Friday, May 1, 2026 07:54 PM
Friday, May 1, 2026 07:54 PM

వైరల్ అవుతున్న 30 ఏళ్ల నాటి న్యూస్ పేపర్..!

ప్రస్తుతం అంతా ఆన్‌లైన్. చేతిలో ఓ మొబైల్ ఫోన్.. అందులో ఇంటర్‌నెట్ డేటా ఉంటే చాలు.. ప్రపంచమే మీ చేతుల్లో ఉంటుంది. అందుకే రిలయన్స్ సంస్థ 2003లో తొలిసారి మొబైల్ నెట్‌వర్క్ లాంచ్‌ చేసినప్పుడు దునియా ముట్టీమే.. ప్రపంచమే మీ గుప్పిట్లో.. అనే ట్యాగ్ లైన్ యాడ్ చేసింది. అప్పటి వరకు ఇంటర్ నెట్ అంటే తెలియని వారు కూడా.. రిమ్ ఫోన్, అందులో డేటా, సినిమాలు చూడటం మొదలు పెట్టారు. నెట్ అందుబాటులోకి వచ్చిన తొలి రోజుల్లో నెల మొత్తానికి 1 జీబీ డేటాను నెట్‌వర్క్ ప్రొవైడర్లు అందించే వారు. కానీ ఇప్పుడు రోజుకు 2 జీబీ నుంచి అన్ లిమిటెడ్ వరకు అందిస్తున్నారు. దీంతో ఇప్పుడు ఏ చిన్న విషయం అయినా సరే.. క్షణాల్లో తెలిసిపోతుంది.

Also Read : హోటల్ తిండి సామాన్యుడికి ఇక గగనమే..?

అయితే సరిగ్గా 30 ఏళ్లు వెనక్కి వెళ్తే.. అంటే ఫోన్‌లు, కంప్యూటర్ దాదాపుగా లేని టైమ్‌లో పరిస్థితి ఎలా ఉండేది.. ఇప్పుడంటే.. పరీక్షల ఫలితాలు వెల్లడించిన సెకన్ల వ్యవధిలోనే ఇంటర్‌నెట్‌లో చూసుకుంటుున్నారు. కంప్యూటర్, లాప్‌టాప్, మొబైల్‌ ఎస్ఎంఎస్, వాట్సప్ ద్వారా ఇలా హాల్ టికెట్ నంబర్ టైప్ చేయగానే.. అలా రిజల్ట్స్ తెలిసిపోతున్నాయి. మరి ఇంటర్‌నెట్ అందుబాటులో లేని ఆ రోజుల్లో.. అప్పుడు పరీక్షల ఫలితాలు ఎలా తెలుసుకునే వారు అనేది ఇప్పుడు చాలా మందికి తెలియని విషయం.

ప్రస్తుతం సెకన్ల వ్యవధిలో రిజల్ట్స్ తెలిసిపోతుంది. కానీ.. అప్పట్లో మాత్రం.. ప్రభుత్వం ఫలితాలు విడుదల చేసిన మరుసటి రోజు మాత్రమే అవి తెలిసే అవకాశం ఉంది. అది కూడా కేవలం న్యూస్ పేపర్ ద్వారా మాత్రమే. ఇప్పుడు సోషల్ మీడియాలో 30 ఏళ్ల నాటి పేపర్ క్లిప్పింగ్ వైరల్‌గా మారింది. పదవ తరగతి పరీక్షల రిజల్ట్స్ ఇలానే చూసుకునే వారు. వార్త పత్రికలో రోల్ నెంబర్ ఆధారంగా ప్రథమ శ్రేణి, ద్వితీయ శ్రేణి, తృతీయ శ్రేణి అని మూడు భాగాలుగా రిజల్ట్స్ వచ్చేవి. అందరూ ఉదయం న్యూస్ పేపర్ కోసం ఆసక్తిగా, ఆతృతతో ఉత్కంఠగా ఎదురు చూసేవారు. లేదంటే ప్రతి స్కూల్‌కు ఫలితాల జాబితా పోస్టు ద్వారా వచ్చేది. స్కూల్ నోటీస్ బోర్డ్ మీద అవి పెట్టేవారు. స్టూడెంట్స్ అక్కడికి వెళ్లి తమ నంబర్ ఉందా లేదా.. పాస్ అయ్యామా.. లేదా అని ఆసక్తిగా చూసుకునేవారు.

Also Read : హోటల్ తిండి సామాన్యుడికి ఇక గగనమే..?

ఇక్కడ మరో విషయం ఏమిటంటే.. ఇప్పటిలా 600కి 590 దాటాయా లేదా అనే ఆలోచన లేని కాలం అది. 360 మార్కులు దాటి ఫస్ట్ క్లాస్ వచ్చిందా ఇక ఆ కుటుంబలో అంతా సంబరమే. 300 – 359 మార్కులతో సెకండ్ క్లాస్ అని, 210 – 299 మార్కులతో థర్డ్ క్లాస్ అని ఇలా ఉండేది. ముందు అయితే పాస్ అయ్యారా లేదా అనేది ఎక్కువ చూసేవారు. పేపర్‌లో నంబర్ ఉంటే చాలు.. హమ్మయ్య అనుకునే రోజులవి. ఇక ఫస్ట్ క్లాస్‌లో పాసైన వారి గురించి అయితే ప్రత్యేకంగా చర్చించుకునే వారు. అంతే తప్ప.. ఇప్పటి మాదిరిగా మీ వాడికి ఎన్ని.. 550 మాత్రమేనా.. మా పాపకు అయితే 570 అని.. ఆ పక్కింటి వాళ్ల అబ్బాయికి అయితే 580 దాటాయంట కదా.. అనే మాట ఉండేది కాదు. పేపర్‌లో కూడా ఫస్ట్, సెకండ్, థర్డ్ క్లాస్‌తో పాటు కంపార్ట్‌మెంటల్ అనే విభాగం కింద ఉంటుంది. అంటే ఫెయిల్ అయిన వాళ్లు సెప్టెంబర్, మార్చి నెలలో రాసుకునేదన్న మాట. పదవ తరగతి ఫలితాలు విడుదలైన నేపథ్యంలో ఇప్పుడు 1996 నాటి పేపర్ క్లిప్పింగ్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

టీటీడీకి పవన్ లేఖ.....

కూటమి ప్రభుత్వం ఏం చేసినా తప్పే.....

బ్రేకింగ్: కృష్ణా జిల్లాలో...

కృష్ణా జిల్లా తీర ప్రాంతంలో ప్రకృతి...

పెట్రోల్ బంకుల్లో కొత్త...

పెట్రోల్ బంకుల్లో మోసాలు రోజురోజుకూ కొత్త...

చరిత్రలో తొలిసారి.. కార్పొరేట్...

భారతదేశ విద్యా చరిత్రలో ముందెన్నడూ లేని...

సీఎం చంద్రబాబు.. పవన్...

15 ఏళ్ల పాటు సీఎంగా చంద్రబాబు...

తిరుమల కల్తీ నెయ్యి...

తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాద తయారీలో...

పోల్స్