Friday, October 2, 2026 01:58 AM
Friday, October 2, 2026 01:58 AM

ఇంట్లో బంగారం.. విదేశాల్లో అప్పులు.. భారత్‌ లో ₹400 లక్షల కోట్ల బంగారం..!

భారత్ లో బంగారానికి ఉండే ప్రాధాన్యత ఏంటో మన అందరికీ తెలిసిందే. మరి మన దేశంలో.. ఉన్న బంగారం బరువు, విలువ ఎంతో తెలుసా..? ఆ లెక్కలు వింటే మైండ్ బ్లాక్ అవ్వడం ఖాయం. భారతదేశంలో ప్రస్తుతం ఇళ్లలో, తిజోరీల్లో, గుడులలో దాదాపు 35,000 టన్నుల బంగారం నిల్వ ఉంది. దాని విలువ ఏకంగా..400 లక్షల కోట్ల రూపాయలు. దీని మార్కెట్ విలువ మన దేశ మొత్తం జీడీపీ లో ఏకంగా 115 శాతం కంటే ఎక్కువ. కానీ విచారకరమైన విషయం ఏంటంటే, ఇంతటి అపారమైన సంపద ఇంట్లోనే నిరర్థకంగా నిద్రపోతున్నా.. దేశాభివృద్ధి కోసం, కంపెనీల కోసం మనం ఇంకా విదేశీ పెట్టుబడులు, విదేశీ అప్పులపైనే ఆధారపడుతున్నాం.

Also Read : మళ్లీ కొత్త పాట పాడుతున్న పేర్ని..!

ఈ పరిస్థితిని ఆర్థిక నిపుణులు “గోల్డ్-రిచ్, క్యాపిటల్-స్టార్వ్డ్” అంటే బంగారం ఎక్కువ.. పెట్టుబడి తక్కువ అని అభివర్ణించారు. భారతీయులకు బంగారంపై ఉన్న ఈ విపరీతమైన వ్యామోహం వల్ల దేశ ఆర్థిక వ్యవస్థపై ప్రతి ఏటా భారీ భారం పడుతోంది. మన దేశంలో బంగారం గనులు చాలా తక్కువ కాబట్టి, మనం ఏటా వందల టన్నుల బంగారాన్ని విదేశాల నుంచి దిగుమతి చేసుకోవడానికి బిలియన్ల కొద్దీ డాలర్లను విదేశీ కరెన్సీ రూపంలో చెల్లించాల్సి వస్తోంది. ఒకవేళ భారతీయులు ఈ భౌతిక బంగారం కొనడం తగ్గించి, మన దగ్గర ఉన్న బంగారన్నే మార్కెట్లో చలామణిలోకి తెస్తే.. భారతదేశం ఎప్పుడో కరెంట్ అకౌంట్ సర్ప్లస్ లోకి వెళ్తుంది. దీనివల్ల అంతర్జాతీయ మార్కెట్లో మన రూపాయి విలువ విపరీతంగా పెరుగుతుంది.

Also Read : తెరపైకి కూటమి ప్రతినిధి పదవి.. అవసరమా..?

ప్రస్తుతం భారత ప్రభుత్వం మన దేశాన్ని 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చాలని లక్ష్యంగా పెట్టుకోగా, మన ఇళ్లలో నిద్రపోతున్న బంగారం విలువ మాత్రమే దాదాపు 5 ట్రిలియన్ డాలర్లు ఉంటుంది. ఈ స్లీపింగ్ జెయింట్ సంపదను బ్యాంకింగ్ వ్యవస్థలోకి తీసుకురావడానికి గోల్డ్ మోనటైజేషన్ స్కీమ్ ను మరింత సరళతరం చేయాలని, ప్రజలను డిజిటల్ గోల్డ్ లేదా సావరిన్ గోల్డ్ బాండ్స్ వైపు మళ్లేలా ప్రోత్సహించాలని నిపుణులు సూచిస్తున్నారు. ఈ నిగూఢ నిధి గనుక మార్కెట్ రొటేషన్‌లోకి వస్తే, ఆ సంపద పరిశ్రమలకు, స్టార్టప్‌లకు లోన్ల రూపంలో అంది కోట్ల మందికి ఉపాధిని ఇస్తూ భారత్‌ను ప్రపంచ సూపర్ పవర్‌గా మారుస్తుంది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

తాడేపల్లి టు ఢిల్లీ...

ఏపీతో పాటుగా, జాతీయ స్థాయిలో రెండేళ్ళ...

వైసీపీ నేతలను వేటాడుతున్న...

ఆంధ్రప్రదేశ్‌లో గత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ...

BC రిజర్వేషన్లపై వైసీపీ...

స్థానిక సంస్థల ఎన్నికల్లో BCలకు 34...

బీజేపీతో బీఆర్ఎస్ పొత్తు.....

భారతీయ జనతా పార్టీలో భారత రాష్ట్ర...

ఎస్ఐఆర్ పై బాంబు...

భారత ఎన్నికల సంఘం దేశవ్యాప్తంగా ప్రతిష్టాత్మకంగా...

నారా లోకేష్ ధైర్యానికి...

ఆంధ్రప్రదేశ్ ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా...

పోల్స్