మెగాస్టార్ చిరంజీవి, మాస్ డైరెక్టర్ బాబీ కొల్లి కాంబినేషన్‌లో వస్తున్న కొత్త చిత్రం గురించి వరుస అప్‌డేట్లు సినిమాపై అంచనాలను పెంచుతున్నాయి. ఈ ప్రతిష్ఠాత్మక చిత్రం ఈ నెల 21న పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా చిత్రబృందం ఒక కీలక ప్రకటన చేసింది. ‘జైలర్’, ‘డాకు మహరాజ్’ వంటి విజయవంతమైన చిత్రాలకు పనిచేసిన ప్రముఖ సినిమాటోగ్రాఫర్ విజయ్ కార్తీక్ కన్నన్‌ను ఈ ప్రాజెక్ట్‌లోకి తీసుకున్నట్లు అధికారికంగా ప్రకటించింది. విజయ్ పుట్టినరోజున ఈ ప్రకటన చేయడం విశేషం. ఈ సినిమా కోసం మెగాస్టార్ చిరంజీవి పూర్తిస్థాయిలో సిద్ధమవుతున్నారు.
Also Read : బెంగాల్‌లో బుల్‌డోజర్లు.. సువేందు భారీ ఆపరేషన్..!
ఇటీవల ఆయన జిమ్‌లో తీవ్రంగా కసరత్తులు చేస్తున్న వీడియోను సోషల్ మీడియాలో పంచుకున్నారు. “ప్రతిరోజూ పరిమితులను అధిగమించడానికి ఒక కొత్త అవకాశం. #Mega158 కోసం నా ప్రియమైన బాబీతో మరో గుర్తుండిపోయే ప్రయాణానికి ఉత్సాహంగా, సిద్ధంగా ఉన్నాను. మే 21న ప్రారంభోత్సవం” అని ఆయన తన పోస్ట్‌లో పేర్కొన్నారు. ఈ పాత్ర కోసం చిరంజీవి ప్రత్యేకమైన శిక్షణ తీసుకుంటూ తన శరీరాకృతిని మార్చుకుంటున్న తీరు అభిమానులను ఆకట్టుకుంటోంది. గతంలో చిరంజీవి పుట్టినరోజున ఈ సినిమాను ప్రకటించారు. అప్పుడు విడుదల చేసిన పోస్టర్‌లో గోడను చీలుస్తున్న గొడ్డలి, రక్తపు మరకలతో పాటు ‘ది బ్లేడ్ దట్ సెట్ ది బ్లడీ బెంచ్‌మార్క్’ అనే ట్యాగ్‌లైన్ సినిమాపై క్యూరియాసిటీని పెంచింది.
Also Read : కులగణ జరగాల్సిందే.. సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్..!
ప్రముఖ నిర్మాణ సంస్థ కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై వెంకట్ కె నారాయణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమా గురించి మరో కీలక అప్‌డేట్ ఇచ్చింది చిత్ర యూనిట్. ఈ సినిమాకు సెన్సెషనల్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ సంగీతం అందిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. మాస్ ఎంటర్‌టైనర్‌కు తమన్ అదిరిపోయే బాణీలు అందించనున్నారని వెల్లడించారు. మెగాస్టార్ మాస్ ఎలివేషన్లకు, డ్యాన్సులకు తగ్గట్టుగా పక్కా లోకల్ అండ్ ఎనర్జిటిక్ మ్యూజిక్ ఇవ్వడంలో తమన్ సిద్ధహస్తుడు. ఈ ప్రాజెక్ట్‌పై ఇప్పటికే అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ‘వాల్తేరు వీరయ్య’ వంటి బ్లాక్‌బస్టర్ విజయం తర్వాత చిరంజీవి, బాబీ కొల్లి కాంబినేషన్‌లో వస్తున్న రెండో సినిమా కావడంతో #Mega158పై ట్రేడ్ వర్గాల్లో, అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ హై-వోల్టేజ్ ఎంటర్‌టైనర్ ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని ఇస్తుందని చిత్రబృందం ధీమా వ్యక్తం చేస్తోంది.

