Friday, June 19, 2026 05:38 PM
Friday, June 19, 2026 05:38 PM

పంజాబ్ గెలుపు సీక్రెట్ బయటపెట్టిన అయ్యర్..!

ఒకప్పుడు ఏ మాత్రం అంచనాలు లేని జట్టు.. పాయింట్ల పట్టికలో అట్టడుగున కనిపించే టీమ్.. కానీ ఇప్పుడు సీన్ మారింది. ఐపీఎల్ 2026లో పంజాబ్ కింగ్స్ వరుసగా ఆరు విజయాలతో దూసుకుపోతుంది. గత ఏడాది ఫైనల్ వరకు వెళ్లి ఓడిన పంజాబ్.. ఈసారి ఎలాగైనా కప్ కొట్టాలని బలంగా కనపడుతోంది. నిన్నటి మ్యాచ్‌లో అయితే ఏకంగా 254/7 భారీ స్కోరు సాధించి ఈ సీజన్‌ లోనే రికార్డు సృష్టించింది. ఈ అద్భుతమైన మార్పు వెనుక ఉన్న అసలు సీక్రెట్‌ ను కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ తాజాగా బయటపెట్టాడు.

Also Read : అయ్యర్ ఎవరి దగ్గర ప్రూవ్ చేసుకోవాలి..?: అశ్విన్ కీలక వ్యాఖ్యలు..!

జట్టు బ్యాటర్లు ఇంతలా రెచ్చిపోవడానికి కారణం నెట్స్ లో శ్రేయాస్ ప్రవేశపెట్టిన ఒక వినూత్నమైన కాంటెస్ట్. బ్యాటర్ల మధ్య సిక్సర్లు కొట్టే పోటీని ప్రాక్టీస్ సెషన్స్ లో నిర్వహించడం వల్ల వారిలో ఆత్మవిశ్వాసం పెరిగిందని శ్రేయాస్ తెలిపాడు. మైదానంలోకి వెళ్ళినప్పుడు ఆ ఒత్తిడి లేకుండా ఫ్రీగా షాట్స్ ఆడటానికి ఈ ప్రాక్టీస్ సెషన్లే దోహదపడ్డాయని పేర్కొన్నాడు. నిన్నటి మ్యాచ్‌ లో యువ ఆటగాళ్ళు ప్రియాన్ష్ ఆర్య (93), కూపర్ కానలీ (87) ప్రత్యర్థి బౌలర్లను చీల్చి చెండాడారు.

Also Read : తమిళనాడులో ఎన్నికల ప్రచారానికి సీఎం చంద్రబాబు

శ్రేయాస్ ఇచ్చిన స్వేచ్ఛ వల్లే తాము ఇంతలా చెలరేగిపోయామని వాళ్ళు చెప్పడం గమనార్హం. ఒకప్పుడు బలహీనంగా ఉన్న టీమ్‌ ను, వరుస విజయాలు అందుకునే స్థాయికి చేర్చడంలో శ్రేయాస్ అయ్యర్ నాయకత్వ పటిమ స్పష్టంగా కనిపిస్తోంది. మా జట్టులో ఉన్న టాలెంట్‌ను బయటకు తీయడానికి ఒక చిన్న ప్రయత్నం చేశాను. అదే ఈ సిక్స్-హిట్టింగ్ కాంటెస్ట్ అంటూ చెప్పుకొచ్చాడు. ఈ విజయం క్రెడిట్ అంతా ఆటగాళ్లదే అన్నాడు. మొత్తానికి పంజాబ్ కింగ్స్ ఫ్యాన్స్‌ కు ఈ సీజన్ పండగలా మారింది. ఇలాగే కొనసాగితే ఈసారి కప్పు కొట్టడం పంజాబ్‌కు పెద్ద కష్టమేమీ కాదు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

బ్రేకింగ్: అల్లు అర్జున్‌...

హైదరాబాద్‌లోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్ సంధ్య...

తెలంగాణాలో జనసేన తొలి...

గత కొన్నాళ్ళుగా తెలంగాణాలో పార్టీ బలోపేతం...

బ్రేకింగ్: కొడాలి అరెస్ట్...

ఏపీలో వైసీపీ కీలక నేతలకు చట్టపరమైన...

‘పెద్ది’కి బిగ్ సర్‌ప్రైజ్.....

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్...

రఘురామ కేసుపై హైకోర్ట్...

ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఐపీఎస్ అధికారి సునీల్‌...

ఏపీ లిక్కర్ స్కామ్‌లో...

ఏపీలో సంచలనం సృష్టించిన మద్యం రవాణా...

పోల్స్