మహేంద్ర సింగ్ ధోనీ అనే పేరు వినగానే ఠక్కున గుర్తుకు వచ్చేది ఎల్లో కలర్ జెర్సీ.. ఐపీఎల్‍లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు. ఐపీఎల్‌కు ధోనీకి అవినాభావ సంబంధం ఉంది. 2008లో ఐపీఎల్ ప్రారంభమైన నాటి నుంచి ఇప్పటి వరకు చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకే ధోనీ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. చెన్నై అంటే ధోనీ, బెంగళూరు అంటే కోహ్లీ, ముంబై అంటో రోహిత్ శర్మ.. ఆయా జట్ల కూర్పులో ఎన్ని మార్పులు వచ్చినా సరే.. ఈ ముగ్గురు మాత్రం తొలి నుంచి కొనసాగుతూనే ఉన్నారు. ఇప్పటికి కూడా ప్రేక్షకులు వీరి ఆట చూసేందుకే స్టేడియంకు వస్తున్నారంటే అతిశయోక్తి కాదు. అలాంటిది ఇప్పుడు చెన్నై జట్టుకు ధోనీ క్రమంగా దూరమవుతున్నట్లు పరిస్థితి కనిపిస్తోంది.
Also Read : అమెరికాకు గుడ్ బై అంటున్న ఇండియన్స్..!
ఇప్పటి వరకు జరిగిన అన్ని ఐపీఎల్ టోర్నీల్లో ధోనీ సీఎస్‌కే తరఫున ఆడారు. ధోనీ సారధ్యంలో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఐదుసార్లు ఐపీఎల్ ట్రోఫీ సొంతం చేసుకుంది. అయితే నెమ్మదిగా జట్టు సారధ్య బాధ్యతల నుంచి ధోనీ తప్పుకోవటం మొదలు పెట్టారు. అయితే చెన్నై జట్టు ఎన్ని ప్రయోగాలు చేసినా.. ఇప్పటి వరకు సక్సెస్ కాలేదు. ఇంకా చెప్పాలంటే ధోనీ వారసుడు చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు దొరకలేదు. ధోనీ తర్వాత కెప్టెన్‌గా వ్యవహరించిన రవీంద్ర జడేజా నా వల్ల కాదు బాబోయ్ అని మధ్యలోనే వదిలేశాడు. ఆ తర్వాత వచ్చిన రుతురాజ్ గైక్వాడ్ కూడా గాయాల సాకుతో తప్పుకున్నాడు. దీంతో చెన్నై జట్టు గతంలో ఎప్పుడూ లేనట్లు గతేడాది ఐపీఎల్ సీజన్‌లో పాయింట్ల పట్టికలో చివర్లో నిలిచింది.
Also Read : బ్రేకింగ్: ఏపీ మద్యం కుంభకోణం.. నిందితుల ఇళ్లపై ఈడీ మెరుపు దాడులు..!
ఇక ఈ ఏడాది కూడా మరోసారి గైక్వాడ్‌నే సారధిగా టీమ్ మెనేజ్‌మెంట్ ప్రకటించింది. అయితే 44 ఏళ్ల ధోనీ ఆడతాడా లేదా అనేది పెద్ద క్వశ్చన్ మార్క్‌గా మిగిలింది. ఈ టోర్నీలో ఇప్పటి వరకు చెన్నై జట్టు 7 మ్యాచ్‌లు ఆడింది. ఇందులో ముూడు మాత్రమే గెలిచిన టీమ్ ఎల్లో.. 6 పాయింట్లతో పట్టికలో 5వ స్థానంలో నిలిచింది. తొలి మూడు మ్యాచ్‌లను ఓడిన చెన్నై జట్టు.. ఒకదశలో నెట్ రన్ రేట్ కూడా లేక పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో నిలిచింది. అప్పుడే అందరూ ధోనీ గురించి చర్చించారు. ధోనీ ఆడతాడా లేదా అనే అనుమానాలు అప్పుడే మొదలయ్యాయి.
Also Read : అదరగొడుతున్న రాజస్థాన్ కెప్టెన్..!
ఆ తర్వాత ఢిల్లీ, కోల్‌కతా జట్లపై వరుసగా రెండు మ్యాచ్‌లు గెలిచిన సీఎస్‌కే.. హైదరాబాద్ చేతిలో ఓడింది. పిక్కల్లో గాయం కారణంగా హైదరాబాద్ మ్యాచ్‌కు ధోనీ దూరంగా ఉన్నాడని జట్టు మేనెజ్‌మెంట్ ప్రకటించింది. అంతా నిజమే అనుకున్నారు కూడా. కానీ ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌కు ముందు ధోని బాగానే ప్రాక్టీస్ చేసినట్లు కనిపించింది. అయినప్పటికీ అతడు బరిలోకి దిగలేదు. కనీసం స్టేడియానికి కూడా రాలేదు. ఈ నేపథ్యంలో ధోని కావాలనే జట్టుకు దూరంగా ఉంటున్నాడా? అనే సందేహాలు తలెత్తగా.. న్యూజిలాండ్ మాజీ పేసర్ సైమన్ డౌల్ కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేశాడు. ధోనీ దూరానికి కారణాలను చెన్నై జట్టు ఇప్పటి వరకు ప్రకటించలేదు. ఈ సీజన్ తర్వాత ధోనీ కూడా ఐపీఎల్‌కు గుడ్ బై చెప్పేస్తారనే పుకార్లు షికారు చేస్తున్నాయి.

