ఏపీ సచివాలయంలో వైసీపీ “హవా” నడుస్తుందా..? ఇందుగలడు.. అందులేడని సందేహం వలదు.. ఎందెందు వెతికినా.. అందందే కలడు.. అదేమిటో తెలుసుకోవాలని అనుకుంటున్నారా..! ఈ పరిశోధనా కధనంలో అన్ని విషయాలు ఉన్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు కావస్తోంది. జిల్లాల్లో పాలన వ్యవస్థ పరిస్థితి ఎలా ఉందో..? డైరెక్టరేట్, కమిషనరేట్‌లలో పరిస్థితులు ఎలా ఉన్నాయి..? రాష్ట్ర పరిపాలనకు సచివాలయం అఅనేది గుండెకాయ లాంటిది. సచివాలయంలో పాలన పైన, అక్కడ వివిధ హోదాల్లో పనిచేస్తున్న కింద స్థాయి అధికారుల అభిప్రాయం మాత్రం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది.
Also Read : పొదుపు బాటలో ఏపీ సర్కార్.. చంద్రబాబు నుంచి పెమ్మసాని వరకు..!
సచివాలయంలో ఇప్పటికీ వైసీపీ ప్రభుత్వం పాలనే నడుస్తుందని.. 10 నుండి 15 ఐఏఎస్ అధికారులు మినహా.. మిగతా ఐఏఎస్ అధికారులందరూ వైసీపీ అభిమానులే అని చెబుతున్నారు. తాము కూటమి ప్రభుత్వంలో పని చేస్తున్నట్లుగా ఉన్నతాధికారులు ఎవరూ భావించటం లేదంటున్నారు. ఇదే అనుమానాన్ని కిందిస్థాయి ఉద్యోగులు కూడా వ్యక్తం చేస్తున్నారు. అంతే కాదు జీఏడీ శాఖల్లో వైసీపీ అభిమానులే ఎక్కువగా ఉన్నారని, ఎప్పటికప్పుడు సమాచారాన్ని వైసీపీ నేతలకు చేర వేస్తున్నారన్నారని.. అంతే కాదు మంత్రుల పెషీల్లో వివిధ హోదాల్లో పనిచేస్తున్న ఆంతరంగిక అధికారుల్లో నూటికి 99 శాతం పైగా వైసీపీ అభిమానులే ఉన్నారంటున్నారు. పట్టుమని పది మంది కూడా టీడీపీ, జనసేన పార్టీల అభిమాన అధికారులు లేరంటున్నారు.
అంతే కాదు ప్రస్తుత సీఎం కార్యాలయంలో కేవలం ఒకే ఒక ఐఏఎస్ అధికారి, ఆయన పెషీ అధికారులు మాత్రమే చంద్రబాబు అభిమానులంటున్నారు. మిగతా అధికారులు, వారి పెషీ అధికారులు, సిబ్బందిలో కేవలం 10 శాతం కూడా చంద్రబాబు అభిమానులు లేరన్న ప్రచారం జరుగుతోంది. ఇక్కడ నిజాయతీ కన్నా అవినీతికే ఎక్కువ విలువ ఉందట. జగన్ మోహన్ రెడ్డి హయాంలో ఒక్కరు కూడా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ అభిమానుల ఉండేవారు లేరట. చంద్రబాబు హయాంలో ఇక్కడ సీన్ అంతా “రివర్స్”. ఇటు సీఎం పెషీలో.. అటు మంత్రుల పెషీల్లో అత్యంత ముఖ్యమైన జీఏడీ శాఖలో కూడా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ అభిమానుల కన్నా.. వైసీపీ అభిమానులే ఎక్కువగా కనిపిస్తుడటం, టీడీపీ, జనసేన పార్టీల అభిమానులైన, సచివాలయం అధికారులకు ఆందోళన కలిగిస్తుంది.
Also Read : విరాట్ కోహ్లీ విశ్వరూపం.. కోహ్లీ ఖాతాలో కొత్త రికార్డులు..!
ప్రస్తుతం ఏది ఓపెన్‌గా కన్పించదు.. కానీ అంతా బయటపడని వైసీపీ మయంగా, గుప్పెట మూసి ఉంటుందట. ఇప్పటికీ అదే పరిస్థితి స్పష్ గా కనిపిస్తున్న నేపథ్యంలో టీడీపీ, జనసేన పార్టీల అభిమానులు అటు కక్కలేక.. ఇటు మింగ లేక.. చేసేది ఏమి లేక.. మౌనం వహిస్తున్నారు. పాటిస్తున్నారు కూడా. ముఖ్యంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావటానికి కారణమైన కాపు, కమ్మ కులస్తుల అధికారుల పరిస్థితి దారుణంగా ఉందట. సచివాలయంలోనే ఇంతటి దారుణ పరిస్థితి కనిపిస్తుంటే… ఇక రాష్ట్రంలోని మిగిలిన కార్యాలయాల్లో.. ?

