ఏపీ ఐటీ శాఖా మంత్రి నారా లోకేష్.. రాయలసీమపై ఫోకస్ పెట్టారా..? అంటే అవుననే సమాధానం వినపడుతోంది. గత కొన్ని రోజులుగా సీమ జిల్లాలో పారిశ్రామిక పెట్టుబడులను పెంచడమే లక్ష్యంగా లోకేష్ దూసుకుపోతున్నారు. ఇందులో భాగంగానే, నేడు, రేపు రెండు రోజుల పాటు వైఎస్సార్ కడప, జమ్మలమడుగు నియోజకవర్గాల్లో లోకేష్ విస్తృతంగా పర్యటించనున్నారు. ఈ పర్యటనలో స్థానిక సేంద్రియ రైతులతో నేరుగా భేటీ కానుండటంతో పాటు, ఆయా ప్రాంతాల్లో నిర్మించిన 600 మెగావాట్ల సోలార్ ప్లాంట్ ను ఆయన అధికారికంగా ప్రారంభించబోతున్నారు.
Also Read : కేబినేట్ ప్రక్షాళనకు మోడీ ప్లాన్.. తెలంగాణాకు పెద్ద పీట..?
అదేవిధంగా నియోజకవర్గాల్లోని టీడీపీ కీలక నేతలు, కార్యకర్తలతో వరుస సమన్వయ సమావేశాలు నిర్వహించి స్థానిక పొలిటికల్ గ్రిప్ ను మరింత బలోపేతం చేయనున్నారు. వాస్తవానికి, గత వారం రోజులుగా రాయలసీమ గడ్డపై మంత్రి నారా లోకేష్ శరవేగంగా పర్యటనలు, పారిశ్రామిక ఒప్పందాలు జరుపుతున్నారు. ఇటీవల మే 15న సత్యసాయి జిల్లా పుట్టపర్తి వేదికగా సిఎం చంద్రబాబు, కేంద్ర రక్షణ మంత్రి రాజనాథ్ సింగ్ సమక్షంలో జరిగిన డీఆర్డీఓ రక్షణ రంగ మౌలిక వసతుల ప్రాజెక్టుల ప్రారంభోత్సవంలో లోకేష్ అత్యంత కీలక పాత్ర పోషించారు.
Also Read : గన్నవరం రాజకీయం.. మళ్లీ మారుతున్న లెక్కలు..!
రాయలసీమను ఏరోస్పేస్, డిఫెన్స్, ఆటోమొబైల్ రంగానికి కేరాఫ్ అడ్రస్ గా మార్చడమే లక్ష్యంగా మిషన్ రాయలసీమ ప్రణాళికను అమలు చేస్తున్నారు. కేవలం భారీ పరిశ్రమలే కాకుండా రాయలసీమ జిల్లాల్లోని నిరుద్యోగ యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలు కల్పించేలా నంద్యాల, కడప, కర్నూలు ప్రాంతాల్లో 850 ఎకరాలకు పైగా ఎంఎస్ఎంఈ పార్కులను అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది. ఇందులో కూడా లోకేష్ కీలక పాత్ర పోషిస్తున్నారు. అనంతపురం జిల్లా ధర్మవరం, బత్తలపల్లి ప్రాంతాల్లో ఇటీవల నిర్వహించిన మెగా ర్యాలీలలో లోకేష్ పాల్గొని, స్థానిక ప్రజలకు ఐటీ, డ్రోన్ ఇండస్ట్రీస్ ద్వారా ఉద్యోగాల కల్పనపై భరోసా ఇచ్చారు.

