Saturday, June 20, 2026 05:14 AM
Saturday, June 20, 2026 05:14 AM

మంగ్లీకి ఆడియో సెగ.. స్కామ్‌ లో అడ్డంగా దొరికిపోయిందా..?

ప్రముఖ గాయని మంగ్లీ చుట్టూ మైక్రో ఫైనాన్స్ వివాదం రోజురోజుకూ ముదురుతోంది. సుమారు రూ.150 కోట్ల ఆర్థిక కుంభకోణానికి సంబంధించి మంగ్లీపై వస్తున్న ఆరోపణలకు బలం చేకూర్చేలా ఇప్పుడు కొన్ని కీలక ఆధారాలు బయటకు వస్తున్నాయి. ముఖ్యంగా ఆమె తన స్నేహితురాలు, ముఠా సభ్యులతో మాట్లాడినట్లుగా చెబుతున్న కొన్ని ఆడియో కాల్ రికార్డింగ్‌ లు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ఈ ఆడియో సంభాషణల్లో ఆర్థిక లావాదేవీల ప్రస్తావన ఉండటంతో, మంగ్లీకి ఈ స్కామ్‌ తో నేరుగా సంబంధం ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

Also Read : మాజీ సీఎం నాదెండ్ల భాస్కర్ రావు కన్నుమూత

బాధితులు కూడా ఆమె సెలబ్రిటీ హోదాను చూసే తాము గోకుల నందన ఇన్ఫ్రా వంటి సంస్థల్లో పెట్టుబడులు పెట్టామని, ఇప్పుడు తమ డబ్బు తిరిగి ఇవ్వకుండా వేధిస్తున్నారని వాపోతున్నారు. ఈ కేసులో మంగ్లీని ప్రధాన నిందితురాలిగా పేర్కొంటూ ఇప్పటికే పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదులు అందాయి. మరోవైపు, ఈ కుంభకోణంలో ప్రధాన సూత్రధారిగా భావిస్తున్న రామావత్ మధును పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేశారు. నిందితుడు మధు మంగ్లీ నివాసం నుంచే తన కార్యకలాపాలు సాగించినట్లు విచారణలో తేలడం గమనార్హం.

Also Read : అజ్ఞాతంలోకి అనంతబాబు బిగుస్తున్న ఉచ్చు..!

దీనితో పాటు ఆమె సోదరుడు శివ పాత్రపై కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. సైబరాబాద్ ఎకనామిక్ అఫెన్సెస్ వింగ్ అధికారులు ఈ కేసును లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఈ ఆరోపణలపై మంగ్లీ స్పందిస్తూ తాను ఎవరినీ మోసం చేయలేదని, తన పేరును కొందరు దుర్వినియోగం చేశారని మీడియా ముందు కన్నీటి పర్యంతమయ్యారు. తనపై కుట్ర జరుగుతోందని ఆమె వాదిస్తున్నప్పటికీ, బయటకు వచ్చిన ఆడియో కాల్స్, ఇతర డిజిటల్ ఆధారాలు ఆమెను ఇరకాటంలోకి నెట్టాయి.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

సాయికృష్ణ కేసులో వైసీపీ...

విజయవాడ రౌడీ షీటర్‌ గాదె సాయికృష్ణ...

బ్రేకింగ్: అల్లు అర్జున్‌...

హైదరాబాద్‌లోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్ సంధ్య...

తెలంగాణాలో జనసేన తొలి...

గత కొన్నాళ్ళుగా తెలంగాణాలో పార్టీ బలోపేతం...

బ్రేకింగ్: కొడాలి అరెస్ట్...

ఏపీలో వైసీపీ కీలక నేతలకు చట్టపరమైన...

‘పెద్ది’కి బిగ్ సర్‌ప్రైజ్.....

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్...

రఘురామ కేసుపై హైకోర్ట్...

ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఐపీఎస్ అధికారి సునీల్‌...

పోల్స్