Friday, August 28, 2026 12:12 PM
Friday, August 28, 2026 12:12 PM

గుండెపోటు ముప్పును ముందే గుర్తించే టెస్ట్..!

చాలా మంది తమ గుండె ఆరోగ్యాన్ని తెలుసుకోవడానికి సాధారణంగా లిపిడ్ ప్రొఫైల్ లేదా బ్యాడ్ కొలెస్ట్రాల్ పరీక్షలు చేయించుకుంటారు. అయితే, ఈ రిపోర్టులలో కొలెస్ట్రాల్ స్థాయిలు నార్మల్‌గా ఉన్నప్పటికీ చాలా మంది హఠాత్తుగా గుండెపోటుకు గురవుతున్నట్లు క్లినికల్ పరిశోధనలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో, సాధారణ పరీక్షల కంటే ‘అపోలిపోప్రోటీన్ బి’ లేదా ‘ApoB’ బ్లడ్ టెస్ట్ అనేది గుండె జబ్బుల నిజమైన ముప్పును అత్యంత ఖచ్చితంగా అంచనా వేస్తుందని వైద్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు.

Also Read : వాళ్ళందరూ భారతీయులే.. నేపాల్ సంచలన ప్రకటన..!

సాధారణ లిపిడ్ ప్రొఫైల్ కేవలం కొలెస్ట్రాల్ పరిమాణాన్ని మాత్రమే కొలిస్తే, ApoB టెస్ట్ గుండె ధమనులలో రక్తాన్ని అడ్డుకునే హానికరమైన కొలెస్ట్రాల్ కణాల సంఖ్యను లెక్కిస్తుంది. ధమనుల గోడలలోకి ప్రవేశించి ప్లాక్ లేదా కొవ్వు పేరుకుపోయేలా చేయడంలో ఈ ApoB కణాలు కీలక పాత్ర పోషిస్తాయి. ఎల్‌డీఎల్ కొలెస్ట్రాల్ నార్మల్‌గా ఉన్నా.. రక్తంలో ఈ కణాల సంఖ్య ఎక్కువగా ఉంటే గుండెపోటు వచ్చే ప్రమాదం చాలా ఎక్కువగా ఉంటుంది.

Also Read : కేంద్రంపై విజయ్ మాల్యా సంచలన ఆరోపణలు..!

ముఖ్యంగా డయాబెటిస్, ఊబకాయం, మెటబాలిక్ సిండ్రోమ్, అధిక ట్రైగ్లిజరైడ్స్ సమస్యలు ఉన్నవారు మరియు కుటుంబంలో ఎవరికైనా చిన్న వయసులోనే గుండె జబ్బులు వచ్చిన చరిత్ర ఉన్నవారు ఈ ApoB పరీక్ష చేయించుకోవడం ఎంతో ఉత్తమం అని నిపుణులు చెప్పుకొస్తున్నారు. పెద్దలలో ఈ ApoB స్థాయి 90 mg/dL కంటే తక్కువగా ఉండటం మంచిది. ఒకవేళ ఇది 120 mg/dL లేదా అంతకంటే ఎక్కువ ఉంటే గుండె జబ్బుల ముప్పు చాలా ఎక్కువగా ఉన్నట్లు అర్థం. ఈ హానికరమైన కొలెస్ట్రాల్ కణాల స్థాయిలను తగ్గించుకోవడానికి మెడిటరేనియన్ తరహా ఆహార పద్ధతులు, పీచు పదార్థాలు ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవడం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, బరువు నియంత్రణ మరియు ధూమపానం మానేయడం వంటి జీవనశైలి మార్పులు ఎంతో సహాయపడతాయి.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

అమరావతిలో మళ్ళీ ల్యాండ్...

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణ పనులను...

మళ్ళీ తెరమీదకు బీసీ...

మాజీ మంత్రి విడదల రజనీ అప్పుడప్పుడు...

ఏపీ లిక్కర్ స్కామ్‌లో...

గత రెండేళ్ళ నుంచి సంచలనంగా మారిన...

ఆ విషయంలో వైసీపీ...

కాలం కలిసి రాకపోతే తాడు కూడా...

తెలుగుదేశం పార్టీకి కేంద్రం...

కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్‌డీఏ సర్కార్‌లో...

దిల్ రాజుకు ఇతర...

టాలీవుడ్ అగ్ర నిర్మాత దిల్ రాజు...

పోల్స్