Wednesday, April 22, 2026 07:56 PM
Wednesday, April 22, 2026 07:56 PM

మాజీ సీఎం నాదెండ్ల భాస్కర్ రావు కన్నుమూత

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం నాదెండ్ల భాస్కర్ రావు కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న.. నాదెండ్ల భాస్కర్ రావు హైదరాబాద్లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలోనే.. పరిస్థితి విషమించడంతో.. తుదిశ్వాస విడిచారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా భాస్కర్ రావు పనిచేశారు. సుదీర్ఘకాలం కాంగ్రెస్‌ పార్టీకి నాదెండ్ల భాస్కర్‌రావు వివిధ హోదాల్లో సేవలు అందించారు. ఎన్టీఆర్‌ తెలుగుదేశం పార్టీని ఏర్పాటు సమయంలో నాదెండ్ల భాస్కరరావు కీలకంగా వ్యవహరించారు. 1982 ఎన్నికల్లో టీడీపీ గెలిచిన తర్వాత ఎన్టీఆర్‌ ప్రభుత్వంలో కీలక మంత్రిత్వ శాఖలు నిర్వహించారు.

Also Read : నయా రథసారధి.. ముహూర్తం ఫిక్స్..!

ఆ తర్వాత నాదెండ్ల భాస్కర్‌రావు తన వర్గ ఎమ్మెల్యేలతో ప్రభుత్వం ఏర్పాటు చేశారు. 1984 నుంచి ఆగస్ట్‌ 16 నుంచి సెప్టెంబర్‌ 16 వరకు నెల రోజుల పాటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు 11వ‌ ముఖ్యమంత్రిగా వ్యవహరించారు. ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో నాదెండ్ల భాస్కర్‌రావు తన పదవిని కోల్పోయారు. ఎన్టీఆర్‌ అమెరికా నుంచి తిరిగి వచ్చిన తర్వాత ధర్మయుద్ధం పేరుతో రాష్ట్ర వ్యాప్త యాత్ర చేపట్టారు. ఈ పరిణామాల తర్వాత నాదెండ్ల భాస్కర్‌రావు తన పదవికి రాజీనామా చేశారు. ఆ వెంటనే అప్పటి గవర్నర్‌ రాంలాల్‌ను కేంద్రప్రభుత్వం వెనక్కి పిలిపించింది.

Also Read : స్ట్రోక్‌కు నెల ముందే కనిపించే 5 హెచ్చరిక సంకేతాలు

అదే సమయంలో ఎన్టీఆర్‌ను తిరిగి ముఖ్యమంత్రిగా నియమించింది. ముఖ్యమంత్రి పదవి నుంచి వైదొలగిన తర్వాత నాదెండ్ల భాస్కర్‌రావు కాంగ్రెస్‌లో చేరారు. 1998లో ఖమ్మం నుంచి కాంగ్రెస్‌ తరపున లోక్‌సభకు పోటీచేసి గెలిచారు. 2019లో అమిత్‌ షా సమక్షంలో బీజేపీలో చేరారు. వయోభారం కారణంగా రాజకీయాలకు నాదెండ్ల భాస్కర్‌రావు దూరంగా ఉంటున్నారు. అనారోగ్యం కారణంగా హైదరాబాద్‌లోని ఓ ప్రయివేట్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు.

నాదెండ్ల భాస్కరరావు మృతికి పలువురు ప్రముఖులు సంతాపం తెలియజేశారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

అజ్ఞాతంలోకి అనంతబాబు బిగుస్తున్న...

డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో నిందితుడిగా...

నయా రథసారధి.. ముహూర్తం...

ఏపీలో కూటమి ప్రభుత్వాన్ని నడుపుతున్న టీడీపీలో...

ఈరోజు రాశి ఫలితాలు...

శ్రీ పరాభవ నామ సంవత్సరం, ఉత్తరాయణం,...

మహానాడు వేదిక ఖరారు.....

తెలుగుదేశం పార్టీకి ఎంతో ప్రతిష్టాత్మకమైంది మహానాడు....

పెద్ద దస్తగిరి హత్య...

కడపలో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి పెద్ద...

జనసేన వర్సెస్ టీడీపీ.....

డిప్యూటి సిఎం పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం...

పోల్స్