ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో రాబోతున్న గ్లోబల్ యాక్షన్ ఎంటర్టైనర్ డ్రాగన్ గురించి రోజుకో క్రేజీ వార్త ఫిలిం నగర్ వర్గాల్లో సంచలనం సృష్టిస్తోంది. ఈ సినిమాలో ఇప్పటికే బాలీవుడ్ వర్సటైల్ యాక్టర్ అనిల్ కపూర్ విలన్ గా నటిస్తున్నట్లు సమాచారం ఉండగా, ఇప్పుడు ఇండస్ట్రీని షేక్ చేసే మరో వార్త బయటకు వచ్చింది. ఈ సినిమాలో ఒక పవర్ ఫుల్ అండర్ వరల్డ్ బాస్ పాత్ర కోసం దర్శకుడు ప్రశాంత్ నీల్ మళ్ళీ విజయ్ సేతుపతిని సంప్రదించాడట.
Also Read : ముంబైకి మకాం మార్చిన బన్నీ..?
గతంలోనే విజయ్ సేతుపతి పేరు ఈ సినిమా కోసం వినిపించినా, డేట్స్ సర్దుబాటు కాక ఆయన తప్పుకున్నారని టాక్ నడిచింది. కానీ, ఇప్పుడు సినిమాలో ఒక సర్ప్రైజ్ విలన్ పాత్ర కోసం నీల్ మళ్ళీ సేతుపతిని ఒప్పించినట్లు గాసిప్ నడుస్తోంది. ఒకవేళ అనిల్ కపూర్ మెయిన్ విలన్ అయితే, విజయ్ సేతుపతి ఒక రహస్య శక్తీగా ఎన్టీఆర్ ను ఇబ్బంది పెట్టే నెగటివ్ షేడ్ ఉన్న పాత్రలో కనిపిస్తాడని సమాచారం. విజయ్ సేతుపతికి ఎన్టీఆర్ అంటే విపరీతమైన ఇష్టమని చాలా సందర్భాల్లో చెప్పాడు.
Also Read : పవన్, ప్రభాస్ ఫ్యాన్స్ ఫేవరేట్ డైరెక్టర్ రీ ఎంట్రీ..!
ఇప్పుడు తన ఫేవరెట్ హీరోతో స్క్రీన్ షేర్ చేసుకోవడమే కాకుండా, ఆయననే ఢీకొట్టే పాత్ర అంటే సేతుపతి గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ముఖ్యంగా కేరళ, తమిళనాడు మార్కెట్లను కొల్లగొట్టడానికి ప్రశాంత్ నీల్ ఈ భారీ మల్టీస్టారర్ ప్లాన్ చేస్తున్నాడని టాక్. ప్రస్తుతం విజయ్ సేతుపతి స్లమ్ డాగ్ అనే సినిమాలో పూరి జగన్నాథ్ తో కలిసి పని చేస్తున్నాడు. అది పూర్తయిన వెంటనే డ్రాగన్ సెట్స్ మీదకు వెళ్తాడని టాక్. ఒకవేళ ఈ గాసిప్ నిజమైతే.. ఎన్టీఆర్, అనిల్ కపూర్, విజయ్ సేతుపతి.. ఈ ముగ్గురి కలయికతో డ్రాగన్ బాక్సాఫీస్ దగ్గర పూనకాలు తెప్పించడం ఖాయం.

