Wednesday, July 8, 2026 07:52 AM
Wednesday, July 8, 2026 07:52 AM

మరో మాట నిలబెట్టుకున్న నారా లోకేష్..!

ఏపీలో ప్రభుత్వ విశ్వవిద్యాలయాలలో విద్యా ప్రమాణాలను పెంచేందుకు, ఖాళీలను భర్తీ చేసేందుకు కూటమి ప్రభుత్వం ఓ కీలక నిర్ణయం తీసుకుంది. వార్షిక జాబ్ క్యాలెండర్ హామీ నిలబెట్టుకునే దిశగా కీలక అడుగు వేసింది. రాష్ట్రంలోని 19 ప్రభుత్వ వర్సిటీలు, ఆర్జీయూకేటీ పరిధిలో మొత్తం 1,523 ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి అనుమతిస్తూ ప్రభుత్వం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. ఈ భారీ నోటిఫికేషన్‌కు సంబంధించిన వివరాలను రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.

Also Read : మహానాడుపై టీడీపీ సంచలన నిర్ణయం..!

ఈ నియామక ప్రక్రియను 6 నెలల కాలపరిమితిలోపు పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్న మొత్తం 1,523 పోస్టులలో అన్ని వర్గాలకు ప్రాధాన్యత ఇస్తూ 279 బ్యాక్‌లాగ్ పోస్టులను, 1,244 రెగ్యులర్ పోస్టులను చేర్చారు. ఇందులో 1,020 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు, 334 అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులు, 63 ప్రొఫెసర్ పోస్టులు మరియు 104 ఆర్జీయూకేటీ లెక్చరర్ పోస్టులు ఉన్నాయి.

Also Read : ఏపీ సచివాలయంలో వైసీపీ హవా.. నిజమేనా..?

రాష్ట్రంలోని వివిధ ప్రతిష్టాత్మక విద్యాసంస్థల్లో రాజీవ్‌ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయంలో అత్యధికంగా 311 పోస్టులు, ఆంధ్ర విశ్వవిద్యాలయంలో 246 పోస్టులు, శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయంలో 125 పోస్టులు మరియు శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో 103 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ అత్యంత పారదర్శకంగా, మెరిట్ ఆధారంగా సాగుతుందని ప్రభుత్వం తెలిపింది. అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా స్క్రీనింగ్, రాత పరీక్ష నిర్వహిస్తారు. ఒక పోస్టుకు 12 మంది కంటే ఎక్కువ మంది అర్హులైన అభ్యర్థులు ఉన్నప్పుడే ఈ పరీక్ష ఉంటుందని ప్రభుత్వం పేర్కొంది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

మాట నిలబెట్టుకున్న కూటమి...

ఏపీలోని రైతులకు ప్రభుత్వం తీపి కబురు...

ప్రభుత్వ లాయర్ల వైఫల్యమేనా..?...

ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్...

నాడు లేవని నోళ్ళు...

గత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో...

రేవంత్ క్యాంపు ఆఫీసుల...

తెలంగాణలో అధికార, ప్రతిపక్షాల మధ్య పెద్ద...

యూట్యూబర్ రావణ్.. ఇప్పట్లో...

ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్...

గవర్నర్ కోటా ఎమ్మెల్సీలు...

ఏపీలో ఖాళీ కానున్న గవర్నర్ కోటా...

పోల్స్