Thursday, April 23, 2026 04:22 PM
Thursday, April 23, 2026 04:22 PM

సంక్రాంతి బరిలో బాలయ్య..!

నందమూరి బాలకృష్ణకు సంక్రాంతి పండుగకు అవినాభావ సంబంధం. సంక్రాంతికి బాలయ్య సినిమా వస్తుందంటే చాలు.. నందమూరి అభిమానులకు పండగే. బాలయ్య కెరీర్‌లో బ్లాక్ బస్టర్‌లు సంక్రాంతికి వచ్చినవే ఎక్కువున్నాయి. సమరసింహారెడ్డి, నరసింహనాయుడు లాంటి ఎన్నో సూపర్ హిట్, ఇండస్ట్రీ హిట్ సినిమాలు ఉన్నాయి. గౌతమీ పుత్ర శాతకర్ణి వంటి పౌరాణిక సినిమాలు కూడా సంక్రాంతికి వచ్చినవే. అందుకే బాలయ్యకు సంక్రాంతి కింగ్ అని టాలీవుడ్‌లో టాక్.

Also Read : రాకాలో మలయాళీ మెగాస్టార్..? కేరళ బాక్సాఫీస్ షేక్ అవ్వాల్సిందే..!

అచ్చమైన తెలుగుదనం ఉట్టిపడే పండుగ సంక్రాంతి. ప్రతి ఏటా సంక్రాంతి పండుగకు టాలీవుడ్‌లో సినిమా పండుగ జరుగుతుంది. ఈ రేసులో ఇప్పటి వరకు బాలయ్యదే పై చెయ్యి. 1987 నుంచి 2019 మధ్య కాలంలో సంక్రాంతి అంటే బాలయ్య.. అనేలా టాలీవుడ్ సాగింది. ధియేటర్ల వద్ద కలెక్షన్ల సునామీ సృష్టించిన సినిమాలన్నీ సంక్రాంతికి వచ్చినవే. భార్గవ రాముడు, వంశానికొక్కడు, పెద్దన్నయ్య, సమరసింహారెడ్డి, నరసింహనాయుడు, లక్ష్మీ నరసింహ, గౌతమీపుత్ర శాతకర్ణి, జై సింహా వంటి అనేక సంక్రాంతి హిట్‌లు బాలయ్య తన ఖాతాలో వేసుకున్నారు.

ఇక టాలీవుడ్ హిస్టరీలో బిగ్గెస్ట్ క్లాష్‌గా 1997 సంవత్సరాన్ని చెబుతారు. టాలీవుడ్‌లోని నలుగురు ప్రధాన హీరోల్లో బాలకృష్ణ, చిరంజీవి, వెంకటేష్ నటించిన సినిమాలు సంక్రాంతి రేసులో నిలిచాయి. చిరంజీవి హీరోగా చేసిన హిట్లర్, వెంకటేష్ హీరోగా చిన్నబ్బాయి, బాలకృష్ణ హీరోగా పెద్దన్నయ్య రిలీజ్ అయ్యాయి. వీటిల్లో హిట్లర్ జనవరి 4న రాగా.. పెద్దన్నయ్య, చిన్నబ్బాయి సినిమాలు ఒకేరోజు జనవరి 10న విడుదలయ్యాయి. వీటిల్లో పెద్దన్నయ్యతో మాస్ హిట్‌ కొట్టారు బాలకృష్ణ.

Also Read : పిఠాపురంలో రగులుతున్న కూటమి, వర్మ సంచలన ట్వీట్..!

ఇప్పటికే గోపీచంద్ మలినేనితో భారీ సినిమా చేస్తున్నారు. తాజాగా దర్శక రచయిత కొరటాల శివ దర్శకత్వంలో సుధాకర్ చెరుకూరి నిర్మించే కొత్త ప్రాజెక్ట్‌ను కూడా బాలకృష్ణ ఓకే చేసినట్లు తెలుస్తోంది. అయితే ఈ సినిమా సంక్రాంతి టార్గెట్‌గా తెరకెక్కిస్తున్నారని టాలీవుడ్‌లో టాక్. సంక్రాంతి కింగ్‌గా గుర్తింపు ఉన్న బాలకృష్ణ.. సంక్రాంతి టార్గెట్‌గా సినిమా రిలీజ్ చేయాలనే లక్ష్యంతో ఉన్నట్లు తెలుస్తోంది. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో చేస్తున్న సినిమా ఈ ఏడాది దసరాకు రిలీజ్ చేసేందుకు నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. కొరటాల శివ సినిమా సంక్రాంతి బరిలో నిలిచే అవకాశం ఉంది. ఇప్పటికే అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేశ్, నందమూరి కల్యాణ్ రామ్ కలిసి చేస్తున్న సినిమా కూడా సంక్రాంతికే ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో రాబోయే సంక్రాంతి మరోసారి సినీ అభిమానులకు కన్నుల పండుగ ఖాయమంటున్నారు టాలీవుడ్ ప్రముఖులు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

బ్రేకింగ్: ఒంటిమిట్ట అర్చకులకు...

కడప జిల్లా ఒంటిమిట్టలోని ప్రసిద్ధ శ్రీ...

పిఠాపురంలోనే ఎందుకు ఆ...

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆ ఒక్క నియోజకవర్గంలోనే...

అజ్ఞాతంలోకి అనంతబాబు బిగుస్తున్న...

డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో నిందితుడిగా...

మాజీ సీఎం నాదెండ్ల...

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం నాదెండ్ల...

నయా రథసారధి.. ముహూర్తం...

ఏపీలో కూటమి ప్రభుత్వాన్ని నడుపుతున్న టీడీపీలో...

ఈరోజు రాశి ఫలితాలు...

శ్రీ పరాభవ నామ సంవత్సరం, ఉత్తరాయణం,...

పోల్స్