Saturday, August 22, 2026 02:38 AM
Saturday, August 22, 2026 02:38 AM

మీరు తేనెపూసిన కత్తులు.. జగన్ పై విరుచుకుపడ్డ పార్థసారథి రెడ్డి

వైసీపీ అధినేత వైఎస్ జగన్ తాత.. వైఎస్ రాజారెడ్డి హత్య కేసు, తదనంతర పరిణామాలపై నేడు మీడియా సమావేశంలో.. జగన్ చేసిన ఆరోపణలపై, ఆ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న టీడీపీ నేత పేర్ల పార్థసారథిరెడ్డి ఘాటు కౌంటర్ ఇచ్చారు. జగన్ విమర్శలను తిప్పికొడుతూ పార్థసారథిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. వైఎస్ రాజారెడ్డి హత్యకు సంబంధించి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు. గత చరిత్రను గుర్తు చేస్తూ జగన్‌ కు పలు ప్రశ్నలు సంధించారు.

Also Read : ప్రొ. నాగేశ్వర్ అబద్ధాల డ్రామాపై దండయాత్ర..!

“గతంలో మీ ముఖ్య అనుచరుడు మంగళి కృష్ణతో కలిసి నాపై సూట్‌ కేస్ బాంబు ప్రయోగించి నన్ను అంతమొందించాలని చూసింది మీరు కాదా జగన్..?” అంటూ నిలదీశారు. మీ తాత ఏదో మహాత్ముడు అన్నట్లుగా ఇక్కడ బిల్డప్‌ లు ఇవ్వాల్సిన అవసరం లేదని, వాస్తవాలు ప్రజలందరికీ తెలుసని మండిపడ్డారు. రాయలసీమలోని పాత ఫ్యాక్షన్ రాజకీయాల నేపథ్యాన్ని ప్రస్తావిస్తూ పార్థసారథిరెడ్డి సంచలన విషయాలు బయటపెట్టారు.

“గతంలో మీ తాత మనుషులు నన్ను ఏ విధంగానైతే నరికి చంపాలని చూశారో, దానికి ప్రతికారంగానే నా వర్గీయులు మీ తాత రాజారెడ్డిని నరికారు” అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. అప్పట్లో జరిగిన దాడులు, ప్రతిదాడుల వెనుక ఉన్న అసలు కారణాలను ఆయన ఈ సందర్భంగా బహిర్గతం చేశారు. వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో తమ వర్గాన్ని అణగదొక్కేందుకు పెద్ద ఎత్తున కుట్రలు జరిగాయని పార్థసారథిరెడ్డి ఆరోపించారు.

Also Read : అమెరికాలో ఐటీ ఉద్యోగులకు బిగ్ షాక్..!

“నా మనుషులను అక్రమంగా జైళ్లకు పంపి, నాకున్న గనుల వ్యాపారాల లైసెన్సులను రద్దు చేయించడానికి మీ నాన్న ఏ స్థాయి కుట్రలు చేశారో ఈ ప్రాంతంలో ప్రతి ఒక్కరికీ తెలుసు” అని పేర్కొన్నారు. అధికార బలాన్ని ఉపయోగించి తమను ఆర్థికంగా, సామాజికంగా దెబ్బతీయాలని చూశారని మండిపడ్డారు. వైఎస్ కుటుంబ వైఖరిపై తీవ్ర విమర్శలు గుప్పిస్తూ.. “మీరంతా పైకి బాగానే కనిపిస్తూ లోపల కుట్రలు చేసే తేనె పూసిన కత్తులు” అంటూ జగన్ ల్యాండ్‌ మార్క్ పాలిటిక్స్‌ ను ఎండగట్టారు. తాము ఎవరికీ భయపడే ప్రసక్తే లేదని, ఇన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ పౌరుషంతోనే బతుకుతున్నానని పార్థసారథిరెడ్డి స్పష్టం చేశారు. రాజారెడ్డి హత్య కేసును మళ్లీ తెరపైకి తెచ్చి రాజకీయం చేయాలని చూస్తే ఊరుకునేది లేదని ఆయన హెచ్చరించారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

ఆగస్టు 24 నుండి...

దేశంలో పెరుగుతున్న సైబర్ నేరాలకు అడ్డుకట్ట...

భోగాపురం నుంచి విశాఖ...

ఉత్తరాంధ్ర అభివృద్ధికి కూటమి సర్కార్ చర్యలు...

కాంగ్రెస్‌ను కలవరపెడుతున్న అసమ్మతి..!

తెలంగాణ రాజకీయాలు హాట్ హాట్‌గా మారాయి....

ఈడీ సోదాలు.. వైసీపీ...

వైసీపీ నేతలు ఏ అంశం అయినా...

కొండా సురేఖ పై...

తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో కొండా కుటుంబం...

మాట జాగ్రత్త.. పార్టీ...

ఆంధ్రప్రదేశ్‌లో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు...

పోల్స్