Saturday, September 5, 2026 11:42 PM
Saturday, September 5, 2026 11:42 PM

అర్ధరాత్రి టన్నెల్‌ లోకి.. తెల్లారితే ఢిల్లీకి.. నిమ్మల డెడికేషన్ కి ఫిదా..!

ఏపీ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు మే నెలలో చేపట్టిన వరుస క్షేత్రస్థాయి పర్యటనలు, ప్రాజెక్టుల తనిఖీలు ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా ఓ రేంజ్ లో వైరల్ అవుతున్నాయి. ఏసీ రూములకే పరిమితం కాకుండా, ఎండలను సైతం లెక్కచేయకుండా ఆయన అర్ధరాత్రి వేళల్లో ప్రాజెక్ట్ టన్నెల్స్‌ లోకి వెళ్లి పనులను పర్యవేక్షిస్తున్న తీరుపై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఈ మే నెలలో మంత్రి నిమ్మల రామానాయుడు ప్రకాశం జిల్లా పెద్ద దోర్నాలలో వెలిగొండ ప్రాజెక్టు పనులను పరిశీలించారు.

Also Read : మరో మాట నిలబెట్టుకున్న నారా లోకేష్..!

సాధారణంగా పగటిపూట అధికారులు వచ్చే సమయాల్లో కాకుండా, ఆయన ఏకంగా అర్ధరాత్రి వేళ టన్నెల్ లోపలికి 12 కిలోమీటర్ల మేర ప్రయాణించి లైనింగ్ పనుల పురోగతిని స్వయంగా తనిఖీ చేశారు. ఐదు గ్యాంట్రీలతో జరుగుతున్న పనులను రాత్రి సమయాల్లో పర్యవేక్షిస్తూ, కార్మికుల్లో, అధికారుల్లో ఉత్సాహం నింపిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యాయి. కేవలం క్షేత్రస్థాయిలోనే కాకుండా, ప్రాజెక్టులకు నిధుల సాధన కోసం మంత్రి చేసిన ఢిల్లీ టూర్ కూడా సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌ గా మారింది.

Also Read : మహానాడుపై టీడీపీ సంచలన నిర్ణయం..!

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో కలిసి ఢిల్లీ వెళ్లిన ఆయన, కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్‌ తో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. 2027 జూన్ నాటికి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసి ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా జాతికి అంకితం చేస్తామని ఆయన సగర్వంగా ప్రకటించిన ప్రెస్ మీట్ వీడియోలు వైరల్ అయ్యాయి. ఇదే మే నెలలో తన సొంత నియోజకవర్గమైన పాలకొల్లు పరిధిలోని యలమంచిలి మండలంలో ఒకే రోజు కోట్ల రూపాయల నిధులతో శంకుస్థాపనలు చేసి మంత్రి నిమ్మల స్పీడ్ పెంచారు. పెనుమర్రు, కట్టుపాలెం, వడ్డీలంక, గంగడపాలెం వంటి గ్రామాల్లో క్షేత్రస్థాయి పర్యటనలు చేస్తూ ప్రజలతో నేరుగా మమేకమయ్యారు. పాలకొల్లు క్యాంప్ కార్యాలయంలో అర్ధరాత్రి దాటే వరకు ఉండి ప్రజల సమస్యలను స్వయంగా ఆలకించడం, అనారోగ్యంతో వచ్చిన వారికి నేరుగా ఆసుపత్రి వైద్యులతో ఫోన్లలో మాట్లాడి మెరుగైన చికిత్స అందించడం వంటివి వైరల్ గా మారాయి.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

ప్లేట్ తిప్పేసిన రాజగోపాల్...

తెలంగాణ కాంగ్రెస్ రాజకీయాల్లో గత కొంతకాలంగా...

ఏపీ ఉద్యోగులకు సీఎం...

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సుదీర్ఘకాల సమస్యల...

టీవీకే టార్గెట్‌లో డీఎంకే...

తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త రణం మొదలైంది....

ఏపీ రాజకీయాల్లో బిగ్...

ఏపీ రాజకీయాల్లో అత్యంత సీనియర్ నాయకుడు,...

సాయి రెడ్డి పార్టీకి...

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో గత కొన్నాళ్ళుగా తీవ్ర...

తెలంగాణలో రేపే మంత్రివర్గ...

తెలంగాణ రాజకీయాల్లో గత కొన్ని రోజులుగా...

పోల్స్