Thursday, September 17, 2026 11:38 PM
Thursday, September 17, 2026 11:38 PM

పవన్, ప్రభాస్ ఫ్యాన్స్ ఫేవరేట్ డైరెక్టర్ రీ ఎంట్రీ..!

కొంతమంది డైరెక్టర్ లు హిట్, ఫ్లాప్ తో సంబంధం లేకుండా ఫ్యాన్స్ కు గుర్తుండిపోతారు. అందులో కరుణాకరణ్ ఒకరు. టాలీవుడ్‌లో క్యూట్ అండ్ సెన్సిబుల్ లవ్ స్టోరీలకు కేరాఫ్ అడ్రస్ నిలిచిన కరుణాకరణ్.. స్టార్ హీరోల కెరీర్ స్టార్టింగ్ లో మంచి హిట్స్ ఇచ్చారు. పవన్ కళ్యాణ్‌కు తొలిప్రేమ వంటి ఆల్ టైమ్ క్లాసిక్ ఇచ్చిన ఈ దర్శకుడు, యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్‌ ను డార్లింగ్ అనిపించుకునేలా చేశారు.

Also Read  : పెయిడ్ ఆర్టిస్ట్ కోసం జగన్ ఆరాటం

అయితే గత ఎనిమిదేళ్లుగా వెండితెరకు దూరంగా ఉన్న ఈ టాలెంటెడ్ డైరెక్టర్, నేడు తన కొత్త ప్రాజెక్టును అధికారికంగా ప్రారంభించారు. ప్రభాస్ కెరీర్‌ లో ఎన్నో భారీ యాక్షన్ సినిమాలు ఉన్నా, డార్లింగ్ సినిమాకు ఉండే క్రేజే వేరు. ప్రభాస్‌ లోని అసలైన లవర్ బాయ్‌ ని, అద్భుతమైన కామెడీ టైమింగ్‌ ని ప్రేక్షకులకు పరిచయం చేసింది కరుణాకరణే. ఈ సినిమాతోనే ప్రభాస్ అందరికీ డార్లింగ్ అయిపోయాడు. ఇప్పటికీ ప్రభాస్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో కరుణాకరణ్‌ ను మా డార్లింగ్‌ను అంత అందంగా చూపించినందుకు థాంక్స్ అని గుర్తు చేసుకుంటుంటారు.

Also Read  : విజయ్‌ ఆస్తుల పంచాయితీ.. మద్రాస్ హైకోర్టు షాక్..!

ఆయన మళ్లీ సినిమా తీస్తున్నారనే వార్త ప్రభాస్ అభిమానుల్లో కూడా జోష్ నింపుతోంది. వరుసగా విభిన్నమైన కథలను ఎంచుకుంటున్న యంగ్ హీరో బెల్లంకొండ గణేష్ ఈ చిత్రంలో కథానాయకుడిగా నటిస్తున్నారు. వీరిద్దరి కాంబినేషన్‌ లో రాబోతున్న ఈ సినిమా ఒక న్యూ ఏజ్ రొమాంటిక్ కామెడీ అని చిత్ర యూనిట్ వెల్లడించింది. ఎనిమిదేళ్ల గ్యాప్ తీసుకున్న కరుణాకరణ్, ఈసారి ప్రస్తుత కాలానికి తగ్గట్టుగా ఉండే ఒక రిఫ్రెషింగ్ లవ్ స్టోరీని సిద్ధం చేశారట. కరుణాకరణ్ సినిమాల్లో ఉండే ఫీల్ గుడ్ ఎమోషన్స్, బ్యూటిఫుల్ మ్యూజిక్ మళ్లీ వెండితెరపై మ్యాజిక్ చేస్తాయని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

మరో వైసీపీ కీలక...

అనంతపురం జిల్లాలో జరుగుతోన్న అక్రమ మైనింగ్...

కేసీఆర్ ఎర్రవల్లి ఫామ్‌హౌస్...

తెలంగాణ మాజీ సిఎం, బీఆర్ఎస్ అధినేత...

చంద్రబాబుపై కేంద్ర మంత్రి...

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత...

రచ్చకెక్కిన ఉత్తరాంధ్ర వైసీపీ...

శ్రీకాకుళం జిల్లాలో సుదీర్ఘ రాజకీయ అనుభవం...

గ్రామాల్లో అభివృద్ధి పండుగ,...

ఏపీ డిప్యూటి సిఎం పవన్ కళ్యాణ్...

నేను లండన్ వెళ్తా...

సోషల్ మీడియా సెలబ్రిటీ, ప్రముఖ యూట్యూబర్...

పోల్స్