Sunday, September 20, 2026 08:51 AM
Sunday, September 20, 2026 08:51 AM

పంచాయితీ రాజ్ శాఖలో వారిదే పెత్తనం..!!

పాలించే రాజు మాత్రమే నిజాయితీగా ఉంటే సరిపోతుందా.. తన సహచర మంత్రులు కూడా నిజాయితీతో పని చేసినప్పుడే అనుకున్న ఫలితాలు వస్తాయి. ఒక రాజు గారి రాజ్యంలో ఒక శుభకార్యం కోసం పాలు కావాల్సి వచ్చింది. గేదెలు వున్న రైతులందరూ తప్పని సరిగ్గా పాలు పోయాలని రాజు గారు చాటింపు వేయించారు. పాల కోసం గంగాళాలు ఏర్పాటు చేశారు. గేదెలున్న రైతులంతా గంగాళాల్లో పాలు పోశారు. ఆ గంగాళాల్లో తీసుకెళ్లేందుకు వచ్చిన రాజుగారి సేవకులు అందులో నీళ్లు చూసి ఆశ్చర్యపోయారు. ఎందుకంటే.. ఆ గంగాళాల్లో ఉన్నవి నీళ్లు మాత్రమే. అసలు విషయం ఏమిటంటే.. అందరు పాలు పోస్తారు కాబట్టి.. నేను పోసే నీళ్లు ఆ పాలల్లో కలిసిపోతాయిలే అని అంతా నీళ్లే పోశారు.

Also Read : షా దృష్టిలో చంద్రబాబు స్థానం ఏమిటీ..?

ఇక్కడ రాజు గారెంటే డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. మంత్రులంటే.. ఇద్దరు ఇంజనీర్ ఇన్ చీఫ్.. ఈఎన్‌సీలతో పాటు జిల్లా స్థాయి ఇంజినీర్లు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రిగా పవన్ వ్యవహరిస్తున్నారు. డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత పవన్ కళ్యాణ్‌తో పాటు ఆయన పేషీ అధికారులపైన ఒక్క అవినీతి ఆరోపణ కానీ, అక్రమాలకు పాలపడినట్లు గానీ విమర్శలు, రాలేదన్నది నూటికి నూరు శాతం నిజం. ఆయన నిర్వహిస్తున్న పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలకు జాతీయ స్థాయిలో గుర్తింపు అవార్డులు కూడా వచ్చాయి. కానీ ఆ శాఖలో ఇద్దరు ఈఎన్‌సీల పేరుతో కొందరు మధ్యవర్తులు అవినీతికీ పాలపడుతున్నారని ఇప్పుడు పెద్ద ఎత్తున ఫిర్యాదులు వస్తున్నాయి.

అయితే ఎన్ని ఫిర్యాదులొచ్చినా కూడా పట్టించుకోకుండా, మెతక వైఖరి ఆవలింభించటంతో ఆ ఇద్దరు ఈఎన్‌సీల మధ్యవర్తులు మరింత రెచ్చిపోయారనేది ఇప్పుడు ఆ శాఖలో వినిపిస్తున్న మాట. ఇద్దరు ఈఎన్‌సీల పేరు చెబుతున్న మధ్యవర్తులు.. పనులు ఇప్పిస్తామని… బిల్లులు క్లియర్ చేయిస్తామంటూ కాంట్రాక్టర్ల నుంచి లక్షలు వసూలు చేస్తున్నారని సచివాలయంలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. పవన్ కళ్యాణ్‌తో పాటు ఆయన పేషీ అధికారులు కూడా నిజాయితీగా వ్యవహరిస్తున్నారు. కానీ ఉద్యోగుల బదిలీలు, పోస్టింగ్‌లలో ఆ ఇద్దరు ఇంజనీర్ ఇన్ చీఫ్‌ల పేరుతో వారి కార్యాలయాల్లో పని చేస్తున్న కొందరు సిబ్బంది లక్షలు వసూలు చేస్తున్నట్లు బయటకు వచ్చింది.

Also Read : మీరు తేనెపూసిన కత్తులు.. జగన్ పై విరుచుకుపడ్డ పార్థసారథి రెడ్డి

ఇద్దరు ఇంజనీర్ ఇన్ చీఫ్‌ల వ్యవహారంపైన, మధ్యవర్తులుగా వ్యవహరిస్తున్న వ్యక్తుల పైన కొందరు నేరుగా పవన్ కల్యాణ్‌కు కూడా ఫిర్యాదు చేసినట్లు సమాచారం. ఈ విషయం తెలిసినా కూడా పవన్ కళ్యాణ్ కఠినంగా వ్యవహరించకపోవడంపై ఆయా శాఖల ఉద్యోగులు ఆశ్చర్యపోతున్నారు. ఇది అవినీతికి లైసెన్స్ ఇచ్చినట్లు అయ్యిందన్న విమర్శలు వచ్చాయి. పవన్ కళ్యాణ్ మంచితనంతో పాటు, మాజీ శాఖాధిపతి ఉదాసీనత కూడా అవినీతి ఆరోపలున్న వారికి అనుకూలంగా కలిసొచ్చాయి. ఇప్పటి కైన పవన్ కళ్యాణ్ కఠినంగా వ్యవహరించకపోతే ఆ ఇద్దరు ఇంజనీర్ ఇన్ చీఫ్‌లు మరింత రెచ్చిపోవటం ఖాయం. దానికి ముఖ్య కారణం ఏమిటంటే.. వారి రిటైర్‌మెంట్ సర్వీస్ దగ్గర పడటమే..!

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

తిరుమల లడ్డూ పై,...

ఈడీ అంటే ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌.. ఈ...

ఇప్పటికీ వారికే పదవులు.....

కూటమి ప్రభుత్వం ఏర్పడి, దాదాపు రెండున్నర...

సాయిరెడ్డి.. నెట్టుకు రాగలరా.....

కొత్త ఎపుడూ వింతే. అందుకే కొత్తగా...

25 రోజుల తర్వాత...

ఏపీ డిప్యూటి సీఎం, జనసేన అధినేత...

ఏపీలో మద్యం షాపుల...

ఆంధ్రప్రదేశ్‌లో 2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను...

బాంబు పేల్చిన టీడీపీ...

గుంటూరు పశ్చిమ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ...

పోల్స్