భారత మిడ్ సైజ్ ఎస్‌యూవీ సెగ్మెంట్ లో జర్మన్ కార్ల తయారీ సంస్థ వోక్స్ వ్యాగన్ ఏప్రిల్ 2026 నెలవారీ విక్రయాల్లో సంచలన రికార్డు నమోదు చేసింది. ఆ సంస్థకు చెందిన పాపులర్ మోడల్ వోక్స్ వ్యాగన్ టైగూన్ ఏకంగా 70 శాతం నెలవారీ వృద్ధిని, అలాగే 34 శాతం వార్షిక వృద్ధిని సాధించింది. హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్, మారుతి విక్టోరిస్ వంటి దిగ్గజాలు ఏలుతున్న ఈ సెగ్మెంట్ లో టైగూన్ సాధించిన ఈ సడన్ జంప్ ఆటోమొబైల్ రంగాన్ని ఆశ్చర్యపరిచింది. అయితే, ఈ భారీ విక్రయాల వెనుక ఉన్న అసలు మ్యాజిక్ కస్టమర్ల బుకింగ్స్ మాత్రమే కాదు, కంపెనీ వ్యూహాత్మక డీలర్ డిస్పాచ్ లు కూడా అంటుంది కంపెనీ.
Also Read : మహానాడుపై టీడీపీ సంచలన నిర్ణయం..!
ఈ రేంజ్ లో క్రేజ్ కు ప్రధాన కారణం.. ఏప్రిల్ 14న కంపెనీ భారత్ లో సరికొత్త టైగూన్ ఫేస్ లిఫ్ట్ మోడల్ ను అధికారికంగా మార్కెట్లోకి విడుదల చేసింది. కొత్త మోడల్ ప్రొడక్షన్ ఏప్రిల్ 7 నుండి ప్రారంభం కావడంతో, అంతకుముందు మార్చి నెలలో పాత మోడల్ తయారీ మరియు షోరూమ్ లకు పంపే డిస్పాచ్ లను కంపెనీ పూర్తిగా తగ్గించేసింది. ఎప్పుడైతే కొత్త ఫేస్ లిఫ్ట్ మోడల్ మార్కెట్లోకి వచ్చిందో, ఏప్రిల్ నెలలో దేశవ్యాప్తంగా ఉన్న షోరూమ్ లకు ఒకేసారి కొత్త కార్ల హోల్ సేల్ డిస్పాచ్ లు పెరిగాయి.
Also Read : వారిని లైట్ తీసుకున్నారెందుకు..?
కంపెనీ అధికారిక లెక్కల ప్రకారం.. ఏప్రిల్ నెలలో మొత్తం 1,543 యూనిట్ల టైగూన్ కార్లను డీలర్లకు సరఫరా చేశారు. గత ఏడాది ఏప్రిల్‌లో ఈ సంఖ్య 1,155 గా మాత్రమే ఉండటంతో, కేవలం 388 కార్ల వ్యత్యాసంతోనే ఈ 34% వృద్ధి కనిపించింది. మొత్తంగా ఏప్రిల్ 2026లో ఫోక్స్ వ్యాగన్ కంపెనీ సాధించిన హోల్ సేల్ విక్రయాల డేటా చూస్తే, 1,543 యూనిట్లతో టైగూన్ టాప్ సేలింగ్ కార్ గా నిలిచింది. దీని తర్వాత విర్చుస్ 1,162 యూనిట్లతో రెండో స్థానంలో నిలవగా, గత ఏడాదితో పోలిస్తే ఇది 28 శాతం క్షీణతను నమోదు చేసింది.

