుండి ఒక విదేశీ ఆటగాడిగా రిజిస్టర్ చేసుకునే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి.

Also Read : సీమపై గురిపెట్టిన లోకేష్..!

ఐపీఎల్ నిబంధనల ప్రకారం 2008 తర్వాత పాకిస్తాన్ ఆటగాళ్లను లీగ్‌ లో అనుమతించడం లేదు. అయితే గతంలో పాకిస్తాన్ సంతతికి చెందిన అజహర్ మహమూద్ బ్రిటీష్ పాస్పోర్ట్ పొంది ఐపీఎల్‌లో పంజాబ్, కోల్‌కతా జట్లకు ఆడిన దాఖలాలు ఉన్నాయి. ఇప్పుడు మహ్మద్ అమీర్ కూడా అదే బాటలో ఐపీఎల్ వేలంలోకి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నానని ఒక చాట్ షోలో స్పష్టం చేశాడు. ప్రస్తుతానికి 34 ఏళ్ల వయసున్న అమీర్, ఫ్రాంచైజీలు తనను ఎంపిక చేసుకుంటే ఐపీఎల్‌ లో ఆడటానికి ఎంతో ఆసక్తిగా ఉన్నట్లు తెలిపాడు.

Also Read : చిదంబరం వర్సెస్ లోకేష్.. అదిరిపోయే కౌంటర్..!

బ్రిటీష్ సిటిజన్‌ షిప్ వచ్చినప్పటికీ ఇంగ్లాండ్ కౌంటీ క్రికెట్‌ లో లోకల్ ప్లేయర్‌ గా ఆడటం అమీర్‌ కు అంత సులువు కాదు. అక్కడ నిబంధనల ప్రకారం గత 12 నెలల్లో ఐసీసీ పూర్తి స్థాయి సభ్య దేశంలో ఎలాంటి ప్రొఫెషనల్ క్రికెట్ ఆడి ఉండకూడదు. అమీర్ ఇటీవలే పాకిస్తాన్ సూపర్ లీగ్‌లో రావల్పిండి జట్టు తరఫున ఆడటం వల్ల ఈ నిబంధన అతనికి కాస్త ఇబ్బందికరంగా మారింది. ఏదేమైనా ఐపీఎల్ రూల్స్ అనుమతిస్తే మాత్రం 2027 ఐపీఎల్‌లో అమీర్ ఆడటం ఫ్రాంచైజీల కొనుగోలు నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

మాట నిలబెట్టుకున్న కూటమి...

ఏపీలోని రైతులకు ప్రభుత్వం తీపి కబురు...

ప్రభుత్వ లాయర్ల వైఫల్యమేనా..?...

ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్...

నాడు లేవని నోళ్ళు...

గత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో...

రేవంత్ క్యాంపు ఆఫీసుల...

తెలంగాణలో అధికార, ప్రతిపక్షాల మధ్య పెద్ద...

యూట్యూబర్ రావణ్.. ఇప్పట్లో...

ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్...

గవర్నర్ కోటా ఎమ్మెల్సీలు...

ఏపీలో ఖాళీ కానున్న గవర్నర్ కోటా...

పోల్స్