Saturday, June 20, 2026 02:05 PM
Saturday, June 20, 2026 02:05 PM

వాట్సాప్ యూనివర్సిటీపై సుప్రీం సంచలన కామెంట్స్..!

శబరిమల అయ్యప్ప ఆలయంలో మహిళల ప్రవేశంపై సుప్రీంకోర్టులో జరుగుతున్న విచారణలో ఒక ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. న్యాయస్థానాల్లో సాధారణంగా ఉండే సీరియస్ వాతావరణం కాకుండా, ఒక చిన్న వ్యాఖ్యతో కోర్టు హాల్‌ లో నవ్వులు విరిశాయి. ఎనిమిదో రోజు విచారణ సందర్భంగా ధర్మాసనం సామాజిక మాధ్యమాల్లో వచ్చే సమాచారంపై తనదైన శైలిలో స్పందించింది. ఈ విచారణలో సీనియర్ న్యాయవాది నీరజ్ కిషన్ కౌల్ తన వాదనలు వినిపిస్తూ.. జ్ఞానం ఎక్కడున్నా, దాని మూలంతో సంబంధం లేకుండా మనం స్వాగతించాలని అభిప్రాయపడ్డారు.

Also Read : అనంతబాబు ఎస్కేప్.. పోలీస్ శాఖ సీరియస్ యాక్షన్..!

దీనిపై ధర్మాసనంలోని న్యాయమూర్తి జస్టిస్ బీవీ నాగరత్న చమత్కరిస్తూ.. “మీరు చెప్పింది నిజమే, జ్ఞానం ఎక్కడున్నా గౌరవిస్తాం.. కానీ అది వాట్సప్ యూనివర్సిటీ నుంచి వచ్చే సమాచారం కాకుండా ఉంటే చాలు” అని వ్యాఖ్యానించారు. జడ్జిగారి ఈ సెటైర్‌ తో కోర్టులో ఉన్న వారందరూ ఒక్కసారిగా నవ్వేశారు. ప్రస్తుత కాలంలో వాట్సప్ యూనివర్సిటీపై తీవ్ర విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే. సామాజిక మాధ్యమాల్లో ఏ విధమైన ఆధారాలు లేని తప్పుడు సమాచారం ఎంత వేగంగా ప్రచారమవుతుందో అందరికీ తెలిసిందే.

Also Read : అనంతలో లేడీ డాన్ రచ్చ.. షేక్ అవుతోన్న పోలీసు శాఖ..!

మతపరమైన ఆచారాలు, సంప్రదాయాల వంటి సున్నితమైన అంశాల విచారణలో ఇటువంటి ధృవీకరించని సమాచారాన్ని న్యాయస్థానాలు పరిగణనలోకి తీసుకోబోవని జస్టిస్ నాగరత్న ఈ సందర్భంగా పరోక్షంగా స్పష్టం చేశారు. మరోవైపు శబరిమల రివ్యూ పిటిషన్లపై విచారణ కొనసాగుతోంది. ఆలయ సంప్రదాయాలకు, మహిళల రాజ్యాంగ హక్కులకు మధ్య ఉన్న సమతుల్యతపై రాజ్యాంగ ధర్మాసనం లోతుగా చర్చిస్తోంది. కోర్టులు కేవలం చట్టబద్ధమైన, చారిత్రక ఆధారాలనే ప్రామాణికంగా తీసుకుంటాయని వెల్లడి అయింది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

తిరుపతిలో వడ్డీ మాఫియా.....

తిరుపతి నగరంలో వడ్డీ వ్యాపారం పేరుతో...

సాయికృష్ణ కేసులో వైసీపీ...

విజయవాడ రౌడీ షీటర్‌ గాదె సాయికృష్ణ...

బ్రేకింగ్: అల్లు అర్జున్‌...

హైదరాబాద్‌లోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్ సంధ్య...

తెలంగాణాలో జనసేన తొలి...

గత కొన్నాళ్ళుగా తెలంగాణాలో పార్టీ బలోపేతం...

బ్రేకింగ్: కొడాలి అరెస్ట్...

ఏపీలో వైసీపీ కీలక నేతలకు చట్టపరమైన...

‘పెద్ది’కి బిగ్ సర్‌ప్రైజ్.....

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్...

పోల్స్