ఏపీ సిఎం చంద్రబాబు పుట్టిన రోజు వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నాయి టీడీపీ శ్రేణులు. ఇక సిఎం చంద్రబాబు నేడు ఉదయం.. విజయవాడలోని పటమట అన్న క్యాంటీన్ లో అల్పాహారం తీసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన ఆసక్తికర కామెంట్స్ చేసారు. గౌరవంగా పరిశుభ్రమైన ఆహారాన్ని తీసుకునేందుకు అన్న క్యాంటీన్లకు శ్రీకారం చుట్టామన్నారు చంద్రబాబు. పటమట అన్న క్యాంటీన్ చాలా శుభ్రంగా ఉందని, పేదలు 3 పూటలా భోజనం చేసే అవకాశం క్యాంటీన్లలో లభిస్తోందని తెలిపారు.
Also Read : ఏపీకి మోదీ సర్కార్ వరాలు..!
రూ.5లకే మంచి ఆహారాన్ని ప్రభుత్వం అందిస్తోందన్నారు. ఆటో డ్రైవర్లు, ముఠా కార్మికులు, పేదలు బయట భోజనం చేయాలంటే రూ.100 చెల్లించాలని పేర్కొన్నారు. ఇస్కాన్ ఫౌండేషన్ సెంట్రలైజ్డ్ కిచెన్‌తో ఆహారం ఎంతో రుచిగా, నాణ్యతతో అన్నక్యాంటీన్లకు సరఫరా చేస్తున్నారు అని కొనియాడారు. రాష్ట్ర వ్యాప్తంగా 269 అన్న క్యాంటీన్లు పని చేస్తున్నాయి. ఇటీవల 62 ప్రారంభించాం, ఇంకో 5 క్యాంటీన్లు ప్రారంభానికి సిద్ధం అవుతున్నాయన్నారు. భువనేశ్వరిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానని కొనియాడారు.
నా పుట్టిన రోజు సందర్భంగా అన్న క్యాంటీన్ల ఒక రోజు నిర్వహణకు రూ.76 లక్షల విరాళాన్ని అందించి స్ఫూర్తిగా నిలిచారని అభినందించారు. అన్నదానం అన్నిటికంటే పవిత్రమైంది. ఇందులో ఎవరికి తోచిన విధంగా వారు భాగస్వాములన్నారు. ఒకపూట, ఒకరోజు ఇలా తోచిన విధంగా విరాళాలివ్వాలని ఆయన పిలుపునిచ్చారు. అన్నదానంలో భాగస్వాముల కావాలని పిలుపునిస్తున్నానని తెలిపారు. ఇదొక స్ఫూర్తికి వేదిక. ఎవర్నీ బలవంతం చేయడం లేదని స్పష్టం చేసారు.
Also Read : ఈసారి గ్యారంటీ.. మూడేళ్ల ముందే జగన్ హామీ..!
రాష్ట్రంలో ఏ ఒక్కరూ ఆకలితో బాధపడకూడదన్నారు చంద్రబాబు. ఆంధ్రప్రదేశ్ అన్నపూర్ణ… దేశానికి అన్నంపెట్టిన రాష్ట్రం మన ఏపీ అని కొనియాడారు. గత ప్రభుత్వం అన్నక్యాంటీన్లు మూసేసింది. వారికి మనసెలా వచ్చిందో..? అంటూ మండిపడ్డారు. భోజనం పెడతామంటే తప్పుడు కేసులు పెట్టి అరెస్టు చేశారు.. ఇది వారి ఆలోచనా విధానానికి నిదర్శనమని ఆగ్రహం వ్యక్తం చేసారు. పేదలు కడుపునిండా అన్నం తింటే భరించలేని వారు రాజకీయాల్లో ఉన్నారు. అలాంటి వారు రాష్ట్రాన్ని పాలించారంటే ప్రజలు ఆలోచించుకోవాలన్నారు.

