Friday, May 22, 2026 01:41 PM
Friday, May 22, 2026 01:41 PM

చిదంబరం వర్సెస్ లోకేష్.. అదిరిపోయే కౌంటర్..!

నియోజకవర్గాల పునర్విభజన అంశం ప్రస్తుతం దేశవ్యాప్తంగా, ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల్లో తీవ్ర చర్చకు దారితీస్తోంది. ఈ అంశానికి సంబంధించి కాంగ్రెస్ వ్యతిరేకంగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో 2026 తర్వాత జరిగే జనాభా లెక్కల ఆధారంగా పార్లమెంటు స్థానాల సంఖ్యను పెంచడం వల్ల దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యం తగ్గిపోతుందని మాజీ కేంద్ర మంత్రి పి.చిదంబరం ఆందోళన వ్యక్తం చేశారు. అయితే, ఆయన వ్యాఖ్యలను మంత్రి నారా లోకేష్ తీవ్రంగా తప్పుబట్టారు.

Also Read : షా దృష్టిలో చంద్రబాబు స్థానం ఏమిటీ..?

ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ వైఖరిని అవలంబిస్తోందని, దక్షిణాది ప్రయోజనాలను ఆ పార్టీయే రాజకీయాల కోసం పణంగా పెడుతోందని లోకేష్ మండిపడ్డారు. ఈ సందర్భంగా లోకేష్ ప్రధానంగా.. కాంగ్రెస్ పార్టీ గతంలో తీసుకున్న నిర్ణయాలను ఎండగట్టారు. 2026 జనగణన తర్వాత దక్షిణాది రాష్ట్రాలు పార్లమెంటులో తమ బలాన్ని కోల్పోయే ప్రమాదం ఉందని తెలిసినప్పుడు, ఆ పరిస్థితిని నివారించేందుకు కేంద్రం తెచ్చిన రాజ్యాంగ సవరణలను కాంగ్రెస్ ఎందుకు అడ్డుకుందని ఆయన ప్రశ్నించారు.

Also Read : మంత్రి గారి ప్రేమ మామూలుగా లేదుగా..!

కేవలం రాజకీయ ఉనికి కోసం దక్షిణాది భవిష్యత్తును బలిపెట్టడం సరైన వైఖరి కాదని, చిదంబరం వంటి అనుభవజ్ఞుడైన న్యాయవేత్తకు ఈ వాస్తవాలు తెలియకపోవడం ఆశ్చర్యకరమని లోకేష్ వ్యాఖ్యానించారు. మరోవైపు, ఎన్డీఏ ప్రభుత్వం ఈ విషయంలో పారదర్శకంగా ఉందని, ఏ రాష్ట్రానికి అన్యాయం జరగకుండా ఎంపీ స్థానాల పెంపుపై స్పష్టమైన ప్రతిపాదనలు సిద్ధం చేస్తోందని లోకేష్ స్పష్టం చేశారు. పునర్విభజన వల్ల వచ్చే అసమతుల్యతను సరిదిద్దడానికి ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుందని, అన్ని రాష్ట్రాల్లో సమానంగా ప్రాతినిధ్యం పెరిగేలా ప్లాన్ చేస్తోందని ఆయన వెల్లడించారు. ఉత్తర, దక్షిణ రాష్ట్రాల మధ్య అనవసరమైన విద్వేషాలను పెంచి పోషించకుండా, వాస్తవాలను గ్రహించి మాట్లాడాలని ఆయన హితవు పలికారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

కాక్రోచ్ జనతా పార్టీ...

ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా...

ఏపీలో రాజ్యసభ సందడి.....

ఏపీలో ఖాళీ అవుతున్న నాలుగు రాజ్యసభ...

షా దృష్టిలో చంద్రబాబు...

సీఎం చంద్రబాబు గురించి డిప్యూటీ సీఎం...

మీరు తేనెపూసిన కత్తులు.....

వైసీపీ అధినేత వైఎస్ జగన్ తాత.....

ప్రొ. నాగేశ్వర్ అబద్ధాల...

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత...

ఐఏఎస్‌ల అలక.. మంత్రులకు...

తెలంగాణలో మంత్రులకు, ఐఏఎస్‌లకు మధ్య కోల్డ్...

పోల్స్