Thursday, May 21, 2026 03:43 PM
Thursday, May 21, 2026 03:43 PM

‘లూగర్’ వెనుక అంత అర్థం ఉందా?

యంగ్ టైగర్ ఎన్‌టీఆర్, సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో వస్తున్న భారీ చిత్రం ‘డ్రాగన్’. ఎన్‌టీఆర్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన ఫస్ట్ గ్లింప్స్ ఇప్పటికే సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది. 4 నిమిషాల నిడివి ఉన్న ఈ గ్లింప్స్ అన్ని భాషల్లో కలిపి 24 గంటల్లోనే కోటికి పైగా వ్యూస్ రాబట్టింది. ఈ గ్లింప్స్‌ను థియేటర్‌లో చూసేందుకు ఎన్‌టీఆర్ ఫ్యాన్స్ చేసిన హంగామా మామూలుగా లేదు. అయితే గ్లింప్స్ చూసిన తర్వాత చాలా మంది సినీ విమర్శకులు మాత్రం.. ప్రశాంత్ నీల్ గత సినిమాలు కేజీఎఫ్, సలార్ మాదిరిగానే ఇది కూడా ఉందంటున్నారు.

Also Read : మెగా 158 కోసం రంగంలోకి ‘జైలర్’..!

ఇక డ్రాగన్ గ్లింప్స్‌లో ఎన్టీఆర్ పాత్ర పేరును ‘లూగర్’గా పరిచయం చేయడం అభిమానుల్లో తీవ్ర ఆసక్తిని రేకెత్తిస్తోంది. ప్రశాంత్ నీల్ తన సినిమాల్లో హీరోల పేర్లను శక్తిమంతంగా తీర్చిదిద్దుతారన్న విషయం తెలిసిందే. ‘కేజీఎఫ్’లో రాకీ, ‘సలార్’లో దేవా మాదిరిగానే ‘డ్రాగన్’లో ఎన్టీఆర్ పాత్రకు ‘లూగర్’ అనే పేరు పెట్టడం వెనుక ప్రత్యేక కారణం ఉన్నట్టు తెలుస్తోంది. ‘లూగర్’ అనేది ప్రపంచ యుద్ధాల కాలంలో జర్మనీ సైన్యం వాడిన ఒక క్లాసిక్ పిస్టల్. అత్యంత కచ్చితమైన లక్ష్యానికి, ప్రాణాంతకమైన వేగానికి ఇది ప్రసిద్ధి. ఈ నేపథ్యంలో సినిమాలో ఎన్టీఆర్ పాత్ర కేవలం ఒక వ్యక్తిలా కాకుండా, శత్రువులను వేటాడే ఆయుధంలా ఉండబోతోందని ఈ పేరు సూచిస్తోంది. కాగా, ఈ విష‌యంపై చిత్ర‌బృందం ఇంకా స్పందించ‌లేదు. అయితే, ‘లూగ‌ర్’ అనే ప‌దానికి గూగుల్, వీకిపిడియాలో మాత్రం ఈ అర్థం క‌నిపిస్తుంది.

Also Read : ఎండదెబ్బకు జీర్ణక్రియ అస్తవ్యస్తం.. ఏం జరుగుతాయో తెలుసా..?

ఈ చిత్రం 1967 కాలం నాటి అంతర్జాతీయ ఓపియం..నల్లమందు స్మగ్లింగ్ మాఫియా నేపథ్యంలో సాగే పీరియడ్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతోంది. బ్రిటిష్ వారు దేశం విడిచి వెళ్లాక, ఓపియం వ్యాపారం ‘ఆఫ్ఘన్ ట్రేడింగ్ కంపెనీ’, ‘గోల్డెన్ ట్రేడింగ్ కంపెనీ’లుగా విడిపోతుంది. ఈ రెండు కంపెనీల మధ్య ఆధిపత్య పోరు, రక్తపాతం చుట్టూ కథ నడుస్తుంది. ఇందులో ఎన్టీఆర్ ‘ఆఫ్ఘన్ ట్రేడింగ్ కంపెనీ’కి చెందిన ‘అసాసిన్-ఇన్-చీఫ్’గా కనిపించనున్నారు. ఈ సినిమాలో ఎన్టీఆర్ పక్కన రుక్మిణీ వసంత కథానాయికగా నటిస్తుండగా, నార్కోటిక్స్ బ్యూరో చీఫ్ ‘రఘువీర్ రాథోడ్’ అనే కీలక పాత్రలో బాలీవుడ్ నటుడు అనిల్ కపూర్ కనిపించనున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ చిత్రంపై అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. ఈ సినిమాను 2027 జూన్ 11న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ఇప్ప‌టికే అధికారికంగా ప్రకటించింది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

విశాఖకు కేంద్రం బిగ్...

ఐటీ రంగానికి హబ్ గా మారుతోన్న...

59 ఏళ్ళ తర్వాత...

తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ చేపట్టిన...

గన్నవరం రాజకీయం.. మళ్లీ...

గన్నవరం అసెంబ్లీ నియోజకవర్గంలో రాజకీయాలు మళ్లీ...

టీ బీజేపీలో భారీ...

తెలంగాణ రాజకీయాల్లో సంచలనంగా మారిన బండి...

కేంద్రానికి విజయ్ బిగ్...

తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త రికార్డులు సృష్టిస్తూ...

ముందస్తు ఎన్నికలకు రెడీ...

తమిళనాడు రాజకీయాలు మరోసారి సంచలనంగా మారాయి....

పోల్స్