Friday, August 14, 2026 05:41 PM
Friday, August 14, 2026 05:41 PM

ఉద్యోగం కావాలా.. పబ్లిక్ సర్వీస్ కమిషన్ బాగోతం..!

జార్ఖండ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఉద్యోగ నియామక ప్రక్రియలో జరిగిన కుంభకోణంపై విద్యార్థులు కొన్ని వారాలుగా ఆందోళన చేస్తున్నారు. ఈ విషయంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న సుమారు 20 మందిని ఆ రాష్ట్ర క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్‌మెంట్ అరెస్ట్ చేసింది. వారిలో పరీక్షల నిర్వహణ ఏజెన్సీ అయిన టీడీపీఎల్ మార్కెటింగ్ మేనేజర్ అభయ్ తివారీ ఒకరు. ఆయన ఉద్యోగ నియామకాల్లో జరిగిన అవకతవకలపై పోలీసులకు వెల్లడించారు.

Also Read : బ్రేకింగ్ : అమరావతిపై ఆళ్ళ కుట్రలకు సుప్రీం బ్రేక్..!

తాము అడిగిన డబ్బులు చెల్లించినవారికి ఉద్యోగం ఇప్పించేందుకు ప్రణాళిక చేశారు. దీనిలో టీడీపీఎల్ డైరెక్టర్ రామ్ వీర్ సింగ్, జార్ఖండ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మాజీ చైర్మన్ ఎల్ ఖియాంగై, జేపీఎస్‌సీ సభ్యులు అజితా భట్యాచార్య, డాక్టర్ జమాల్ అహ్మద్, డాక్టర్ అనిమా హనీ భాగస్వాములుగా ఉన్నారు. ఏజెంట్లు, మధ్యవర్తులు అభ్యర్థులను ఖరారు చేసేవారు. వారిని ఒక ఏజెంట్ ఆదిత్య పాండే టీడీపీఎల్ రామ్ వీర్ సింగ్‌కు పరిచయం చేశారు. ఆయన వారిని కమిషన్ సభ్యుల వద్దకు పంపి ఇంటర్వ్యూ బోర్డును ఫిక్స్ చేసుకుని ఫైనల్ మార్కులు పెరిగేలా ప్రణాళిక చేసినట్లు మార్కెటింగ్ మేనేజర్ అభయ్ తివారీ వెల్లడించారు.

జేపీఎస్‌సీ నిర్వహించిన 12, 13 పరీక్షల్లోని లెవల్స్‌ను బట్టి ఒక్కో అభ్యర్థి నుంచి రూ.15 లక్షల వరకు తీసుకున్నట్లు తెలిపారు. అలా ఇంటర్వ్యూ వరకు సుమారు రూ.60 లక్షల నుంచి రూ.70 లక్షల వరకు వసూలు చేసినట్లు తెలిపారు. ఈ స్కామ్ ద్వారా ఉద్యోగాలకు ఎంపికైన ముగ్గురి పేర్లను వెల్లడించారు. పోలీస్ సూపరింటెండెంట్ రాబిన్ కుమార్, డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ శైలేష్ సింగ్, డిప్యూటీ జైలర్ రాజేశ్ కుమార్ రజక్ ఉన్నట్లు తెలిపారు. వీరిని లాలూ యాదవ్ అనే ఏజెంట్ తీసుకురాగా, వారిని రామ్ వీర్ సింగ్, అజితా భట్టాచార్య బోర్డుతో ఇంటర్వ్యూ ఫిక్స్ చేశారని దర్యాప్తులో వెల్లడైంది. దీనిలో ఎగ్జామ్ కంట్రోలర్ శ్వేతా గుప్తా, పతంజలి కోచింగ్ సెంటర్ ఆపరేటర్ రవికుమార్ పాలుపంచుకున్నట్లు అధికారులు వెల్లడించారు.

Also Read : గౌతమ్ గంభీర్ కోచ్ పదవి సేఫేనా..?

డబ్బులను వివిధ రూపాల్లో చేరవేసినట్లు గుర్తించారు. అజితా భట్టాచార్యకు పంపాల్సినవి ఆమె పీఏ బ్రిజ్ రామ్‌కు ఇచ్చారు. ఖియాంగ్జేకు ఇవ్వాల్సినవి ధర్మేంద్ర అనే వ్యక్తి ద్వారా ఇచ్చేవారు అని వెల్లడైంది. అలాగే చైల్డ్ డెవలప్‌మెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్ పరీక్షలో కూడా స్కామ్ చేసినట్లు గుర్తించారు. ఒక్కో అభ్యర్థి నుంచి రూ.10 లక్షల చొప్పున వసూలు చేసినట్లు వెల్లడించారు. కాజల్ భారతి అనే అభ్యర్థి నుంచి రూ.10 లక్షలు తీసుకుని అజితా భట్టాచార్య బోర్డు ఇంటర్వ్యూను ఫిక్స్ చేసినట్లు పోలీసులకు అభయ్ వివరించారు. పోలీసులు ఇప్పటికే జేపీఎస్‌సీ మాజీ చైర్మన్ ఖియాంగైను అరెస్ట్ చేశారు. అజితా భట్టాచార్య, డాక్టర్ జమాల్ అహ్మద్, డాక్టర్ అమిమా హనా కమిషన్ సభ్యత్వానికి రాజీనామా చేశారు. వీరికి సీఐడీ సమన్లు జారీ చేసి, మాజీ చైర్మన్‌కు సంబంధించిన అంశాలపై విచారించింది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

ఏపీలో మద్యం ధరలు...

ఆంధ్రప్రదేశ్‌లో నూతన రిటైల్ ఎక్సైజ్ విధానం...

ఎన్టీఆర్ అభిమాని కొడుక్కి...

తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధ భక్తి...

బ్రేకింగ్ : అమరావతిపై...

రాజధాని అమరావతి అసైన్డ్ భూముల ల్యాండ్...

గ్లోబల్ స్టేజీపై అమరావతి...

భారతదేశ అర్బన్ ప్లానింగ్ చరిత్రలోనే అత్యంత...

అమరావతి అసెంబ్లీలో స్వాతంత్ర్య...

భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ప్రజలందరినీ...

అమరావతి సీడ్ యాక్సెస్...

ఆంధ్రప్రదేశ్ రాజధాని నగరం అమరావతి రవాణా...

పోల్స్