Friday, May 1, 2026 07:02 PM
Friday, May 1, 2026 07:02 PM

టీటీడీకి పవన్ లేఖ.. నానా పాట్లు పడుతున్న వైసీపీ..!

కూటమి ప్రభుత్వం ఏం చేసినా తప్పే.. అన్నట్లుగా ఉంది వైసీపీ నేతలు, అభిమానుల తీరు. అసలు అదేమిటి.. అది నిజమా కాదా.. దాని వల్ల ఉపయోగం ఉందా.. లేదా.. అనే కనీస విషయాలు కూడా తెలుసుకోవటం లేదు. ప్రతి చిన్న విషయానికి కూడా తాము చేసిందే రైట్ అన్నట్లుగా గొప్పలు చెప్పుకుంటున్నారు. అదే సమయంలో సోషల్ మీడియాలో కూడా ఓ పోస్ట్ పడేసి.. ప్రజలను తప్పుదోవ పట్టించేలా తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఈ పోస్టు వల్ల తమ పార్టీకి మరింత చెడ్డ పేరు వస్తుందనే కనీస పరిజ్ఞానం కూడా వైసీపీ నేతలు, అభిమానులకు లేకుండా పోయింది.

Also Read : తిరుమల కల్తీ నెయ్యి వ్యవహారం.. దోషి ఆయనే..!

తాజాగా ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కల్యాణ్ పేరుతో సిఫార్సు లేఖలు ఇచ్చారంటూ వైసీపీ అభిమాన పెయిడ్ ఆర్టిస్ట్ సోషల్ మీడియాలో ఓ లేఖ పోస్ట్ చేశారు. అయితే.. ఈ పోస్టు పెట్టిన తర్వాత కానీ తెలియటం లేదు.. వాళ్లు ఎంత అజ్ఞానంతో ఉన్నారనే విషయం. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి కొలువైన దివ్య క్షేత్రం తిరుమల. స్వామి వారి దర్శనానికి నిత్యం లక్షల్లో భక్తులు కొండకు వస్తున్నారు. ప్రతి రోజూ స్వామి వారికి 70 వేల మంది పైగా భక్తులు దర్శించుకుంటున్నారు. సాధారణ భక్తులతో పాటు వీఐపీ లేఖలపై కూడా బిగినింగ్ బ్రేక్ దర్శనం అని భక్తులకు టీటీడీ కల్పిస్తోంది.

ఎంపీలు, కేంద్ర, రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల లేఖలపై ప్రతి రోజు బిగినింగ్ బ్రేక్ దర్శన అవకాశం కల్పిస్తారు. ఒక లేఖపైన ఆరుగురు భక్తులు స్వామి వారిని దర్శించుకోవచ్చు. ఇందుకు సదరు ప్రజా ప్రతినిధి సిఫార్సు లేఖ తప్పనిసరి. ఈ విధానం చాలా ఏళ్లుగా టీటీడీలో కొనసాగుతోంది. ముందురోజే తిరుమల జేఈవో కార్యాలయంలో సిఫార్సు లేఖ అందించాల్సి ఉంటుంది. తాజాగా ఇలాంటి లేఖను డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కూడా జీ.రెడ్డప్ప అనే భక్తునికి ఇచ్చినట్లు ఓ లేఖ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నిజానికి ఇందులో ఎలాంటి తప్పు లేదు. ఈ లేఖ టీటీడీ నిబంధనల ప్రకారమే ఉంది. ఆరుగురు భక్తులను మాత్రమే అనుమతించారు. వారి నుంచి రూ.3 వేలు వసూలు చేశారు. వారికి బిగినింగ్ బ్రేక దర్శన అవకాశం కల్పించారు. అయితే ఈ లేఖను పవన్ కల్యాణ్ అమ్ముకున్నారంటూ వైసీపీ అభిమాని సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు.

“రోజు మాజీ మంత్రి ఆర్కే రోజా టీటీడీ టికెట్స్ అమ్ముకొంటున్నారు అని ఏడ్చే జన సైనికులు.. ఇప్పుడు ఏకంగా డిప్యూటీ సీఎం పవన్ అన్నయ్య గారే ఇలా లెటర్ ఇవ్వడం సమంజసమా..??? మరి ఇప్పుడు ఎంతకీ టీటీడీ టికెట్స్ అమ్ముకొన్నారు అని పవన్ అన్నయ్య ని ప్రశ్నిస్తే ఒప్పుకుంటారా..??? ఇలా అయితే సామాన్యుల భక్తులు పరిస్థితి ఏంటి???..” అంటూ తన అవివేకాన్ని బయటపెట్టాడు. అయితే ఈ పోస్టుకు జనసేన పార్టీ నేతలు, పవన్ అభిమానులు ఘాటుగా బదులిస్తున్నారు. “పవన్ కళ్యాణ్ గారు రోజా లాగా దగ్గర ఉండి దర్శనం చేయించారా? ఆయన లెటర్ ఇవ్వడం తప్ప భక్తుల కూడా ఆయన రాలేదే? మరి రోజా భక్తులతో దగ్గర ఉండి దర్శనం చేయించింది. వాళ్ల దగ్గర ముడుపులు పుచ్చుకుంది.” అంటూ కౌంటర్ ఇచ్చారు.

Also Read : చరిత్రలో తొలిసారి.. కార్పొరేట్ శైలిలో లోకేష్ వినూత్న ప్రచారం..!

నిజానికి వీఐపీ బ్రేక్ దర్శనాల గురించి మాట్లాడే అర్హత వైసీపీ నేతలు, అభిమానులకు లేదు. ఎందుకంటే.. నెలలో రెండు సార్లు మంత్రి హోదాలో, ఎమ్మెల్యే హోదాలో రోజా స్వయంగా తిరుమల శ్రీవారి దర్శనానికి వేల మందిని తీసుకెళ్లారు. ఒకసారి రోజాతో కనిపించిన వారు మరోసారి కనిపించే వారు కాదు. మరి వాళ్లంతా ఎవరూ అనే ప్రశ్నకు ఇప్పటి వరకు రోజా జవాబు చెప్పలేదు. ఇక చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పేరు మీద అయితే.. ఒక లేఖ పైనే ఏకంగా 30 నుంచి 40 మంది దర్శనం చేసుకున్న సందర్భాలున్నాయి. అయినా సరే.. దానికి ఎలాంటి వివరణ ఇవ్వలేదు. రోజా తనతో వచ్చిన వారి నుంచి వేల రూపాయలు వసూలు చేశారనే ఆరోపణలున్నాయి. వాటిని ఇప్పటికి కూడా రోజా ఖండించలేదు. ఇక సీఎంఓ లేఖ మీద 15 మందిని దర్శనానికి అనుమతివ్వాలని అడిగితే నాటి ఈవో ధర్మారెడ్డి నో చెప్పారని మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు స్వయంగా తిరుమలలోనే ఆగ్రహం వ్యక్తం చేశారు. కానీ పవన్ ఇచ్చిన లేఖ పైన ఆరుగురికే అనుమతి ఇచ్చారు. అయినా సరే.. వైసీపీ పేటిఎం బ్యాచ్ మాత్రం.. ప్రజల్లో లేని పోనీ అపోహలు సృష్టించేందుకు నానా పాట్లు పడుతోంది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

బ్రేకింగ్: కృష్ణా జిల్లాలో...

కృష్ణా జిల్లా తీర ప్రాంతంలో ప్రకృతి...

పెట్రోల్ బంకుల్లో కొత్త...

పెట్రోల్ బంకుల్లో మోసాలు రోజురోజుకూ కొత్త...

చరిత్రలో తొలిసారి.. కార్పొరేట్...

భారతదేశ విద్యా చరిత్రలో ముందెన్నడూ లేని...

సీఎం చంద్రబాబు.. పవన్...

15 ఏళ్ల పాటు సీఎంగా చంద్రబాబు...

తిరుమల కల్తీ నెయ్యి...

తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాద తయారీలో...

మాట తప్పిన కేంద్రం.....

కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్‌డీఏ సర్కార్...

పోల్స్