Sunday, June 21, 2026 07:45 AM
Sunday, June 21, 2026 07:45 AM

మాట తప్పిన కేంద్రం.. బాదుడే బాదుడు..!

కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్‌డీఏ సర్కార్ మాట తప్పింది. అమెరికా – ఇరాన్ – ఇజ్రాయెల్ మధ్య కొనసాగుతున్న యుద్ధం కారణంగా వాణిజ్య ఎల్‌పీజీ సిలిండర్ల ధరలను కేంద్రం భారీగా పెంచింది. పశ్చిమాసియాలో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో గ్యాస్, పెట్రోల్, డీజిల్ సరఫరాపై పెను ప్రభావం పడింది. దీంతో గ్యాస్, పెట్రోల్ ధరల పెంపు ఖాయమనే మాట చాలా రోజులుగా వినిపిస్తోంది. అయితే కేంద్రం మాత్రం అలాంటిది ఏమీ లేదని వాదిస్తూ వచ్చింది. కానీ సరిగ్గా ఐదు రాష్ట్రాల ఎన్నికల పోలింగ్ ముగిసిన వెంటనే ముందుగా కమర్షియల్ గ్యాస్ వినియోగదారులకు కేంద్రం పెద్ద షాక్ ఇచ్చింది. కమర్షియల్‌ గ్యాస్‌ సిలిండర్‌ ధరల్ని భారీగా పెంచినట్లు ప్రకటించింది.

బ్రేకింగ్ : టీడీపీ ‘మహానాడు’ వేదిక మార్పు..!

మే 1, 2026, శుక్రవారం నుంచి వాణిజ్య ఎల్‌పీజీ సిలిండర్ల ధరలు సగటున రూ.993 మేర పెరిగాయి. ఢిల్లీలో వాణిజ్య ఎల్‌పిజి సిలిండర్ తాజా ధర ఇప్పుడు రూ.3,071.50గా ఉంది. గృహ వినియోగ సిలిండర్ల ధరల్లో ఎలాంటి మార్పు లేదని, దేశ రాజధానిలో 14.2 కేజీల సిలిండర్ ధర రూ.913గా ఉందని ఇండియన్ ఆయిల్ సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. సాధారణంగా చమురు సంస్థలు ప్రతి నెలా ప్రారంభంలో ఎల్పీజీ ధరలను సవరిస్తాయి. పశ్చిమ ఆసియాలో ఘర్షణలు తీవ్రతరం కావడం, మే నుంచి ధరలు పెరుగుతాయని ముందే అంచనా వేయడం వల్ల గృహ, వాణిజ్య సిలిండర్ల ధరలను చివరిసారిగా ఏప్రిల్‌లో సవరించారు. గత నెలలో 14.2 కేజీల గృహ ఎల్పీజీ సిలిండర్ ధరను రూ.60 పెంచారు. మార్చి 7న రూ.114.5 మేర పెంచిన తర్వాత, ఏప్రిల్‌లో మెట్రో నగరాల వ్యాప్తంగా 19 కేజీల వాణిజ్య ఎల్‌పిజి సిలిండర్ ధర రూ.196 పెరిగింది.

Also Read : అబార్షన్ చట్టంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు..!

ప్రపంచ చమురు, సహజ వాయువు రవాణాలో 20 శాతానికి పైగా బాధ్యత వహించే కీలకమైన హోర్ముజ్ జలసంధిని మూసివేయడం వల్ల ధరలు భారీగా పెరిగాయి. బ్లాక్ మార్కెటింగ్, నిల్వల కారణంగా దేశవ్యాప్తంగా ప్రజలు ఎల్‌పీజీ సిలిండర్ల కోసం ఎగబడుతుండటంతో, భారతదేశం ఇప్పటికే ఎల్‌పీజీ సరఫరా కొరతను ఎదుర్కొంటోంది. ఎల్‌పీజీ సిలిండర్ బుకింగ్‌కు సంబంధించి అత్యంత ముఖ్యమైన, కీలకమైన మార్పుల్లో ఒకటి, నిరీక్షణ సమయం పెరగడం. పట్టణ ప్రాంతాల్లో, ఎల్‌పీజీ వినియోగదారులు ఇప్పుడు 21 రోజులకు బదులుగా 25 రోజుల తర్వాత మాత్రమే రీఫిల్ బుక్ చేసుకోగలుగుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో, ఈ వ్యవధి 45 రోజులు దాటి పోయింది కూడా. ఒకవేశ నిర్దేశించిన సమయానికి ముందే బుక్ చేసుకోవడానికి ప్రయత్నిస్తే మాత్రం సిస్టమ్ ఆ అభ్యర్థనను తోసి పుచ్చుతుంది.

Also Read : అబార్షన్ చట్టంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు..!

అయితే గ్యాస్, పెట్రోల్ ధరల పెంపు తప్పదని చాలా రోజులుగా సోషల్ మీడియాలో పుకార్లు షికారు చేస్తున్నాయి. తమిళనాడు, కేరళం, పశ్చిమ బెంగాల్, అసోమ్ ఎన్నికల తర్వాత ధరలు పెరుగుతాయని ముందు నుంచి వినిపిస్తోంది. అయితే కేంద్ర పెద్దలతో పాటు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ సైతం ఈ పుకార్లను తోసి పుచ్చారు. అలాంటి ప్రతిపాదన కేంద్రం దగ్గర లేదన్నారు. కానీ 5 రాష్ట్రాల ఎన్నికల పోలింగ్ ముగిసిన వెంటనే అంతా ఊహించినట్లుగానే కేంద్రం షాక్ ఇచ్చింది. ముందుగా కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల ధర పెంచింది. దీంతో తర్వాత పెట్రోల్, డీజిల్ ధరల పెంపు ఖాయమంటున్నారు విశ్లేషకులు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

తిరుపతిలో కేఎఫ్‌సీ, డొమినోస్‌...

ప్రముఖ అంతర్జాతీయ ఫుడ్ బ్రాండ్ల ఆహార...

తిరుపతిలో వడ్డీ మాఫియా.....

తిరుపతి నగరంలో వడ్డీ వ్యాపారం పేరుతో...

సాయికృష్ణ కేసులో వైసీపీ...

విజయవాడ రౌడీ షీటర్‌ గాదె సాయికృష్ణ...

బ్రేకింగ్: అల్లు అర్జున్‌...

హైదరాబాద్‌లోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్ సంధ్య...

తెలంగాణాలో జనసేన తొలి...

గత కొన్నాళ్ళుగా తెలంగాణాలో పార్టీ బలోపేతం...

బ్రేకింగ్: కొడాలి అరెస్ట్...

ఏపీలో వైసీపీ కీలక నేతలకు చట్టపరమైన...

పోల్స్