Friday, June 19, 2026 04:38 PM
Friday, June 19, 2026 04:38 PM

ఈరోజు రాశి ఫలితాలు (20-04-2026)

శ్రీ పరాభవ నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, వైశాఖ మాసం, శుక్ల పక్షం.. 20-04-2026 నాడు మీ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకోవాలి అనుకుంటున్నారా, అయితే ఆ వివరాలు మీకోసం. మీ గ్రహాల ప్రభావం ఎలా ఉందో చెక్ చేసుకోండి..

మేషం

బంధువులతో తొందరపడి మాట్లాడటం మంచిది కాదు. దైవదర్శనాలు చేసుకుంటారు. చేపట్టిన పనుల్లో ప్రతిష్టంభనలు కలుగుతాయి. వృధా ఖర్చులు చేస్తారు. వృత్తి, వ్యాపారాలలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోక పోవడం మంచిది. మానసిక ఒత్తిడి పెరుగుతుంది.

—————————————

వృషభం

నూతన వ్యాపారాలు ప్రారంభించి లాభాలు అందుకుంటారు. దూర ప్రాంత మిత్రుల నుండి విలువైన విషయాలు సేకరిస్తారు. వృత్తి ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఉంటుంది. సమాజంలో గౌరవ మర్యాదలుకు లోటు ఉండదు. ఆర్ధిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది.

—————————————

మిధునం

స్థిరాస్తి కొనుగోలు అవరోధాలు తొలగుతాయి. వృత్తి ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందుకుంటారు. చిన్ననాటి మిత్రులతో విందువినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. చేపట్టిన పనులు అప్రయత్నంగా పూర్తి చేస్తారు. నూతన వ్యాపారాలు లాభాల బాటలో సాగుతాయి.

—————————————

కర్కాటకం

ధన పరంగా ఒడిదుడుకులు ఉంటాయి. దూర ప్రయాణాలలో శ్రమాధిక్యత కలుగుతుంది. వృత్తి వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. సోదరులతో ఊహించని వివాదాలు కలుగుతాయి. ఉద్యోగమున బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహించలేక అధికారుల ఆగ్రహానికి గురికావలసి వస్తుంది.

—————————————

సింహం

దూర ప్రయాణాలలో మార్గావరోధాలు కలుగుతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. చేపట్టిన పనులు సకాలంలో పూర్తికావు. వృత్తి వ్యాపారాలలో ఊహించని ఇబ్బందులు కలుగుతాయి. ఉద్యోగ ప్రయత్నాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగ వాతావరణం గందరగోళంగా ఉంటుంది.

—————————————

కన్య

పాత మిత్రుల ఆగమనం ఆనందం కలిగిస్తుంది. కుటుంబ సభ్యులతో విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. నూతన విద్య ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. నూతన ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. వృత్తి ఉద్యోగాలలో సంతృప్తికర వాతావరణం ఉంటుంది.

—————————————

తుల

చేపట్టిన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. కుటుంబ సభ్యులు సలహాలు కొన్ని విషయాల్లో కలిసి వస్తాయి. నిరుద్యోగుల ప్రయత్నాలు సఫలమవుతాయి. స్ధిరాస్తి సంభందిత క్రయవిక్రయాలలో లాభాలు అందుకుంటారు. వృత్తి వ్యాపారాలు అనుకూలిస్తాయి. ఉద్యోగమున ఉన్నతి కలుగుతుంది.

—————————————

వృశ్చికం

ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి సారిస్తారు. చేపట్టిన పనులలో స్వల్ప ఆటంకాలు ఉంటాయి. కుటుంబ పెద్దల అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. ధన పరంగా తొందరపడి ఇతరులకు మాట ఇవ్వడం మంచిది కాదు. వృత్తి వ్యాపారాలు సమస్యాత్మకంగా సాగుతాయి. ఉద్యోగమున సమస్యలు కలుగుతాయి.

—————————————

ధనస్సు

ఆదాయానికి మించి ఖర్చులు పెరుగుతాయి. అకారణంగా బంధువులతో వివాదాలు కలుగుతాయి. కొన్ని వ్యవహారాలలో స్వంత ఆలోచనలు కలసిరావు. కొందరి మాటల వలన మానసిక సమస్యలు కలుగుతాయి. వ్యాపారాలలో భాగస్వాములతో మాటపట్టింపులు ఉంటాయి. నిరుద్యోగులకు అధిక శ్రమతో కాని ఫలితం అందదు.

—————————————

మకరం

బంధుమిత్రుల ఆగమనం ఆనందం కలిగిస్తుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ముఖ్యమైన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. గృహమున వివాహాది శుభకార్యాలు నిర్వహిస్తారు. నూతన వాహన భూ లాభాలు ఉంటాయి. వృత్తి, వ్యాపారాలలో పెట్టుబడులకు తగిన లాభాలు అందుకుంటారు.

—————————————

కుంభం

చేపట్టిన పనుల్లో ప్రతిష్టంభన కలుగుతుంది. ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా ఉండాలి. శ్రమతో కూడిన దూరప్రయాణాలు చేయవలసి వస్తుంది. కుటుంబ సభ్యులతో ఊహించని విభేదాలు కలుగుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ఆహ్వానాలు అందుతాయి. వృత్తి, వ్యాపారాలు నిదానంగా సాగుతాయి.

—————————————

మీనం

దాయాదులతో స్ధిరాస్తి వివాదాల పరిష్కారం అవుతాయి. శుభకార్యాల కొరకు ధనం ఖర్చు చేస్తారు. సంఘంలో పెద్దల ఆదరణ పెరుగుతుంది. అనుకున్న పనులలో కార్యసిద్ధి కలుగుతుంది. ఉద్యోగాలలో అధికారుల సహాయ సహకారాలు పొందుతారు. వృత్తి, వ్యాపారాలలో సమస్యలు అధిగమిస్తారు.

—————————————

గమనిక : ఈ ఆర్టికల్‌లో అందించిన జ్యోతిష్య సమాచారం, వార్షిక ఫలాలు, పరిహారాలన్నీ జ్యోతిష్యశాస్త్రం, హిందూ మత విశ్వాసాలపై ఆధారపడి ఉన్నాయి. ఇది అందుబాటులో ఉన్న సమాచారం మేరకు అవగాహనా కొరకు ఇవ్వబడింది. ఏదైనా నిర్ణయాలు తీసుకునే ముందు జ్యోతిష్య పండితులను సంప్రదించండి.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

బ్రేకింగ్: అల్లు అర్జున్‌...

హైదరాబాద్‌లోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్ సంధ్య...

తెలంగాణాలో జనసేన తొలి...

గత కొన్నాళ్ళుగా తెలంగాణాలో పార్టీ బలోపేతం...

బ్రేకింగ్: కొడాలి అరెస్ట్...

ఏపీలో వైసీపీ కీలక నేతలకు చట్టపరమైన...

‘పెద్ది’కి బిగ్ సర్‌ప్రైజ్.....

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్...

రఘురామ కేసుపై హైకోర్ట్...

ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఐపీఎస్ అధికారి సునీల్‌...

ఏపీ లిక్కర్ స్కామ్‌లో...

ఏపీలో సంచలనం సృష్టించిన మద్యం రవాణా...

పోల్స్