Wednesday, August 5, 2026 03:37 AM
Wednesday, August 5, 2026 03:37 AM

అమెరికాకు గుడ్ బై అంటున్న ఇండియన్స్..!

అమెరికాలో స్థిరపడాలనే ‘అమెరికన్ డ్రీమ్’ భారతీయుల్లో క్రమంగా చెదిరిపోతోంది. తాజాగా కార్నెగీ ఎండోమెంట్ ఫర్ ఇంటర్నేషనల్ పీస్ నిర్వహించిన సర్వే ప్రకారం, సుమారు 40 శాతం మంది భారతీయ అమెరికన్లు అమెరికాను వదిలి వెళ్లాలని ఆలోచిస్తున్నారు. ఇందుకు ప్రధానంగా అక్కడ మారుతున్న రాజకీయ వాతావరణం, విపరీతంగా పెరిగిన జీవన వ్యయం మరియు వ్యక్తిగత భద్రతపై ఆందోళనలే కారణమని ఈ నివేదిక వెల్లడించింది. ముఖ్యంగా దేశం వీడాలనుకుంటున్న వారిలో 58 శాతం మంది ప్రస్తుత రాజకీయ పరిణామాలే ప్రధాన కారణమని తెలపడం గమనార్హం.

Also Read : వాట్సాప్ యూనివర్సిటీపై సుప్రీం సంచలన కామెంట్స్..!

ఒకప్పుడు డెమోక్రాట్లకు బలమైన ఓటు బ్యాంకుగా ఉన్న భారతీయ అమెరికన్లు ఇప్పుడు స్వతంత్రులుగా మారుతున్నారు. 2020లో 56 శాతంగా ఉన్న డెమోక్రాట్ల మద్దతు ఇప్పుడు 47 శాతానికి పడిపోగా, దాదాపు 30 శాతం మంది భారతీయులు ఏ పార్టీకి కట్టుబడి లేమని స్పష్టం చేస్తున్నారు. వీరంతా ఇప్పుడు పార్టీ విధేయత కంటే ఉద్యోగ భద్రత, ఆర్థిక స్థిరత్వం, తమ కుటుంబాల రక్షణ వంటి ఆచరణాత్మక అంశాల ఆధారంగానే నిర్ణయాలు తీసుకుంటున్నారు.

Also Read : మంగ్లీకి ఆడియో సెగ.. స్కామ్‌ లో అడ్డంగా దొరికిపోయిందా..?

అమెరికా ఆర్థిక వ్యవస్థలో మరియు టెక్నాలజీ రంగంలో భారతీయులు కీలక పాత్ర పోషిస్తున్నారు. అమెరికాకు సమకూరే పన్నుల ఆదాయంలో సుమారు 6 శాతం వాటా కలిగి ఉన్న ఈ మేధావుల వర్గం ఇప్పుడు తిరుగుముఖం పట్టడం ఆ దేశానికి పెద్ద దెబ్బ అనే చెప్పాలి. భారత్‌ లో పెరుగుతున్న ఆర్థిక అవకాశాలు, ఇక్కడి అభివృద్ధి కూడా ఈ రివర్స్ మైగ్రేషన్ కు ఒక కారణం అవుతోంది. అదే విధంగా గన్ కల్చర్ కూడా అక్కడి వారిని కంగారు పెడుతోంది. గ్రీన్ కార్డ్ కోసం దశాబ్దాల నిరీక్షణ, జాతి వివక్ష వంటి సమస్యల వల్ల విసిగిపోయిన భారతీయ అమెరికన్లు ఇప్పుడు తమ మాతృభూమి వైపు చూడటం అమెరికా అగ్రరాజ్య హోదాకు ఒక సవాలుగా మారింది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

వైసీపీ లో బోరుగడ్డ...

అధికారంలో ఉన్నప్పుడు కళ్లు నెత్తికి ఎక్కాయి....

రాజకీయాల్లోకి త్రిష..? సీఎం...

తమిళనాడు రాజకీయాల్లో గత రెండు రోజులుగా...

జగన్ పర్యటన దెబ్బ.....

ఉత్తరాంధ్ర రాజకీయాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ...

బ్రేకింగ్: విజయ్ పై...

తమిళనాడు రాజకీయాలు ఒక్కసారిగా తీవ్ర ఉత్కంఠగా...

దమ్ముంటే పట్టుకోండి చూద్దాం.....

ఏపీలో కూటమి సర్కార్ అధికారంలో ఉందో.....

మళ్లీ మొదలైన కావేరీ...

దక్షిణ భారతదేశంలో దశాబ్దాలుగా నలుగుతున్న కావేరీ...

పోల్స్