Tuesday, August 4, 2026 04:59 PM
Tuesday, August 4, 2026 04:59 PM

అనంతలో లేడీ డాన్ రచ్చ.. షేక్ అవుతోన్న పోలీసు శాఖ..!

అనంతపురం జిల్లాలో ప్రకంపనలు సృష్టిస్తున్న హనీ ట్రాప్ ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. మహిళలను ఎరగా వేసి అమాయకులను బురిడీ కొట్టిస్తున్న ఈ ముఠా ఉదంతం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ కేసులో ప్రధాన నిందితురాలు, లేడీ డాన్ గా ఒక వెలుగు వెలుగుతున్న రంగమ్మ అనే మహిళను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌ కు తరలించారు. డబ్బున్న వ్యాపారవేత్తలు, రిటైర్డ్ అధికారులు, అమాయక వ్యక్తులకు మహిళల ద్వారా ఫోన్ కాల్స్ చేయించి, వారితో పరిచయం పెంచుకోవడం ఈ ముఠా పనితీరు.

Also Read : మంగ్లీకి ఆడియో సెగ.. స్కామ్‌ లో అడ్డంగా దొరికిపోయిందా..?

ఏకాంతంగా గడుపుదామని పిలిపించి, నగ్నంగా ఉన్న సమయంలో వీడియోలు తీసి.. వాటిని సోషల్ మీడియాలో పెడతామని బెదిరించి లక్షల రూపాయలు వసూలు చేస్తున్నట్లు విచారణలో తేలింది. ఇప్పటివరకు సుమారు రెండు కోట్ల రూపాయల మేర ఈ ముఠా వసూలు చేసినట్లు సమాచారం. ఈ కేసులో అత్యంత విస్మయకరమైన విషయం ఏమిటంటే.. రక్షణ కల్పించాల్సిన పోలీసులే ఈ ముఠాకు సహకరించడం సంచలనంగా మారింది. బాధితులు ఫిర్యాదు చేయడానికి వెళ్లినప్పుడు వారిని బెదిరించడం లేదా నిందితులతో సెటిల్మెంట్ చేయించడం వంటి పనులు చేశారని ఆరోపణలు వస్తున్నాయి.

Also Read : ఇంత ఓవర్ యాక్షన్ ఎందుకు అయ్యోర్లు..!

ఈ నేపథ్యంలో రాప్తాడు సీఐ శ్రీహర్ష, అనంతపురం త్రీ టౌన్ సీఐ రాజేంద్రనాథ్ యాదవ్లను ఉన్నతాధికారులు వీఆర్ కు బదిలీ చేశారు. మరో 8 మంది కానిస్టేబుళ్ల ప్రమేయంపై కూడా శాఖాపరమైన విచారణ జరుగుతోందని పోలీసు శాఖ అంటుంది. మొత్తం ఈ కేసులో 10 మంది పోలీసులు అదుపులో ఉన్నట్లు తెలుస్తోంది. రంగమ్మ వెనుక ఉన్న ఇతర పెద్దలు ఎవరు..? పోలీసులకు ఏ రూపంలో ముడుపులు అందాయి..? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బాధితులు ఎవరైనా ఉంటే ధైర్యంగా ముందుకు వచ్చి ఫిర్యాదు చేయాలని ఉన్నతాధికారులు కోరుతున్నారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

రాజకీయాల్లోకి త్రిష..? సీఎం...

తమిళనాడు రాజకీయాల్లో గత రెండు రోజులుగా...

జగన్ పర్యటన దెబ్బ.....

ఉత్తరాంధ్ర రాజకీయాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ...

బ్రేకింగ్: విజయ్ పై...

తమిళనాడు రాజకీయాలు ఒక్కసారిగా తీవ్ర ఉత్కంఠగా...

దమ్ముంటే పట్టుకోండి చూద్దాం.....

ఏపీలో కూటమి సర్కార్ అధికారంలో ఉందో.....

మళ్లీ మొదలైన కావేరీ...

దక్షిణ భారతదేశంలో దశాబ్దాలుగా నలుగుతున్న కావేరీ...

రోడ్డు ప్రమాదాలపై కేంద్రం...

దేశంలో నానాటికీ పెరిగిపోతున్న ఘోర రోడ్డు...

పోల్స్