Friday, September 18, 2026 02:54 AM
Friday, September 18, 2026 02:54 AM

రాకాలో మలయాళీ మెగాస్టార్..? కేరళ బాక్సాఫీస్ షేక్ అవ్వాల్సిందే..!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సెన్సేషనల్ డైరెక్టర్ అట్లీ కాంబినేషన్‌లో వస్తున్న రాకా గురించి రోజుకో క్రేజీ అప్‌డేట్ బయటకు వస్తోంది. తాజాగా ఫిలిం నగర్ వర్గాల్లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం.. ఈ సినిమాలో ఒక కీలకమైన పాత్ర కోసం మలయాళ ఇండస్ట్రీకి చెందిన ఒక సీనియర్ సూపర్ స్టార్‌ ని రంగంలోకి దించుతున్నారట. కేరళలో అల్లు అర్జున్ కి ఉన్న విపరీతమైన ఫ్యాన్ బేస్‌ ను దృష్టిలో పెట్టుకుని, అక్కడి మార్కెట్‌ ను పూర్తిగా కొల్లగొట్టాలనేది అట్లీ ప్లాన్ అని తెలుస్తోంది.

Also Read : పవన్, ప్రభాస్ ఫ్యాన్స్ ఫేవరేట్ డైరెక్టర్ రీ ఎంట్రీ..!

ఈ సినిమాలో బన్నీకి గురువుగా లేదా ఒక పవర్‌ ఫుల్ అడ్వైజర్ పాత్రలో మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి గానీ, లేదా కంప్లీట్ యాక్టర్ మోహన్ లాల్ గానీ నటించే అవకాశం ఉందని గాసిప్స్ వినిపిస్తున్నాయి. వీరిద్దరిలో ఎవరు నటించినా, కేరళలో రాకా.. వసూళ్ల సునామీ సృష్టించడం ఖాయం. అల్లు అర్జున్ గత చిత్రాలన్నీ కేరళలో భారీ వసూళ్లు సాధించాయి, ఇప్పుడు అక్కడి టాప్ సీనియర్ హీరో తోడైతే ఇక రాకా రేంజ్ వేరే లెవెల్ లో ఉంటుంది. దర్శకుడు అట్లీకి ఇలాంటి క్రేజీ కాంబినేషన్లు సెట్ చేయడంలో మంచి ట్రాక్ రికార్డ్ ఉంది.

Also Read : బర్త్ డే గిఫ్ట్ అదిరింది కదా చంద్రయ్యా..!

జవాన్ సినిమాలో షారుఖ్ ఖాన్ కోసం విజయ్ సేతుపతిని, సంజయ్ దత్ ని ఎలా వాడారో.. ఇప్పుడు రాకాలో బన్నీ కోసం మలయాళీ వెటరన్ హీరోని అలా వాడబోతున్నారట. ఈ సినిమాలో సదరు సీనియర్ హీరో పాత్ర కేవలం అతిథి పాత్రలా కాకుండా, కథను మలుపు తిప్పే అత్యంత కీలకమైన పాత్ర అని సమాచారం. ఒకవైపు ముంబైలో షూటింగ్ ప్లాన్ చేస్తూ బాలీవుడ్ ఆడియన్స్‌ ని, మరోవైపు మలయాళ స్టార్‌ ను దించి కేరళ ఆడియన్స్‌ ని టార్గెట్ చేస్తూ అల్లు అర్జున్ పాన్-ఇండియా లెవల్లో తన రాకా విధ్వంసానికి పునాదులు వేస్తున్నారు. ఒకవేళ ఈ గాసిప్ నిజమైతే.. అటు మల్లు అర్జున్ ఫ్యాన్స్, ఇటు మలయాళ స్టార్ ఫ్యాన్స్ కలిసి థియేటర్లను ఊపేయడం ఖాయం.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

మరో వైసీపీ కీలక...

అనంతపురం జిల్లాలో జరుగుతోన్న అక్రమ మైనింగ్...

కేసీఆర్ ఎర్రవల్లి ఫామ్‌హౌస్...

తెలంగాణ మాజీ సిఎం, బీఆర్ఎస్ అధినేత...

చంద్రబాబుపై కేంద్ర మంత్రి...

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత...

రచ్చకెక్కిన ఉత్తరాంధ్ర వైసీపీ...

శ్రీకాకుళం జిల్లాలో సుదీర్ఘ రాజకీయ అనుభవం...

గ్రామాల్లో అభివృద్ధి పండుగ,...

ఏపీ డిప్యూటి సిఎం పవన్ కళ్యాణ్...

నేను లండన్ వెళ్తా...

సోషల్ మీడియా సెలబ్రిటీ, ప్రముఖ యూట్యూబర్...

పోల్స్