Friday, October 2, 2026 12:59 AM
Friday, October 2, 2026 12:59 AM

కృష్ణా జలాల వాటాపై క్లారిటీ..!

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ఉమ్మడి జలాశయాలైన శ్రీశైలం, నాగార్జునసాగర్‌లో కనీస నీటి మట్టానికి ఎగువన 146.55 టీఎంసీల నీళ్లు నిల్వ ఉండగా, అందులో తమ రాష్ట్రానికి 70 శాతం వాటా లెక్కన 115.70 టీఎంసీలు లభిస్తాయని ఏపీ ప్రభుత్వం పేర్కొంది. తెలంగాణకు 30 శాతం వాటా కింద కేవలం 30.85 టీఎంసీలే ఉన్నాయని వెల్లడించింది. ఇప్పటి వరకు ఏపీ 13.62 టీఎంసీలు, తెలంగాణ 20.06 టీఎంసీలు వాడుకుంది పోగా, మిగిలిన నీటిలో అదే నిష్పత్తిలో వాటాలు ఉంటాయని స్పష్టం చేస్తూ కృష్ణా బోర్డు చైర్మన్ ఎస్.బిశ్వాస్‌కు రాష్ట్ర జల వనరుల శాఖ ఇంజినీర్ ఇన్ చీఫ్ కె.నరసింహమూర్తి లేఖ రాశారు. ఏపీ, తెలంగాణ మధ్య కృష్ణా జలాల పంపిణీ అంశం కృష్ణా ట్రిబ్యునల్-2లో అపరిష్కృతంగా ఉంది. దీంతో తాత్కాలికంగా ఏపీకి 66 శాతం, తెలంగాణకు 34 శాతం జలాలను సర్దుబాటు చేయాలని గతంలో నిర్ణయించారు.

Also Read : వైసీపీ నేతల ఓవరాక్షన్.. పోలీసుల రియాక్షన్..!

శ్రీశైలం నుంచి 4.38 టీఎంసీలు, సాగర్ నుంచి 6.89 టీఎంసీలు, జూరాల నుంచి 8.79 టీఎంసీలు కలిపి మొత్తం 20.06 టీఎంసీలను తెలంగాణ వాడుకోగా, తాము శ్రీశైలం నుంచి 6.45 టీఎంసీలు, సాగర్ నుంచి 7.17 టీఎంసీలు కలిపి మొత్తం 13.62 టీఎంసీలను వాడుకున్నట్టు ఏపీ పేర్కొంది. రెండు రాష్ట్రాలు కలిపి వాడుకున్న జలాలు 33.68 టీఎంసీలకు శ్రీశైలం, సాగర్, జూరాలలో ఎండీడీఎల్‌కి ఎగువన లభ్యతలో ఉన్న నీళ్లను కలిపితే మొత్తం 184.74 టీఎంసీలు అవుతాయని లెక్కలు వేసింది. వాడకం పోగా, మూడు జలాశయాల్లో 115.7 టీఎంసీలు లభ్యతలో ఉన్నాయని తెలిపింది. తాము ఇప్పటికే వాడుకున్న నీళ్లు పోగా, మిగిలిన జలాల్లో తమ రాష్ట్రానికి 70 శాతం వాటా మిగిలి ఉందని లెక్కలు వేసింది.

తెలంగాణ వాడకం పోగా మిగిలిన జలాల్లో ఆ రాష్ట్రానికి 30 శాతమే వాటా మిగిలి ఉందని తేల్చి చెప్పింది. తమ వాటా నుంచి అక్టోబర్ 31 వరకు తమ రాష్ట్ర తాగునీటి అవసరాలకు మొత్తం 47 టీఎంసీలను కేటాయించాలని కృష్ణా బోర్డుకు విజ్ఞప్తి చేసింది. శ్రీశైలం నుంచి పోతిరెడ్డిపాడు ద్వారా 22 టీఎంసీలు, హెచ్ఎన్ఎస్-ఎస్ ద్వారా 11 టీఎంసీలు, సాగర్ నుంచి కుడి కాలువకు 7 టీఎంసీలు, ఎడమ కాలువకు టీఎంసీ, కృష్ణా డెల్టాకు 6 టీఎంసీలు కలిపి మొత్తం 47 టీఎంసీలు అవసరమని తెలియజేసింది.

ప్రస్తుత నీటి సంవత్సరంలో కృష్ణా పరీవాహకంలో సాధారణం కంటే 49 శాతం తక్కువ వర్షపాతం నమోదైనట్లు ఏపీ ప్రభుత్వం ఆ లేఖలో పేర్కొంది. వచ్చే ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో కూడా వర్షపాతం సాధారణం కంటే తక్కువగా ఉండే అవకాశం ఉందని.. అందువల్ల శ్రీశైలం, సాగర్ జలాశయాల్లో అందుబాటులో ఉన్న నీళ్లను తాగునీటి అవసరాలకు అత్యధిక ప్రాధాన్యమిచ్చేలా కృష్ణా బోర్డు తగిన నిర్ణయం తీసుకోవాలని కోరింది.

Also Read : తెరపైకి కూటమి ప్రతినిధి పదవి.. అవసరమా..?

శ్రీశైలం నుంచి 4.38 టీఎంసీలు, సాగర్ నుంచి 6.89 టీఎంసీలు, జూరాల నుంచి 8.79 టీఎంసీలు కలిపి మొత్తం 20.06 టీఎంసీలను తెలంగాణ వాడుకోగా, తాము శ్రీశైలం నుంచి 6.45 టీఎంసీలు, సాగర్ నుంచి 7.17 టీఎంసీలు కలిపి మొత్తం 13.62 టీఎంసీలను వాడుకున్నట్టు ఏపీ పేర్కొంది. రెండు రాష్ట్రాలు కలిపి వాడుకున్న జలాలు 33.68 టీఎంసీలకు శ్రీశైలం, సాగర్, జూరాలలో ఎండీడీఎల్ ఎగువన లభ్యతలో ఉన్న నీళ్లను కలిపితే మొత్తం 184.74 టీఎంసీలు అవుతాయని లెక్కలు వేసింది. వాడకం పోగా, మూడు జలాశయాల్లో 115.7 టీఎంసీలు లభ్యతలో ఉన్నాయని తెలిపింది. తాము ఇప్పటికే వాడుకున్న నీళ్లు పోగా, మిగిలిన జలాల్లో తమ రాష్ట్రానికి 70 శాతం వాటా మిగిలి ఉందని లెక్కలు వేసింది.

తెలంగాణ వాడకం పోగా మిగిలిన జలాల్లో ఆ రాష్ట్రానికి 30 శాతమే వాటా మిగిలి ఉందని తేల్చి చెప్పింది. తమ వాటా నుంచి అక్టోబర్ 31 వరకు తమ రాష్ట్ర తాగునీటి అవసరాలకు మొత్తం 47 టీఎంసీలను కేటాయించాలని కృష్ణా బోర్డుకు విజ్ఞప్తి చేసింది. శ్రీశైలం నుంచి పోతిరెడ్డిపాడు ద్వారా 22 టీఎంసీలు, హెచ్ఎన్ఎస్-ఎస్ ద్వారా 11 టీఎంసీలు, సాగర్ నుంచి కుడి కాలువకు 7 టీఎంసీలు, ఎడమ కాలువకు టీఎంసీ, కృష్ణా డెల్టాకు 6 టీఎంసీలు కలిపి మొత్తం 47 టీఎంసీలు అవసరమని తెలియజేసింది.

ప్రస్తుత నీటి సంవత్సరంలో కృష్ణా పరీవాహకంలో సాధారణం కంటే 49 శాతం తక్కువ వర్షపాతం నమోదైనట్లు ఏపీ ప్రభుత్వం ఆ లేఖలో పేర్కొంది. వచ్చే ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో కూడా వర్షపాతం సాధారణం కంటే తక్కువగా ఉండే అవకాశం ఉందని.. అందువల్ల శ్రీశైలం, సాగర్ జలాశయాల్లో అందుబాటులో ఉన్న నీళ్లను తాగునీటి అవసరాలకు అత్యధిక ప్రాధాన్యమిచ్చేలా కృష్ణా బోర్డు తగిన నిర్ణయం తీసుకోవాలని కోరింది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

తాడేపల్లి టు ఢిల్లీ...

ఏపీతో పాటుగా, జాతీయ స్థాయిలో రెండేళ్ళ...

వైసీపీ నేతలను వేటాడుతున్న...

ఆంధ్రప్రదేశ్‌లో గత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ...

BC రిజర్వేషన్లపై వైసీపీ...

స్థానిక సంస్థల ఎన్నికల్లో BCలకు 34...

బీజేపీతో బీఆర్ఎస్ పొత్తు.....

భారతీయ జనతా పార్టీలో భారత రాష్ట్ర...

ఎస్ఐఆర్ పై బాంబు...

భారత ఎన్నికల సంఘం దేశవ్యాప్తంగా ప్రతిష్టాత్మకంగా...

నారా లోకేష్ ధైర్యానికి...

ఆంధ్రప్రదేశ్ ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా...

పోల్స్