Saturday, September 19, 2026 08:09 AM
Saturday, September 19, 2026 08:09 AM

పిఠాపురంలో రగులుతున్న కూటమి, వర్మ సంచలన ట్వీట్..!

పిఠాపురం నియోజకవర్గంలో కూటమి నేతల మధ్య విభేదాలు మరోసారి రచ్చకెక్కాయి. మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత ఎస్వీఎస్ఎన్ వర్మ నేడు తన సోషల్ మీడియా వేదికగా చేసిన సంచలన వ్యాఖ్యలు ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ అయ్యాయి. సిఎం చంద్రబాబు ఫోటో లేకపోవడాన్ని ప్రశ్నించినందుకు తనపై, తన కార్యకర్తలపై దాడులు జరిగాయని వర్మ ఆరోపించారు. నిన్న ఒక అధికారిక లేదా పార్టీ కార్యక్రమంలో సిఎం చంద్రబాబు ఫోటో లేకపోవడాన్ని వర్మ ప్రశ్నించారు.

Also Read : అజ్ఞాతంలోకి అనంతబాబు బిగుస్తున్న ఉచ్చు..!

ఈ క్రమంలో తనపై మరియు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపై కొందరు దాడులకు దిగారని, నోటికొచ్చినట్లు అసభ్య పదజాలంతో దూషించారని వర్మ ఆవేదన వ్యక్తం చేశారు. గత ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గెలుపుకు వ్యతిరేకంగా పనిచేశారని దొరబాబుపై వర్మ నేరుగా విరుచుకుపడ్డారు. పవన్ గెలుపును అడ్డుకోవాలని చూసిన దొరబాబు, ఇప్పుడు కూటమిలోకి వచ్చి పెత్తనం చలాయించడం ఏంటని ప్రశ్నించారు. దొరబాబు ఇప్పటికీ వైసీపీ కోవర్టుగా పనిచేస్తున్నారని వర్మ సంచలన వ్యాఖ్యలు చేశారు.

Also Read : అజ్ఞాతంలోకి అనంతబాబు బిగుస్తున్న ఉచ్చు..!

కూటమిలో ఉంటూనే నేతల మధ్య తగాదాలు సృష్టిస్తూ, పార్టీ ప్రతిష్టను దెబ్బతీస్తున్నారని ఆరోపించారు. ఈ పరిణామాలపై వర్మ నేరుగా ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేష్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను ట్యాగ్ చేస్తూ ఫిర్యాదు చేశారు. పిఠాపురంలో జరుగుతున్న ఈ అంతర్గత పోరు కూటమి ప్రభుత్వ ప్రతిష్టకు భంగం కలిగించేలా ఉందని కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేసారు. వర్మ వర్గీయులు నేడు నిరసనలకు సిద్ధమవుతుండటంతో నియోజకవర్గంలో ఉద్రిక్తత నెలకొంది. మరోవైపు దొరబాబు వర్గం ఈ ఆరోపణలపై ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

రేవంత్ దెబ్బ.. బీఆర్ఎస్‌కు...

ఏదో అనుకుంటే.. మరేదో జరిగినట్లు ఉంది...

దానం నాగేందర్ కు...

ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే దానం నాగేందర్‌కు తెలంగాణ...

ఎల్‌నినో పై బాబు...

ఎల్‌నినో ప్రభావంతో ఏర్పడిన కరవు పరిస్థితులను...

సనాతన ధర్మం.. చేప...

'దుర్గాపూజ సమయంలో బెంగాలీ హిందువులు మాంసాహారానికి...

వైసీపీలో విచిత్ర పరిస్థితి.....

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల వేడి...

నిర్ణయం చంద్రబాబు.. పవన్...

ఆంధ్రప్రదేశ్‌లో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలపై...

పోల్స్