Saturday, September 19, 2026 01:01 PM
Saturday, September 19, 2026 01:01 PM

తిరుమల కల్తీ నెయ్యి వ్యవహారం.. దోషి ఆయనే..!

తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాద తయారీలో వాడే నెయ్యి కల్తీకి గురైన వ్యవహారంలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ ఘటనపై విచారణ జరిపేందుకు ప్రభుత్వం నియమించిన మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేష్ కుమార్ నేతృత్వంలోని ఏకసభ్య కమిషన్ తన నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది. ఈ నివేదికలో టీటీడీ మాజీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్‌ ను ప్రధాన దోషిగా కమిషన్ నిర్ధారించింది. నెయ్యి కల్తీకి దారితీసిన పరిస్థితులను అడ్డుకోవడంలో అనిల్ కుమార్ సింఘాల్ పూర్తిగా విఫలమయ్యారని కమిషన్ స్పష్టం చేసింది.

Also Read : మాట తప్పిన కేంద్రం.. బాదుడే బాదుడు..!

టీటీడీ ఈవోగా ఉన్న సమయంలో పాలనాపరమైన పర్యవేక్షణ లోపించడం, సరఫరాదారుల నిబంధనలను పక్కాగా అమలు చేయకపోవడం వల్లే ఈ అపచారం జరిగిందని నివేదిక పేర్కొంది. నెయ్యి సేకరణ ప్రక్రియలో పారదర్శకత లేకపోవడం, నాణ్యతా ప్రమాణాలను తనిఖీ చేసే వ్యవస్థలను నిర్వీర్యం చేయడం ద్వారా కల్తీ నెయ్యి సరఫరాకు పరోక్షంగా సహకరించారని కమిషన్ ఘాటు వ్యాఖ్యలు చేసింది. గత ప్రభుత్వ హయాంలో నెయ్యి టెండర్లకు సంబంధించిన నిబంధనలను ఉద్దేశపూర్వకంగా సడలించారని దినేష్ కుమార్ కమిషన్ గుర్తించింది.

Also Read : అబార్షన్ చట్టంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు..!

తక్కువ ధరకు నెయ్యి సరఫరా చేసే కంపెనీలకు మేలు చేకూర్చేలా నిబంధనలు మార్చడం వల్ల, నాణ్యత లేని కంపెనీలు రంగంలోకి దిగాయని తెలిపింది. 2019 నుంచి 2024 మధ్య కాలంలో దాదాపు 60 లక్షల కిలోల కల్తీ నెయ్యి తిరుమలకు సరఫరా అయిందని, దీని వెనుక భారీ అవినీతి కోణం దాగి ఉందని నివేదికలో వివరించారు. కేవలం అనిల్ కుమార్ సింఘాల్ మాత్రమే కాకుండా, అప్పటి అదనపు ఈవో ధర్మారెడ్డి, ఫైనాన్షియల్ అడ్వైజర్ బాలాజీలు కూడా తమ విధులను సక్రమంగా నిర్వర్తించలేదని కమిషన్ తేల్చింది. నాణ్యత లేని నెయ్యి వస్తున్నట్లు ఫిర్యాదులు అందినప్పటికీ, వారు స్పందించకపోవడం వెనుక ఉన్న ఉద్దేశాలను ప్రశ్నించింది. వీరి ముగ్గురిపై కఠిన క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని సిట్ ఇప్పటికే ప్రభుత్వానికి సిఫార్సు చేయగా, తాజా కమిషన్ నివేదిక ఆ సిఫార్సులను బలపరిచింది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

25 రోజుల తర్వాత...

ఏపీ డిప్యూటి సీఎం, జనసేన అధినేత...

ఏపీలో మద్యం షాపుల...

ఆంధ్రప్రదేశ్‌లో 2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను...

బాంబు పేల్చిన టీడీపీ...

గుంటూరు పశ్చిమ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ...

ఏపీ లిక్కర్ కుంభకోణం.....

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో గత వైఎస్సార్ కాంగ్రెస్...

రేవంత్ దెబ్బ.. బీఆర్ఎస్‌కు...

ఏదో అనుకుంటే.. మరేదో జరిగినట్లు ఉంది...

దానం నాగేందర్ కు...

ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే దానం నాగేందర్‌కు తెలంగాణ...

పోల్స్