Friday, June 19, 2026 02:18 PM
Friday, June 19, 2026 02:18 PM

పెద్ద దస్తగిరి హత్య కేసులో.. జగన్‌ దగ్గరి బంధువు..??

కడపలో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి పెద్ద దస్తగిరి హత్య కేసు అనుకోని మలుపు తిరిగింది. ఈ కేసులో కడప మాజీ డిప్యూటీ మేయర్ బండి నిత్యానందరెడ్డి.. ప్రధాన సూత్రధారి అని పోలీసుల విచారణలో తేలింది. కానీ దస్తగిరి ఇంట్లో పోలీసులు సోదాలు చేసినప్పుడు దొరికిన 100 కోట్ల రూపాయల విలువైన ఆస్తుల సేల్‌ డీడ్‌లను విశ్లేషించినప్పుడు ఆసక్తికర విషయాలు వెలుగు చూశాయని తెలుస్తోంది.

Also Read : జనసేన వర్సెస్ టీడీపీ.. పిఠాపురంలో మళ్ళీ రచ్చ రచ్చ…!

దస్తగిరి ఇంట్లో దొరికిన డాక్యుమెంట్లలో ఒక మాజీ ఎమ్మెల్యే భార్య, కొడుకు పేరిట ఉన్న ఆస్తి పత్రాలు పోలీసులు, రెవెన్యూ అధికారులకు దొరికాయి. ఆ మాజీ ఎమ్మెల్యే జగన్‌ మేనమామ రవీంద్రనాథ్‌రెడ్డి అని సమాచారం. ఈ మ్యాటర్‌ లీక్ అవడంతో పెద్ద దస్తగరి హత్య కేసు.. పెద్ద తలకాయల వరకు వెళ్లేలా కనిపిస్తోంది. జగన్‌ మేనమామ రవీంద్రనాథ్‌రెడ్డి కమలాపురం నియోజకవర్గం నుంచి 2014, 2019లో రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఆయన కుమారుడు నరేన్‌ ప్రస్తుతం చింతకొమ్మదిన్నె జడ్పీటీసీ సభ్యుడిగా ఉన్నారు.

Also Read : సీఎం చంద్రబాబుకు మంత్రి పొన్నం ప్రభాకర్ బహిరంగ లేఖ..!

2019 నుంచి 2024 వరకు జగన్ అధికారంలో ఉన్న సమయంలో రవీంధ్రనాథ్‌రెడ్డి పెద్ద ఎత్తున భూకబ్జాలకు పాల్పడ్డారనే ఆరోపణలు వచ్చాయి. ఇప్పుడు హత్యకు గురైన దస్తగిరి ఇంట్లో రవీంద్రనాథ్‌రెడ్డికి సంబంధించిన ఆస్తి పత్రాలు దొరకడంతో.. హత్య కేసు వెనుక నిత్యానందరెడ్డితో పాటు ఇంకా ఎంత మంది ఉన్నారో అనే సందేహాలు తలెత్తుతున్నాయి. దస్తగిరి హత్య కేసులో ప్రధాన నిందితుడు నిత్యానందరెడ్డి.. మాజీ ఎమ్మెల్యే రవీంద్రనాధ్‌రెడ్డి ప్రధాన అనుచరుడు. కడప నగరంతో పాటు సీకేదిన్నె మండలంలో నిత్యానందరెడ్డి భారీగా భూములు కబ్జా చేశారని ఫిర్యాదులు వస్తున్నాయి.

Also Read : బర్త్ డే గిఫ్ట్ అదిరింది కదా చంద్రయ్యా..!

కబ్జా చేసిన భూముల్లో వాటాల పంపకం దగ్గర తేడా రావడంతోనే హత్య జరిగి ఉంటుందనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పుడు మృతుడి ఇంట్లో జగన్‌ మేనమాకు సంబంధించిన భూముల సేల్‌డీడ్లు దొరకడం ఈ కేసులో పెద్ద ట్విస్ట్‌గా మారింది. జగన్‌ అండ చూసుకొని వైసీపీ ఎమ్మెల్యేలు, ఇతర నాయకులు ఆడ్డగోలుగా ప్రజల భూములు ఆక్రమించుకొన్నారని ఈ కేసు ద్వారా బయటపడింది. అందుకేనేమో వైసీపీకి కంచుకోటలాంటి కడప జిల్లాలో గత ఎన్నికల్లో ఫ్యాన్‌ పార్టీ ఘోరంగా ఓడిపోయింది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

బ్రేకింగ్: అల్లు అర్జున్‌...

హైదరాబాద్‌లోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్ సంధ్య...

తెలంగాణాలో జనసేన తొలి...

గత కొన్నాళ్ళుగా తెలంగాణాలో పార్టీ బలోపేతం...

బ్రేకింగ్: కొడాలి అరెస్ట్...

ఏపీలో వైసీపీ కీలక నేతలకు చట్టపరమైన...

‘పెద్ది’కి బిగ్ సర్‌ప్రైజ్.....

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్...

రఘురామ కేసుపై హైకోర్ట్...

ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఐపీఎస్ అధికారి సునీల్‌...

ఏపీ లిక్కర్ స్కామ్‌లో...

ఏపీలో సంచలనం సృష్టించిన మద్యం రవాణా...

పోల్స్