రెండు రోజులుగా సోషల్ మీడియా అంతా ఒకటే టాపిక్. అదే పాపం సీతారాం. నిజమే.. భార్య కనిపించటం లేదనే మనస్థాపంతో ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో హైదరాబాద్ హుస్సేన్ సాగర్‌లో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. జీతం రెండు లక్షలు.. ఇద్దరు పిల్లలు.. ఎలాంటి ఇబ్బందులు లేని కుటుంబం.. ఆరోగ్యంగా తల్లిదండ్రులు.. సొంత ఊరిలో ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేని పరిస్థితి. ఒక్క మాటలో చెప్పాలంటే.. ఆనందమైన జీవితం.. తొందరపాటు నిర్ణయం కారణంగా ఇద్దరు పిల్లలు తండ్రి లేని వాళ్లు అయ్యారు. మరి ఎందుకు అంత తొందరపాటు నిర్ణయం.. భార్య కనిపించకపోతేనే ఆత్మహత్య చేసుకోవాలా..? భార్య పుట్టింటికి పోతేనే చనిపోతారా..? ఇవే ప్రశ్నలు అప్పట్లో బాగా వినిపించాయి. అయితే సరిగ్గా రెండు నెలల తర్వాత ఈ ప్రశ్నలకు జవాబు దొరికింది. సీతారాం చావు వెనుక ఎంత పెద్ద విషాదం ఉందో బయట ప్రపంచానికి తెలియటంతో అంతా ఆశ్చర్యపోతున్నారు.
Also Read : టీటీడీకి పవన్ లేఖ.. నానా పాట్లు పడుతున్న వైసీపీ..!
మార్కాపురం పట్టణానికి చెందిన సీతారాం హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. జీతం రెండు లక్షల వరకు వస్తుంది. సీతారాంకు నంద్యాలకు చెందిన రేణుకతో పెద్దలు వివాహం జరిపించారు. వీరి కాపురం చాలా చక్కగా ఉందనేది బంధువుల మాట. వీరికి ఇద్దరు పిల్లలు కూడా. అయినా సరే.. సీతారాం ఆత్మహత్య చేసుకున్నాడు. ఎందుకు అని ఆరా తీయగా.. అసలు విషయం తెలిసింది. సీతారాం ఆత్మహత్య కేసు ఇప్పుడు సంచలన మలుపు తిరిగింది. ఈ కేసులో అనూహ్య పరిణామాలు వెలుగులోకి రావడంతో పోలీసులే కాదు, ప్రజలు సైతం షాక్ అవుతున్నారు. సీతారాం ఆత్మహత్యకు భార్య రేణుక చేసిన అరాచకాలే కారణమని పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. దీంతో బాచుపల్లి పోలీసులు సీతారాం భార్య రేణుకతో పాటు ఆమె ప్రియుడు రమణా రెడ్డిని కూడా అరెస్ట్ చేశారు.
సీతారాం ఆత్మహత్యకు ప్రధానంగా అతని భార్య రేణుక వివాహేతర సంబంధాలు మాత్రమే కారణమని పోలీసులు ప్రాధమిక దర్యాప్తులో గుర్తించారు. రెండు నెలల తర్వాత సీతారాం రాసిన 19 పేజీల లేఖ బయటకు రావడంతో.. పోలీసులే వామ్మో అని ఆశ్చర్యపోతున్నారు. సాధారణంగా ఎలాంటి మహిళ అయినా సరే.. భర్త చనిపోతే.. కొద్ది రోజులైనా బాధ పడుతుంది. కానీ రేణుక మాత్రం.. ఫిబ్రవరిలో సీతారాం చనిపోతే.. మార్చి నెలలోనే ప్రియుడు రమణా రెడ్డిని పెళ్లి చేసుకుంది. ఇదేమంటే.. నా పెళ్లి నా ఇష్టం అంటూ ప్రశ్నించిన వారికి జవాబు చెప్పింది. దీంతో లోతుగా దర్యాప్తు చేసిన పోలీసులకు సీతారాం 19 పేజీల లేఖ దొరికింది.
ఈ సూసైడ్ నోట్‌లో రేణుక ఎలాంటిదో.. తన ప్రవర్తన ఎలా ఉంటుందో కళ్లకు కట్టినట్లుగా రుజువులతో సహా ప్రస్తావించారు సీతారాం. తన భార్య రేణుక ప్రవర్తన గురించి పూస గుచ్చినట్లుగా వివరించాడు. రేణకుకకు రమణారెడ్డితో పాటు మరో ఇద్దరితో వివాహేతర సంబంధాలు ఉన్నాయని.. తన ప్రియుడితో కలిసి ఉన్న ఏకాంత వీడియోలు, ఫోటోలను రేణుక స్వయంగా తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసినట్లు వెల్లడించాడు. ఆ వీడియోలు తనను తీవ్ర మనస్థాపానికి గురి చేశాయన్న సీతారాం.. భార్య చేస్తున్న ఈ పనుల వల్ల సమాజంలో తల ఎత్తుకోలేక పోతున్నానని, అందుకే తనువు చాలిస్తున్నానని 19 పేజీల సూసైడ్ నోట్‌లో రాశాడు.
Also Read : టీడీపీ ఎమ్మెల్యే సంచలన నిర్ణయం..!
సీతారాం ఆత్మహత్య, రేణుక వ్యవహారం ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారి తీసింది. రేణుక లాంటి వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రియుడిపై అంత మోజు ఉంటే భర్త సీతారాంకు విడాకులు ఇచ్చి.. ప్రియుడు రమణా రెడ్డితో వెళ్లిపోవచ్చు కదా.. అని అంటున్నారు. మరికొంతమంది అయితే పెళ్లికి ముందే ప్రేమ వ్యవహారం ఉన్నప్పుడు.. ధైర్యంగా ఇంట్లో ఎందుకు చెప్పలేదంటున్నారు. ముందే చెబితే.. సీతారాం చనిపోయే పరిస్థితి వచ్చేది కాదు కదా అంటున్నారు. ఇలాంటి వారి వల్ల కుటుంబ వ్యవస్థ నాశనం అవుతుందంటున్నారు. మరికొందరైతే.. ఇలాంటి ఘటనలపై గాయని చిన్మయ్, నటి అనుసూయ వంటి వారు ఎందుకు స్పందించటం లేదని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. సీతారాం, రేణుక వ్యవహారంపై సినిమా తీయగలరా అంటూ నటుడు, దర్శకుడు రాహుల్ రవీంద్రన్‌ను ట్యాగ్ చేస్తున్నారు.

