Monday, August 17, 2026 03:35 PM
Monday, August 17, 2026 03:35 PM

విజయ్ ఇంటి పక్కనే త్రిష కొత్త ఇల్లు..?

ఆగస్ట్ 15 వేడుకల సాక్షిగా చెన్నై సెయింట్ జార్జ్ కోటలో ఒక ఊహించని సంచలన దృశ్యం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ముఖ్యమంత్రిగా విజయ్‌కి ఇది మొదటి స్వాతంత్ర్య దినోత్సవ కాగా, వీఐపీ గ్యాలరీలో అందరి కళ్లూ స్టార్ హీరోయిన్ త్రిషపైనే పడ్డాయి. నేరుగా సీఎం విజయ్ తల్లిదండ్రులైన ఎస్.ఎ. చంద్రశేఖర్, శోభల పక్క సీట్లోనే కూర్చుని త్రిష చేసిన హడావుడి ఇప్పుడు నెట్టింట తీవ్ర చర్చనీయాంశంగా మారింది. విజయ్ తండ్రితో త్రిష ఎంతో క్లోజ్‌గా మాట్లాడటం చూస్తుంటే, ఆమెను విజయ్ ఫ్యామిలీ కూడా పూర్తిగా ఓన్ చేసుకుందనే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

Also Read : బీసీసీఐలో వీవీఎస్ లక్ష్మణ్‌కు మోస్ట్ పవర్‌ఫుల్ పోస్ట్..?

ఈ ఫ్యామిలీ సాన్నిహిత్యానికి బలమైన రాజకీయ, వ్యక్తిగత కారణాలు కూడా తోడయ్యాయనే ప్రచారం జరుగుతోంది. త్రిష త్వరలోనే చెన్నైలోని తన పాత నివాసాన్ని మార్చేసి, ముఖ్యమంత్రి విజయ్ ఇంటి పక్కనే కొత్త ఇంట్లోకి కాపురం మార్చబోతున్నట్లు చెన్నై మీడియా వర్గాల టాక్. ఈ నివాసం మార్పు వెనుక అసలు ట్విస్ట్ ఏంటంటే.. ముఖ్యమంత్రి విజయ్ తన సొంత పార్టీ తమిళగ వెట్రి కళగం తరపున త్రిషను డైరెక్ట్ పాలిటిక్స్‌లోకి దించి, రాబోయే ఉప ఎన్నికల్లో తిరుచ్చి ఈస్ట్ నియోజకవర్గం నుండి అభ్యర్థిగా స్వయంగా ప్రకటించే అవకాశం ఉందనే ఊహాగానాలు గట్టిగా వినిపిస్తున్నాయి.

Also Read : తెరపైకి కూటమి ప్రతినిధి పదవి.. అవసరమా..?

మరోవైపు విజయ్ వ్యక్తిగత జీవితానికి సంబంధించి ఓ వార్త కూడా హాట్ టాపిక్ అయింది. గతంలో విజయ్, త్రిషల సాన్నిహిత్యం కారణంగానే విజయ్ భార్య సంగీత విడాకులకు అప్లై చేయగా.. ఆ పిటీషన్ ను సంగీత విత్ డ్రా చేసుకున్నారు. దీనితో విజయ్ తో కలిసి ఉండేందుకు ఆమె ప్రయత్నాలు చేసినట్లు వార్తలు వచ్చాయి. విజయ్ సీఎం అయిన నేపథ్యంలో ఆయన రాజకీయ ఇమేజ్ దెబ్బతినకూడదనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నారని విశ్లేషకులు భావిస్తున్నప్పటికీ, పరిస్థితులు మారితే భవిష్యత్తులో త్రిషను విజయ్ పెళ్లి చేసుకునే అవకాశాలు కూడా ఉన్నాయంటూ సోషల్ మీడియాలో విపరీతమైన చర్చ నడుస్తోంది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

అసెంబ్లీలో లోకేష్, సత్యకుమార్...

ఆంధ్రప్రదేశ్ శాసనసభలో తీవ్రమైన రాజకీయ చర్చల...

ఇంటింటికి తెలుగుదేశం క్రేజీ...

ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన...

భోగాపురంలో ల్యాండ్ అయిన...

ఉత్తరాంధ్ర ప్రజల దశాబ్దాల కల సాకారమవుతూ...

నోటీసులకు జవాబు ఇవ్వాలి.....

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల...

బ్యాలెట్ విధానంలోనే స్థానిక...

ఏపీలో త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు...

కృష్ణా జలాల వాటాపై...

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ఉమ్మడి జలాశయాలైన...

పోల్స్