Friday, October 2, 2026 12:09 AM
Friday, October 2, 2026 12:09 AM

కిమ్ జోంగ్ తో స్నేహానికి ట్రంప్ ట్రయల్స్..!

ఇరాన్ నిరాయుధీకరణ కోసం అమెరికా చేస్తున్న యుద్ధ ప్రయత్నాలలో భాగస్వామి కావాలని అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ చేసిన ప్రతిపాదనను మిత్రదేశమైన సౌత్ కొరియా నో థాంక్స్ అంటూ నిర్మొహమాటంగా తిరస్కరించడం సంచలనంగా మారింది. ఈ నిరాకరణతో తీవ్ర అసంతృప్తికి లోనైన ట్రంప్, సౌత్ కొరియాకు ఊహించని షాక్ ఇస్తూ ఇరు దేశాల మధ్య ఈ వారం ప్రారంభం కావాల్సిన భారీ ఉమ్మడి సైనిక విన్యాసాలను తక్షణమే భారీగా తగ్గించాలంటూ పెంటగాన్‌ను ఆదేశించారు.

Also Read : కృష్ణా జలాల వాటాపై క్లారిటీ..!

సుమారు 18,000 మంది సైనికులతో నార్త్ కొరియా ముప్పును తిప్పికొట్టడానికి ప్లాన్ చేసిన 11 రోజుల ఉల్చీ ఫ్రీడమ్ షీల్డ్ డ్రిల్స్ తీవ్రతను తగ్గించాలని రక్షణ మంత్రి పీట్ హెగ్‌సెత్‌ కు ట్రంప్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఈ మిలిటరీ కట్‌కు ప్రతికార చర్యతో పాటు నార్త్ కొరియా కోణాన్ని కూడా ట్రంప్ తెరపైకి తెచ్చారు. సౌత్ కొరియాతో కలిసి అమెరికా జరిపే ఈ భారీ సైనిక విన్యాసాలు నార్త్ కొరియాకు శత్రుత్వ సంకేతాలను పంపుతాయని, తన హయాంలో కిమ్ జోంగ్ ఉన్ ఎంతో గౌరవప్రదంగా ఉన్నారని ట్రంప్ వ్యాఖ్యానించారు.

Also Read : బీసీసీఐలో వీవీఎస్ లక్ష్మణ్‌కు మోస్ట్ పవర్‌ఫుల్ పోస్ట్..?

కేవలం కొన్ని రోజుల క్రితమే నార్త్ కొరియా తన షార్ట్-రేంజ్ బాలిస్టిక్ మిస్సైల్ పరీక్షలను మళ్లీ పునరుద్ధరించినప్పటికీ, ట్రంప్ మాత్రం సౌత్ కొరియాకు బుద్ధి చెప్పడానికే నార్త్ కొరియా లీడర్‌తో తనకున్న సత్సంబంధాలను సమర్థించుకోవడం అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారింది. మరొకవైపు పశ్చిమ ఆసియాలో మారుతున్న సరికొత్త రక్షణ కూటములను ట్రంప్ స్వాగతించారు. సౌదీ అరేబియా, టర్కీ, మరియు పాకిస్తాన్ దేశాలు తాజాగా కుదుర్చుకున్న మక్కా జాయింట్ డిఫెన్స్ అగ్రిమెంట్ ను ఆయన ఒక పెద్ద, ధైర్యవంతమైన ముందడుగుగా అభివర్ణించారు. ఒకవైపు ఇరాన్ యుద్ధం కారణంగా సౌత్ కొరియా లాంటి పాత మిత్రదేశాలకు షాక్ ఇస్తూనే, మరోవైపు మిడిల్ ఈస్ట్‌లో కొత్త సైనిక కూటములను ట్రంప్ ఓపెన్‌గా ప్రోత్సహిస్తున్నారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

తాడేపల్లి టు ఢిల్లీ...

ఏపీతో పాటుగా, జాతీయ స్థాయిలో రెండేళ్ళ...

వైసీపీ నేతలను వేటాడుతున్న...

ఆంధ్రప్రదేశ్‌లో గత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ...

BC రిజర్వేషన్లపై వైసీపీ...

స్థానిక సంస్థల ఎన్నికల్లో BCలకు 34...

బీజేపీతో బీఆర్ఎస్ పొత్తు.....

భారతీయ జనతా పార్టీలో భారత రాష్ట్ర...

ఎస్ఐఆర్ పై బాంబు...

భారత ఎన్నికల సంఘం దేశవ్యాప్తంగా ప్రతిష్టాత్మకంగా...

నారా లోకేష్ ధైర్యానికి...

ఆంధ్రప్రదేశ్ ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా...

పోల్స్