Friday, September 18, 2026 01:13 AM
Friday, September 18, 2026 01:13 AM

షర్మిలపై మాజీ ఎమ్మెల్యే.. దారుణ కామెంట్..!

ఏపీ రాజకీయాల్లో మాటల యుద్ధం మరోసారి హద్దులు దాటింది. ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలను టార్గెట్ చేస్తూ వైసీపీ మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారాయి. నిన్న ఓ వీడియో విడుదల చేసిన కాసు మహేష్ రెడ్డి, వైఎస్ షర్మిల రాజకీయ ప్రయాణంపై విమర్శలు చేసే క్రమంలో ఆమెను దాసి అని, టీడీపీకి ఊడిగం చేస్తున్నారంటూ తీవ్రమైన పదజాలం వాడారు. డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ బిల్లుల విషయంలో జగన్ వైఖరిని షర్మిల తప్పుబట్టిన కాసు మహేష్ రెడ్డి.. ఈ వ్యాఖ్యలు చేసారు.

Also Read : ఈసారి గ్యారంటీ.. మూడేళ్ల ముందే జగన్ హామీ..!

జగన్ సొంత చెల్లిపై పార్టీ నేతలు ఇంత ఘాటుగా, వ్యక్తిగత దూషణలకు దిగడం ఇది కొత్తేమి కాదు. గతంలో వైసీపీ అధిష్టానమే ఆమె టార్గెట్ గా విమర్శలు చేయించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మరోసారి కాసు వ్యాఖ్యలు కూడా అదే కోవలోకి వస్తున్నాయి. ఒక మహిళా నేతపై, అందునా మాజీ ముఖ్యమంత్రి కుమార్తెపై ఇలాంటి బూతు పదజాలం వాడటం పార్టీ ప్రతిష్టకు భంగం కలిగిస్తుందని ఆ పార్టీ నేతలే కొందరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో జగన్ కూడా.. షర్మిల పసుపు చీర కట్టుకోవడం పట్ల తీవ్ర వ్యాఖ్యలు చేసారు.

Also Read : తమిళనాడులో ఎన్నికల ప్రచారానికి సీఎం చంద్రబాబు

ఇప్పుడు పార్టీ నేతలు దిగజారి.. ఇప్పుడు ఏకంగా వేశ్య అనే అర్థం వచ్చేలా కామెంట్స్ వచ్చాయన్న ఆరోపణల నేపథ్యంలో జగన్ మౌనం వహిస్తారా లేక చర్యలు తీసుకుంటారా అన్నది ఆసక్తికరంగా మారింది. వైసీపీ నేతలు తన చెల్లిని ఇంతలా కించపరుస్తున్నా జగన్ ఎందుకు అడ్డుకోవడం లేదని కాంగ్రెస్ తో పాటుగా టీడీపీ నేతలు కూడా మండిపడుతున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. రాజకీయ విభేదాలు ఉంటే విధానపరంగా విమర్శించాలి కానీ, ఇలాంటి నీచమైన వ్యాఖ్యలు చేయడం సంస్కారం కాదని మండిపడుతున్నారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

మరో వైసీపీ కీలక...

అనంతపురం జిల్లాలో జరుగుతోన్న అక్రమ మైనింగ్...

కేసీఆర్ ఎర్రవల్లి ఫామ్‌హౌస్...

తెలంగాణ మాజీ సిఎం, బీఆర్ఎస్ అధినేత...

చంద్రబాబుపై కేంద్ర మంత్రి...

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత...

రచ్చకెక్కిన ఉత్తరాంధ్ర వైసీపీ...

శ్రీకాకుళం జిల్లాలో సుదీర్ఘ రాజకీయ అనుభవం...

గ్రామాల్లో అభివృద్ధి పండుగ,...

ఏపీ డిప్యూటి సిఎం పవన్ కళ్యాణ్...

నేను లండన్ వెళ్తా...

సోషల్ మీడియా సెలబ్రిటీ, ప్రముఖ యూట్యూబర్...

పోల్స్