Monday, April 20, 2026 08:04 PM
Monday, April 20, 2026 08:04 PM

ముంబైకి మకాం మార్చిన బన్నీ..?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన రూటు మార్చబోతున్నాడా..? పుష్ప-2 తర్వాత బన్నీ చేయబోయే ప్రాజెక్ట్ గురించి నెట్టింట ఒక ఆసక్తికరమైన వార్త చక్కర్లు కొడుతోంది. కోలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో రాబోతున్న రాకా సినిమా కోసం అల్లు అర్జున్ తన మకాంను హైదరాబాద్ నుండి ముంబైకి మార్చబోతున్నట్లు సమాచారం. ఈ సినిమా కోసం అక్కడ ఒక లాంగ్ షెడ్యూల్ ప్లాన్ చేశారట. అట్లీ మార్క్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్‌ గా తెరకెక్కనున్న ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనే హీరోయిన్ గా నటించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

Also Read : ‘చేతబడిపై చర్యలు తీసుకోండి.. సీఎస్‌కే పేరుతో ఫేక్ లెటర్..!

ఇదే గనుక నిజమైతే, వెండితెరపై బన్నీ-దీపికా జోడీ ఒక విజువల్ ఫీస్ట్‌ గా మారుతుందనడంలో సందేహం లేదు అంటున్నారు ఫ్యాన్స్. ఈ క్రేజీ కాంబినేషన్ కోసం ముంబైలో భారీ సెట్లు కూడా సిద్ధం చేస్తున్నారట. అల్లు అర్జున్ కేవలం షూటింగ్ కోసమే కాకుండా, తన బాలీవుడ్ ఎంట్రీని గ్రాండ్‌ గా ప్లాన్ చేసే ఉద్దేశంతోనే ముంబైలో కొంతకాలం ఉండాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. పుష్ప సినిమాతో ఇప్పటికే నార్త్ ఇండియాలో విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న బన్నీ, అట్లీ సినిమాతో దాన్ని వేరే లెవెల్ కు తీసుకెళ్లాలని చూస్తున్నాడు.

Also Read : అన్నం తింటే భరించలేని వారు రాజకీయాల్లో ఉన్నారు

జవాన్ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత అట్లీ చేస్తున్న ప్రాజెక్ట్ కావడంతో అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి. త్వరలోనే ఈ సినిమా షూట్ కు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ఇటీవలే దీపికా పదుకొనే తాను రెండోసారి గర్భవతిని అంటూ సోషల్ మీడియా వేదికగా ప్రకటించి అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఇప్పటికే దీపిక – రణవీర్ సింగ్ దంపతులకు సెప్టెంబర్ 2024లో దువా అనే కుమార్తె జన్మించిన సంగతి తెలిసిందే. అయితే, గర్భవతిగా ఉండి కూడా దీపికా తన ప్రొఫెషనల్ కమిట్‌మెంట్స్‌కు ఎక్కడా బ్రేక్ ఇవ్వడం లేదు. ముఖ్యంగా రాకా షూట్ లో పాల్గొనడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

పెయిడ్ ఆర్టిస్ట్ కోసం...

ఇద్దరు ముఖ్యమంత్రులను దూషించిన వ్యక్తి పై...

విజయ్‌ ఆస్తుల పంచాయితీ.....

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల వేళ టీవీకే...

బీఆర్ఎస్‌లో ముసలం.. హరీష్...

గులాబీ పార్టీలో ముసలం మొదలైందా..? జీవన్...

షర్మిలపై మాజీ ఎమ్మెల్యే.....

ఏపీ రాజకీయాల్లో మాటల యుద్ధం మరోసారి...

అన్నం తింటే భరించలేని...

ఏపీ సిఎం చంద్రబాబు పుట్టిన రోజు...

తమిళనాడులో ఎన్నికల ప్రచారానికి...

ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల అభ్యర్థుల విజయానికి...

పోల్స్