సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత మితిమీరిన స్వేచ్ఛతో కొందరు విషం చిమ్మే ప్రయత్నం చేయడం మనం చూస్తూనే ఉంటాం. ఈ నేపధ్యంలో తాజాగా.. ఏపీ రాజధాని అమరావతి, రాష్ట్ర ప్రయోజనాలు, అధికార కూటమి విజయంపై నిరంతరం తప్పుడు విశ్లేషణలతో విషం చిమ్ముతున్న ప్రొఫెసర్ కె. నాగేశ్వరరావు నైజాన్ని ఎండగట్టేందుకు టీడీపీ, , జనసేన కూటమి సోషల్ మీడియా సైన్యం రంగంలోకి దిగింది. పక్క రాష్ట్రంలోని ఏసీ స్టూడియో సోఫాలో కూర్చొని ఆంధ్రా అభివృద్ధిపై పనిగట్టుకుని అబద్ధాల పులిహోర వండుతున్నారంటూ నెటిజన్లు ఆయనపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Also Read : సీమపై గురిపెట్టిన లోకేష్..!
ఈ క్రమంలోనే సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ఎక్స్ వేదికగా #PulihoraNageswaraRao హ్యాష్ ట్యాగ్ జాతీయ స్థాయిలో మొదటి స్థానంలో ట్రెండింగ్ అవుతూ ప్రభంజనం సృష్టిస్తోంది. ఇటీవల ఒక రాజకీయ డిబేట్ లో ప్రొఫెసర్ నాగేశ్వరరావు చేసిన కొన్ని సంచలన వ్యాఖ్యలు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర దుమారాన్ని రేపాయి. గతంలో వైఎస్ జగన్ ను అరెస్ట్ చేయాలంటూ జనసేన అధినేత, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ స్వయంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కోరారని నాగేశ్వరరావు ఒక కల్పిత కథను తెరపైకి తెచ్చారు.
Also Read : అమెరికాలో ఐటీ ఉద్యోగులకు బిగ్ షాక్..!
అంతేకాదు.. జగన్ ను నమ్మొచ్చు కానీ, చంద్రబాబును నమ్మకూడదు అని అమిత్ షా పవన్ తో అన్నారంటూ ఎలాంటి ఆధారాలు లేని పచ్చి అబద్ధాలను ఆయన వండారని కూటమి శ్రేణులు మండిపడుతున్నాయి. కూటమి భాగస్వామ్య పక్షాల మధ్య చిచ్చు పెట్టడానికి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి రాజకీయంగా లబ్ధి చేకూర్చడానికే ఆయన ఈ మైండ్ గేమ్ ఆడారని టీడీపీ, జనసేన మండిపడుతున్నాయి. అమరావతిని చంద్రబాబు నట్టేట ముంచుతాడంటూ వరుసగా నెగెటివ్ వీడియోలు చేయడం, రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా అడ్డుపడేలా విశ్లేషణలు ఇవ్వడమే ప్రొఫెసర్ నాగేశ్వరరావు పనిగా పెట్టుకున్నారని అటు సామాన్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Also Read : విశాఖకు కేంద్రం బిగ్ గుడ్ న్యూస్..!
ఈ నేపథ్యంలో, నువ్వు చెప్పిన దానికి ఆధారాలు చూపించు.. లేదంటే పవన్ కల్యాణ్ కు, ఆంధ్రా ప్రజలకు బహిరంగ క్షమాపణలు చెప్పు అంటూ కూటమి సైన్యం ఓపెన్ ఛాలెంజ్ విసిరింది. ఆంధ్ర పౌరుల ఆత్మగౌరవాన్ని, అమరావతి రాజధాని అభివృద్ధిని తక్కువ చేసి చూపే ఇలాంటి మేధో డ్రామాలను తిప్పికొట్టే ప్రయత్నం చేయాలని కోరుతున్నారు. ఈ నేపధ్యంలో ప్రొఫెసర్ నాగేశ్వర్ మరియు ఓ టీవీ ఛానెల్‌పై కేసు నమోదు చేయడం గమనార్హం. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నాదెండ్ల మనోహర్, కేంద్ర హోంమంత్రి అమిత్‌షాలపై అనుచిత వ్యాఖ్యలు చేశారని ప్రొఫెసర్ నాగేశ్వర్‌పై కాకినాడ ఇంద్రపాలెం పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అయింది.

