భారత్‌లో ఎరువుల ఉత్పత్తి మార్చి 2026లో 24.6 శాతం తగ్గినట్లు గణాంకాలు చెబుతున్నాయి. అయితే ఇది అంతా సాధారణ విషయం కాదు. దీని వెనుక అంతర్జాతీయ జియో పాలిటిక్స్, ముఖ్యంగా హోర్ముజ్ జలసంధి ప్రాంతంలో ఉద్రిక్తతలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. హోర్భుజ్ సముద్ర మార్గం ప్రపంచంలోనే అత్యంత కీలకమైన ఆయిల్, గ్యాస్ ట్రేడ్ రూట్. ఈ ప్రాంతంలో ఉద్రిక్తతలు పెరగడంతో గ్యాస్ సరఫరా తగ్గింది. రవాణా ఖర్చులు పెరిగాయి. ఎరువుల తయారీకి అవసరమైన ముడి పదార్థాలు ఖరీదయ్యాయి. యుద్ధానికి ముందు టన్ను ఎరువుల ధర 490 నుంచి 609 డాలర్లు పలికితే, అది ఇప్పుడు ఏకంగా 935 నుంచి 959 డాలర్లు దాటుతోంది. ఇది దాదాపు 90 శాతం పెరుగుదల. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. దీనిపై రైతులకు పెద్దగా మార్పు కనిపించదు. ఎందుకంటే రైతుల మీద భారం పడకుండా సబ్సిడీ రూపంలో ప్రభుత్వం దాన్ని భరిస్తోంది.
Also Read : అదరగొడుతున్న రాజస్థాన్ కెప్టెన్..!
దేశంలో యూరియా ఉత్పత్తి పెరిగిన వెంటనే జూన్ నెల నుంచి ప్రారంభం అయ్యే వంటల కాలం కోసం భారత్ రెట్టింపు ధరలో యూరియా కొని ఆ సబ్సిడీ తాను భరించటానికి ముందుకు వచ్చింది. ఇప్పటికే రష్యా, బ్రెజిల్, ఆఫ్రికాల నుండి పెద్ద ఎత్తున దిగుమతులకు అధిక ధరలో ఆర్డర్ పెట్టింది. ప్రస్తుతానికి ఎలాంటి సమస్య లేదు. ఈ ధరల పెరుగుదల వల్ల సబ్సిడీ ఖర్చు భారీగా పెరుగుతుంది. అంచనా ప్రకారం అదనంగా 4 బిలియన్ డాలర్ల వరకు ఖజానాకు భారమవుతుంది. ప్రస్తుతానికి ప్రభుత్వం ఈ అదనపు ఖర్చు తన రిజర్వ్‌ల నుండి వాడటానికి నిశ్చయించుకుంది. అంటే ప్రజల కోసం, రైతుల కోసం ప్రభుత్వం అధిక భారం మోయటానికి సిద్ధపడుతోంది.
Also Read : అనంతబాబు ఎస్కేప్.. పోలీస్ శాఖ సీరియస్ యాక్షన్..!
యూరియా లేకపోతే వరి, గోధుమ, మొక్కజొన్న, సోయాబీన్ పంటల దిగుబడి గణనీయంగా తగ్గుతుంది. అందుకే, వర్షాకాలం ఆరంభానికి ముందే ఈ ఎరువులను భారత్ ఎలాగైనా కొనాల్సిందే. అందుకే ముందుగానే ఆర్డర్లు పెట్టడంతో.. ప్రస్తుతానికి ఎలాంటి సమస్య లేదు. ప్రపంచంలోనే పెద్ద యూరియా దిగుమతి చేసుకునే దేశం భారత్. ఈ ధరలను భరించేందుకు భారత్ సిద్ధంగా ఉంది కూడా. కానీ ఇతర దేశాల పరిస్థితి వేరుగా ఉంది. పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్రికా దేశాలకు ఎరువులు అందకపోతే పంటల దిగుబడి తగ్గిపోతుంది. అప్పుడుఆహార కొరత ఏర్పడుతుంది. ఇది కేవలం ఎరువుల కథ కాదు. ఇది ఆహార భద్రత సమస్య కూడా. ఇది ఆర్థిక ఒత్తిడి, జియో పొలిటికల్ ప్రభావం. ప్రస్తుతం భారత్ ఆర్థిక వృద్ధి రేటు సంతృప్తి కరంగా ఉంది. కాబట్టి.. మరో రెండేళ్ల వరకు ఎలాంటి నిధుల కొరత లేదు. కానీ మిగిలిన దేశాల పరిస్థితి అలా లేదు.
Also Read : లిక్కర్ టెండర్ల సెగ.. కారుమూరి అరెస్ట్ తప్పదా..?
భారత్ పూర్తిగా దిగుమతులపై ఆధారపడకుండా ఉండాలని చాలా కాలంగా ప్రయత్నిస్తోంది. దేశంలో కొత్త యూరియా ప్లాంట్లను కేంద్రం నిర్మిస్తోంది. పాత ప్లాంట్లను మళ్లీ ప్రారంభిస్తోంది. ప్రైవేట్ కంపెనీలకు కూడా అనుమతి ఇచ్చింది. కానీ అవి ఉత్పత్తి ప్రారంభించటానికి సమయం పడుతుంది. దేశంలోనే ఎక్కువ యూరియా తయారీ చేయడమే లక్ష్యంగా భారత్ అడుగులేస్తుంది. దిగుమతుల కోసం ఒకే దేశంపై ఆధారపడకుండా జాగ్రత్తలు తీసుకుంటోంది. మధ్య ప్రాచ్యం మాత్రమే కాదు, రష్యా, ఆఫ్రికా, ఇతర దేశాల నుంచి కూడా దిగుమతులు చేసుకోవాలని భావిస్తోంది. దీని వల్ల ఒక్క ప్రాంతంలో సమస్య వచ్చినా పూర్తిగా షాక్ రాకుండా ఉంటుంది. నానో యూరియాతో భారత్ ఒక పెద్ద గేమ్ చేంజర్ తీసుకొచ్చింది. ఒక బాటిల్ ఒక పెద్ద యూరియా బ్యాగ్‌కు సమానం, తక్కువ పరిమాణంలో ఎక్కువ ఫలితం.
యూరియా తయారీలో నేచురల్ గ్యాస్ చాలా ముఖ్యమైనది. ఇందుకు భారత్ దీర్ఘకాలిక ఒప్పందాలు చేసుకుంటోంది. రసాయన ఎరువులపై ఒత్తిడి తగ్గించేందుకు ఆర్గానిక్ ఫర్టిలైజర్స్, బయో ఫర్టిలైజర్స్, మిశ్రమ ఎరువులు రైతులకు కొత్త మార్గాలు చూపిస్తోంది. అవసరానికి మించి వాడకుండా నియంత్రణకు చర్యలు చేపడుతోంది. అయితే భారత్ ఇప్పటికీ యూరియా కోసం భారీగా దిగుమతులపై ఆధారపడుతోంది. ముఖ్యంగా గ్యాస్ దిగుమతులపై ఇంకా డిపెండెన్సీ ఉంది. సంక్షోభం పూర్తిగా తప్పించుకోలేదు. కానీ ప్రభావం తగ్గించే ప్రయత్నం జరుగుతోంది. దిగుమతులు తగ్గించాలనేది లక్ష్యం. పూర్తిగా ఆపడం ఇంకా సాధ్యం కాలేదు, కాదు కూడా. భారత్ ఇప్పుడు రెండు పనులు ఒకేసారి చేస్తోంది. తక్షణ అవసరాల కోసం దిగుమతులు, భవిష్యత్తు కోసం స్వదేశీ ఉత్పత్తి పెంపునకు ప్రాధ్యాన్యమిస్తోంది.

